Rashid Latif Nauman Niaz On IND VS PAK: ఆసియా క్రీడాలు 2026 టోర్నమెంట్ లో భాగంగా పురుషుల టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రషీద్ లతీఫ్, నౌమాన్ నియాజ్. ఆసియా క్రీడాలలో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే… తమ జట్టు సులభంగా గెలుస్తుందని హెచ్చరించారు. ఇన్ని రోజులు ఓడిపోయి అలసిపోయామని… కానీ ఆసియా క్రీడాలలో తమ వంతు రాబోతుందని ఈ ఇద్దరు వార్నింగ్ బెల్స్ పంపారు. దమ్ముంటే… పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్లో టీమిండియా గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. దీంతో ఈ ఇద్దరు చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
ఆసియా క్రీడాలు 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇవాళ టీమ్ ఇండియా తొలి మ్యాచ్ ఆడనుంది. జపాన్ లాంటి పసికూన జట్టుపై తన ప్రతాపం చూపించనుంది. అయితే ప్రారంభ మ్యాచ్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లేదు. ఫైనల్స్ లేదా కాంస్య పతక పోరు నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. పాకిస్తాన్ అలాగే ఇండియా తమ తదుపరి మ్యాచ్లలో గెలిచి పతక రౌండ్ కు అర్హత సాధిస్తేనే… ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. లేకపోతే లేనేలేదు.
ఆసియా క్రీడాలలో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయని రషీద్ లతీఫ్, నౌమాన్ నియాజ్ అంచనా వేశారు. ఒకవేళ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే మాత్రం… టీమిండియాలో చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. సెమీఫైనల్ బరిలో టీమిండియాను ఓడించి… మెడల్ గెలుస్తామని తెలిపారు. ఇన్ని రోజులు పాకిస్తాన్ పై టీమిండియా వరుసగా గెలిచిందని గుర్తు చేశారు. కానీ ఈసారి మాత్రం పాకిస్తాన్ విజయం సాధించడం 100కు 200% జరుగుతుందని తెలిపారు.
మరోవైపు నౌమాన్ నియాజ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియా క్రికెటర్లు ఎప్పుడైనా కళ్ళు మూసుకొని ఆడతారని పరువు తీశారు. కళ్లకు గంతలు కట్టుకొని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారని బాంబు పేల్చాడు. ఫ్లాట్ మైదానాల్లో ఆడే టీమిండియా… జపాన్ లో మాత్రం తేలిపోతుందన్నారు. ఇక పాకిస్తాన్ చేతిలో ఓడిపోకూడదని… హిందూ దేవుళ్లను ప్రార్థించుకోండి అంటూ సెటైర్లు పేల్చారు. అయితే ఈ ఇద్దరు చేసిన వ్యాఖ్యలకు టీమిండియా ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. టీమిండియా చేతిలో ఓడిపోవడానికి పాకిస్తాన్ ఆటగాళ్లు సిద్ధంగా ఉండాలని.. సెటైర్లు పేల్చారు. జన్మలో కూడా టీమిండియా పైన పాకిస్తాన్ గెలవబోదని పరుగు తీశారు.