E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: సాగర్ కు నర్మద వార్నింగ్.. సుక్కుకు ప్రేమ వార్నింగ్.. వల్లి నెక్స్ట్ ప్లానేంటి..?

Illu Illalu Pillalu Today Episodes: సాగర్ కు నర్మద వార్నింగ్.. సుక్కుకు ప్రేమ వార్నింగ్.. వల్లి నెక్స్ట్ ప్లానేంటి..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode October 13th: ఇంట్లోని వాళ్ళందరూ కూడా బల్లి చేసిన మోసాన్ని మర్చిపోలేక ఆలోచిస్తూ ఉంటారు. కానీ అప్పుడే ప్రసాద్ రావు ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్అ వుతారు. ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల గురించి తెలుసుకొని ఈయన మనల్ని ఏదో ఒకటి అనడానికి వచ్చి ఉంటాడు అని అందరూ అనుకుంటారు.  కానీ ప్రసాద్ రావు తన కూతురు అల్లుడికి పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పగానే అందరూ వాళ్ళ పెళ్లిరోజు నీకు గుర్తుచేసుకొని శుభాకాంక్షలు చెప్పారు. అయితే పెళ్లి రోజు వేడుకలని గ్రాండ్గా చేయాలి అని ప్రసాదరావు ఆయన భార్య అడగగానే రామరాజు సరి అని అంటాడు.. నర్మద ఎంత వద్దన్నా సరే రామరాజు మాత్రం మీ పెళ్లి రోజు ముచ్చటిని అసలు వదిలేయకూడదు అని అంటాడు.

సుకన్య దొరికిపోతుందా..?

ఇంట్లో నర్మదా సాగర్ల పెళ్లిరోజు గురించి వల్లికి ఎలాగైనా సరే చెప్పాలి అని సుకన్య ఎవ్వరు లేని ప్లేసుకొచ్చి ఫోన్ చేసి చెప్తుంది. శ్రీవల్లి తన బావ కోసం నేను మళ్ళీ ఆ ఇంటికి రావాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. సుకన్య చందు ఇక్కడికి వస్తే నేను కచ్చితంగా చంపేస్తాడు అని చెప్పిన కూడా అయినా పర్వాలేదు నా బావ చేతిలో నేను చచ్చిపోవడానికి కూడా రెడీ అని శ్రీవల్లి అంటుంది. తన కాపురాన్ని కూల్చేసిన నర్మదపై ఎలాగైనా సరే రివెంజ్ తెచ్చుకోవాలి అని శ్రీవల్లి ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది.. అయితే సుకన్య శ్రీవల్లితో మాట్లాడిన విషయం తిరుపతికి తెలిసిపోయేలా కనిపిస్తుంది..

సాగర్ కు నర్మద వార్నింగ్..

Advertisement

సాగర్ నర్మదల పెళ్లిరోజు కోసం ప్రేమ ధీరజ్ లు వాళ్ళని బాగా రెడీ చేస్తూ ఉంటారు. నర్మదా ఇంట్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు పెళ్లి రోజు చేసుకోవడం అవసరమా అని అంటుంది. వల్లి ఇంట్లో చేసిన పని వల్ల ఇంటిల్లిపాది అందరూ బాధపడుతున్నారు. అత్తయ్య మామయ్య తో పాటుగా చందు బావ కూడా చాలా బాధపడి పోతున్నారు. ఇలాంటి సమయంలో మా పెళ్లి రోజు గురించి మా అమ్మ నాన్న చేసుకోవాలని మొండిగా ఉంటున్నారు. కానీ మీరు కూడా ఎందుకలా ఉంటున్నారు అని నర్మదా అడుగుతుంది. ఆ వల్లి పాపం చేసింది ఆ పాపాలు పండి బయటికి వెళ్లిపోయింది దానికోసం మీరు ఎందుకక్కా మీ సంతోషమైనా రోజుని వద్దనుకుంటున్నారు అని ప్రేమ అంటుంది. ఇక సుకన్య మధ్యలో వచ్చి ఎంట్రీ ఇవ్వడంతో ప్రేమ ఒక్కసారిగా సుకన్య పై విరుచుకుపడుతుంది. వల్లిలాగా చేసావంటే నీ జీవితం ఎలా ఉంటుందో అసలు ఊహించలేవు అని వార్నింగ్ ఇస్తుంది.

వల్లికి తోడుగా భద్ర..

వల్లి కాపురాన్ని ఎలాగైనా నిలబెట్టాలి అని భాగ్యం మందిని తీసుకొని వెళ్లి గొడవ పెట్టుకోవాలని అనుకుంటుంది. ఇక వల్లి కూడా తాడు తెచ్చుకుని నన్ను పో ఇంట్లోకి ప్రవేశం లేకపోతే నేను చచ్చిపోతాను అని బెదిరిస్తాను అని అంటుంది. అప్పుడే ఇంట్లోకి వచ్చిన భద్ర సేన మీకు సాయం చేయాలని నాకు అస్సలు లేదు. కాకపోతే నువ్వు ఆ ఇంట్లో ఉండడం నాకు చాలా మంచిది అందుకే నీకు సాయం చేయాలనుకుంటున్నాను అని భద్ర అంటుంది. అయితే వల్లి వాళ్ళకి ఒక ప్లాన్ చెప్తుంది భద్ర చెప్పిన ప్లాన్ ని నేను అస్సలు చేయను అని వల్లి అంటుంది. అలా చేస్తే వాళ్ళు చాలా బాధపడిపోతారు అని ఎంత చెప్తున్నా సరే వినకుండా భాగ్యం భద్ర చెప్పినట్టు వింటే బాగుంటుంది అని భద్ర వెనకాలే వెళ్ళిపోతారు.

చందు, రామరాజు కన్నీళ్లు..

Advertisement

నర్మదాసాగర్ల పెళ్లిరోజు వేడుకలను ఘనంగా పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లను చేస్తారు. అంతా వచ్చి సిద్ధంగా ఉన్నా కూడా రామరాజు గదిలో కూర్చొని బాధ పడిపోతూ ఉంటాడు. అయితే చందు నేను వెళ్లి నాన్నని తీసుకొని వస్తాను అని వెళ్తాడు చందులు చూసిన రామరాజు ఇంకాస్త కన్నీళ్లు పెట్టుకుంటాడు. నువ్వు పదే పదే నాకు క్షమాపణ చెప్పొద్దు నాన్న నా జీవితం ఎలా రాసిపెట్టి ఉంటే అలానే జరుగుతుంది అంతేగాని నా గురించి మాత్రం అస్సలు బాధపడొద్దు నాన్న నేను బాగానే ఉన్నాను అని చందు అనగానే రామరాజు ఎమోషనల్ అయిపోతాడు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వల్లి చేసిన మోసాన్ని తలుచుకొని బాధపడిపోతూ ఉంటారు. ఇక నర్మదా సాగర్ల పెళ్లిరోజు గురించి ఇంట్లోని వాళ్ళందరూ కూడా సందడిగా ఉంటారు.

గ్రాండ్ గా వేడుకలు..

ఇక ఇంట్లోనే వాళ్ళందరూ కలిసి సాగర్ నర్మదల పెళ్లిరోజుని చాలా గ్రాండ్ గా చేయాలని అనుకుంటారు. అందరూ సరదాగా ఉన్నా కూడా నర్మద మాత్రం బాధపడిపోతూ ఉండడంతో అందరూ కాస్త నవ్వచ్చు కదా ఈరోజు మీ పెళ్లి రోజు కదా అని ఎంతగా అడుగుతున్నా సరే నర్మద మాత్రం అస్సలు నవ్వకుండా ఉంటుంది. ఇక తిరుపతి సుకన్య కలిసి నర్మదని నవ్వించే ప్రయత్నం చేస్తూ డాన్సులతో అదరగొట్టేస్తుంటారు. ఇల్లంతా నర్మదా సాగర్ల పెళ్లిరోజు సందర్భంగా హడావిడిగా సందడిగా ఉంటుంది. అందరూ కూడా సంతోషంగా ఉండడం చూసిన భద్ర నవ్వుకోండి ఈ నవ్వులు మరికాసేపట్లో దూరమవుతాయి అంటూ అనుకుంటుంది. పాతికేయలు నా పగ ఇప్పుడు తీరిపోతుంది అని భద్ర చాలా సంతోషంగా ఉంటుంది. రామరాజు ఇంటికి పోలీసులు రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు అయితే వచ్చిన ఆ లేడీ ఎస్సై శ్రీవల్లి రామరాజు వేదవతి చంద్రులపై కేసు పెట్టింది. మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అని అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :మంగళవారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Related News

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. కమల్, అవని అరెస్ట్.. పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 13th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని వైజయంతి వదిలేసినట్టేనా..?  

Karthika Deepam 2 Serial Today Episode October 13th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న కోసం సూరజ్ కాలర్ పట్టుకున్న కార్తీక్              

Tuesday Tv Movies : మంగళవారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

దూసుకెళ్తున్న బతుకమ్మ పాటలు.. మంగ్లీ నుంచి మధుప్రియ వరకు ఎవరి పాటలకు ఎంత క్రేజ్?

సుధీర్‌కు అంత క్రేజ్ ఉన్నా.. హీరోగా ఎందుకు సక్సెస్ కావట్లేదంటే ?

నన్ను బ్లాక్ చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ!

Big Stories

Advertisement
×