Karthika Deepam 2 serial today Episode: సూరజ్ ఇంటికి వెళ్లి మాలినిని నిలదీస్తాడు. వాళ్ల మీద రివైంజ్ తీర్చుకున్నాము ఇంకా వాళ్లను వదిలిపెట్టడం లేదేంటమ్మా అని ప్రశ్నిస్తాడు. అందుకు మాలిని బాధపడినట్టు నటిస్తుంది. తన మాటలతో సూరజ్‌ను రెచ్చగొడుతుంది. మీ తాత షర్ట్ చింపేసి అవమానించారు. నిన్ను కొట్టి ఆ జ్యోత్స్న అవమానించింది. నా కొడుకు, నా మామన అవమానిస్తే నేను కూరుకుంటాను.. అంతకు అంత డబుల్ రివైంజ్ తీర్చుకుంటాను నేను చేసేది తప్పైనా సరే నువ్వు నన్నే సపోర్ట్ చేయాలి. అంటూ మాలిని తన మాటలతో సూరజ్‌ను రెచ్చగొట్టి కన్వీన్స్ చేస్తుంది.
కాంచన ఇంటికి వెళ్లిన శివనారాయణ కోపంగా కార్తీక్‌ను తిడతాడు. మౌనంగా ఉన్నానని మీ ఇంట్లో ఉంటాననుకోకు.. మాకు ఈ పరిస్థితి రావడానికి కారణం మీరే అంటూ శివనారాయణ తిడుతుంటే.. కార్తీక్ మాత్రం కూల్‌గా సరే తాత మేము తప్పు చేశాము అంటున్నావు కదా ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం కూడా మాకే ఇవ్వు తాత. అంతవరకు ఇక్కడే ఉండండి అని చెప్తాడు కార్తీక్. నీకు అంత కోపంగా ఉంటే నన్ను కొట్టు కానీ ఇక్కడి నుంచి మాత్రం వెళ్లొద్దు తాత నీకు వదిలేయడం తెలిస్తే నాకు పట్టుకోవడం తెలుసు తాత అంటాడు.. అందుకు శివనారాయణ కోపంగా ఒకరి దయాదాక్షిణ్యాల మీద మేము బతకడం నాకు నచ్చదు.. ఒకరికి రుణపడటం కూడా నాకు నచ్చదు అనగానే.. అయితే మా ఇంట్లో మీరు పెయింగ్ గెస్టులుగా ఉండండి తాత అని చెప్తాడు. శివనారాయణ అందుకు ఒప్పుకుంటాడు.
ఆరుబయట నిల్చుని ఆలోచిస్తున్న జ్యోత్స్నకు రోడ్డు మీదుగా సూరజ్ వెళ్లడం చూస్తుంది. వెనకాలే వెళ్లి సూరజ్ ను తిడుతుంది. మేము శత్రువులం అనుకున్నప్పుడు మమ్మల్ని మళ్లీ ఎందుకు ఫాలో అవుతున్నావు.. వీళ్ల బతుకులు రోడ్డున పడేశాం ఎలా బతుకుతున్నారో తెలుసుకుందామని వచ్చావా..? అంటూ ప్రశ్నిస్తుంది. ఓహో మేము ఎలా ఉన్నామో తెలుసుకోమని మీ అమ్మ డ్యూటీ వేసిందా…? శివనారాయణ కుంటుంబం వాళ్ల కూతురు ఇంట్లో తలదాచుకుందని మీ అమ్మతో చెప్పు అప్పుడు మీ మరో ప్లాన్ వేసి మా అత్త కుటుంబాన్ని కూడా రోడ్డుకు ఈడుస్తుందేమో అంటూ జ్యోత్స్న తిడుతుంటే.. సూరజ్ ఎమోషనల్ అవుతూ అలా జరుగుతుందని తనకు తెలియదని.. తనకు తెలిసే లోపే మీరంతా రోడ్డు మీద ఉన్నారని కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను మా అమ్మకే సపోర్టుగా ఉండాలని సూరజ్ చెప్తాడు. చిన్నప్పటి నుంచి తన తండ్రిని గుర్తు చేసుకుని బాధపడిన రోజులు చెప్తాడు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో అమ్మ పడిన కష్టాలు గురించి చెప్తాడు. తన తల్లి చెడ్డది కాదని తన కన్నీళ్లను ఆపేందుకు ఏదైనా చేస్తానని చెప్పి వెళ్లిపోతాడు సూరజ్.
మాలిని ఇంటికి కార్తీక్, దీప వెళ్తారు. సొంత ఇల్లులాగా డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లి టిఫిన్ వడ్డించుకుంటారు. అప్పుడే మాలిని వస్తుంది. తాము చాలా మంచివాళ్లమని చెప్తుంది మాలిని. కార్తీక్ కోపంగా మాలిని తిట్టి సుమిత్ర పరిస్థితి గురించి ఆలోచించవా..? ఇంటి అడపడచును కష్టాల్లోకి నెట్టే నువ్వు ఆడదానివేనా అంటూ నిలదీస్తాడు. మేనకోడలు పెళ్లి ఆపేశావ్. ఆడపడుచు కుటుంబాన్ని రోడ్డున పడేశావ్. పది మందికి తిండి పెట్టే కుటుంబానికి తిండి లేకుండా గుడిలో పడుకునేలా చేశావు అంటూ తిడుతుంటే.. చాటు నుంచి దక్షిణమూర్తి మొత్తం వింటాడు. షాకింగ్‌గా తన కూతురుకు ఏమైందని వచ్చి కార్తీక్‌ను అడుగుతాడు. మాలిని షాక్ అవుతుంది. దక్షిణమూర్తికి నిజం తెలుస్తుందేమోనని మాలినే కోపంగా కార్తీక్, దీపలను తిడుతూ.. కొత్త నాటకాలు ఆడుతున్నారా..? ఇంకా మీరు చేసిన అమనామనాలు సరిపోలేదా అంటూ తిడుతుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్ అయిపోతుంది.