E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode September 22nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ కు వార్నింగ్ ఇచ్చిన కార్తీక్, దీప           

Karthika Deepam 2 Serial Today Episode September 22nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ కు వార్నింగ్ ఇచ్చిన కార్తీక్, దీప           
Advertisement

Karthika Deepam 2 serial today Episode: మాలిని ఇంటికి వెళ్లిన కార్తీక్‌, దీపలు కోపంగా మాలినిని తిడుతూ.. అక్కడే ఉన్న దక్షిణమూర్తిని తిడుతూ నువ్వు సాధించిందేంటి..? కన్న కూతురు మనవరాలు రోడ్డున పడటమేనా..? తాత అని ప్రశ్నిస్తారు. భర్త చావు అడ్డం పెట్టుకుని ఘోరాలు చేస్తున్నావు.. సూరజ్‌ను అడ్డుపెట్టుకుని శివనారాయణ ప్యామిలీని మోసం చేశానని సంతోషపడుతున్నావు కానీ సూరజ్‌లో విషం నింపుతున్నావన్న విషయం మర్చిపోతున్నావు.. అంటూ కార్తీక్‌ వార్నింగ్‌ ఇస్తే..

దీప కూడా కోపంగా దక్షిణమూర్తిని మాలినిని తిడుతుంది. ఎదుటి వాళ్ల నుంచి లాగేసుకోవడమే గెలుపు అనుకోకు తాత.. మా వాళ్లకు మేము సాయం చేయలేని స్థితికి తీసుకొచ్చారు. మీరు లాక్కున్న శివన్నారాయణ గారి యావదాస్తికి సంబంధించిన సంతకాలు నేను పక్కనుండి చేయించాను. నాతో పాటు నా భర్త కూడా మాటలు పడుతున్నాడు. అంటూ దీప చెప్తుంది. అయితే కార్తీక్, దీపలు దక్షిణమూర్తికి నిజం చెప్పేస్తారేమోనని మాలిని మనసులో భయపడుతుంది. కార్తీక్‌, దీపలను తిడుతూ మ్యాటర్‌ డైవర్ట్‌ చేయాలని చూస్తుంది. కానీ కార్తీ్‌క్‌ కోపంగా పిన్ని ఇప్పటి వరకు నాలో శాంతమూర్తిని చూశారు.. నా కుటుంబం జోలికి వస్తే రుద్రమూర్తిని అవుతా నా వాళ్ల కోసం ఎంత దూరం అయినా వెళ్తా.. నా వాళ్లు నా దగ్గరే ఉన్నారు.. నాతోనే ఉంటారు. నా సంరక్షణలో ఉంటారు. నువ్వు తీసుకున్నవి అన్నీ నీతో ఇప్పించేలా చేస్తా..  అంటూ వార్నింగ్‌ ఇచ్చి దీపను తీసుకుని బయటకు వచ్చేస్తాడు కార్తీక్‌.

Advertisement

అప్పుడే ఇంటికి వచ్చిన సూరజ్‌ వాళ్లకు ఎదరుపడతాడు. సూరజ్‌ను చూసిన కార్తీక్‌, దీపలు మౌనంగా వెళ్లిపోతుంటే.. సూరజే దీపను వదిన అంటూ పలకరిస్తాడు. దాంతో కార్తీక్ కోపంగా సూరజ్‌ ను తిడతాడు. నమ్మించి మోసం చేసి ఒక కుటుంబం రోడ్డున పడేలా చేశావు.. ఇప్పుడు ఏమీ తెలియనట్టు పలకరిస్తున్నావా..? అంటూ నిలదీస్తాడు. నీ కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నావు.. మీ అమ్మ ఏం చెప్తే అదే నిజమని గుడ్డిగా నమ్ముతున్నావు.. ఏదో ఒకరోజు నిజం తెలుసుకుంటావు.. ఆరోజు నిన్ను ఓదార్చడానికి ఎవ్వరూ ఉండరు సూరజ్‌. నీలో ఇంకా మంచి వ్యక్తి ఉన్నాడని మేము నమ్ముతున్నాము.. ఎందుకంటే దీపను బిడ్డను కాపాడినప్పుడే నీలో మంచి ఇంక బతికే ఉందనిపించింది అంటూ చెప్పి వెళ్లిపోతారు.

ఇంట్లో దక్షిణమూర్తి కోపంగా ఏం  చేశావు మాలిని నువ్వు నా కూతురును రోడ్డుపాలు చేశావా..? అంటూ కోపంగా తిడుతుంటే.. మాలిని చాకచక్యంగా మాట్లాడుతుంది. తన మాటలతో దక్షిణమూర్తి మూడ్‌ను మార్చేస్తుంది. మాలిని తప్పు చేసిందేమోనని అనుమానపడిన దక్షిణమూర్తిని తన మాటలతో పూర్తిగా కన్వీన్స్‌ చేస్తుంది మాలిని. చివరకు దక్షిణమూర్తి ఎమోషనల్‌ అవుతూ.. తనకు కూతురైనా కొడుకైనా నువ్వేనమ్మా అంటూ చెప్పేలా చేస్తుంది.

Advertisement

శౌర్యను తీసుకుని బయటకు వెళ్తుంది జ్యోత్స్న. శౌర్య ఐస్‌క్రీమ్‌ అడిగితే తన దగ్గర డబ్బులు లేవని జ్యోత్స్న చెప్తుంది. అప్పడే వచ్చిన సూరజ్‌ విషయం కనుక్కుని శౌర్యకు ఐస్‌క్రీమ్‌ కొనిస్తాడు. జ్యోత్స్న కోపంగా తిడుతూ మా చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు.. మీ అమ్మ మాకు కాపలా పెట్టిందా..? ఐస్‌క్రీమ్‌ డబ్బులు వంద రూపాయలు ఇంటికి వెళ్లాక పంపిస్తానని చెప్తుంది. నీ దగ్గర డబ్బులు లేవని నేను కొనిచ్చాను అంటాడు సూరజ్‌. కార్లలో తిరిగే మమ్మల్ని ఐస్‌క్రీమ్‌ కూడా కొనలేని స్థితికి తీసుకొచ్చింది మీరే కదా అంటూ జ్యోత్స్న కోపంగా తిడుతుంది.

తర్వాత కార్తీక్‌, దీప ఇంటికి వస్తారు. జ్యోత్స్న బయట కూర్చుని ఉంటుంది. దీప, జ్యోత్స్నకు బట్టలు ఇస్తుంది. జ్యోత్స్న ప్లాష్‌ బ్యాక్‌ గుర్తు చేసుకుని బాధపడుతుంది. ఒకప్పుడు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను.. ఇప్పుడు నేను మీ దగ్గరే సాయం తీసుకుంటున్నాను కర్మ ఎవరైనా అనుభవించాల్సిందే కదా అంటూ ఎమోషనల్‌ అవుతుంది జ్యోత్స్న.  ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Gundeninda GudiGantalu Today episode: చింతామణి ప్లాన్ సక్సెస్..కన్నీళ్లు పెట్టుకున్న మీనా..బాలు ట్విస్ట్..

Podarillu Today Episode : మహా సీరియస్.. పెద్ది, మనీష రొమాన్స్.. చక్రికీ లాయర్ షాక్..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ ఎమోషనల్.. నర్మదకు దొరికిపోయిన వల్లి.. పాపం వల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి అడ్డంగా ఇరుక్కుంది..? అవనికి టెన్షన్.. చివరిలో ట్విస్ట్..

Ninnu kori Serial Today Episode September 22nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం చెప్పిన చంద్ర 

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఆ రెండు సీరియల్స్ అవుట్..

యూట్యూబర్ నందన దంపతులకు మరో షాక్.. బిగుస్తున్న ఉచ్చు!

Big Stories

Advertisement
×