E-Paper
Advertisement

నాకు కన్నీళ్లు ఆగలేదు.. ఆ ఒక్కటి చూసి షాక్ అయ్యాను..

నాకు కన్నీళ్లు ఆగలేదు.. ఆ ఒక్కటి చూసి షాక్ అయ్యాను..
Advertisement

priyanka Jain : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కలేని పేరు ప్రియాంక జైన్.. బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో బిజీగా ఉంటుంది.. ఒకప్పుడు సీరియల్స్ తో ప్రేక్షకులను అలరించిన ప్రియాంక ఇటీవల కాలంలో సీరియల్స్ కి దూరంగా ఉంటూ కేవలం సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంది. ఈ మధ్యకాలంలో ఈమె పెట్టే పోస్టులకు జనాలు కూడా ఫిదా అవుతున్నారు.. ఈ పోస్టులు మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. తాజాగా అలాంటి పోస్ట్ ఒకటి ఆమె షేర్ చేసింది.. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. నాకు కన్నీళ్లు ఆగలేదు అంటూ చెప్పడంతో అభిమానులు అందులో ఏముందో తెలుసుకునేందుకు ఆత్రుత కనబరుస్తున్నారు. ఆ వీడియోలో ఏముంది అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..

నిరంజన్ – అమూల్య ప్రపోజల్..

ప్రియాంక జైన్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక వీడియోని షేర్ చేసింది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ అమూల్య నిరంజన్ ప్రపోజల్ నాకు చాలా బాగా నచ్చింది. నిరంజన్ అమూల్యకు ప్రపోజ్ చేసిన విధానం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు. నేనైతే ఇంకా ఆ దృశ్యం చూడగానే కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. వాళ్ళిద్దరి ప్రపోజల్అంత బాగా అందరినీ అవాక్కయ్యేలా చేసింది.. వాళ్ళిద్దర్నీ అలా చూస్తూ ఉంటే నా పాత రోజులు గుర్తుకు వచ్చాయి ఒక్కమాటలో చెప్పాలంటే నాకు నా ప్రపోజల్ డేస్ మళ్లీ వెనక్కి తిరిగి వచ్చినట్లు అనిపించింది అంటూ ప్రియాంక చాలా సంతోషంగా చెప్పింది.. అంతే కాదు ఆ వీడియోలో ఆమె ఏదో పూజకు రెడీ అయినట్లు చాలా ట్రెడిషనల్ గా రెడీ అవ్వడంతో.. ఆమె మాటలు విన్న అభిమానులు మీరు చాలా అందంగా ఉన్నారు చాలా బాగా చెప్పారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

ప్రియాంక జైన్ పర్సనల్ లైఫ్..

Advertisement

ఈ అమ్మడు తెలుగు బుల్లితెరపై మౌనరాగం సీరియల్ తో ప్రేక్షకులను పలకరించింది.. ఆ సీరియల్లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.. ఆ తర్వాత ప్రియాంక వరుసగా సీరియల్ చేస్తూ బిజీగా మారింది.. జానకి కలగనలేదు సీరియల్ ప్రియాంకకు మంచి టర్నింగ్ పాయింట్ గా నిలిచింది.. ఆ తర్వాత ఈమె బిగ్ బాస్ నుంచి అవకాశం రావడంతో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది.. ఆమె ఫైర్ చూసి అందరూ విన్నర్ అవుతుందని అనుకున్నారు కానీ వెనక్కి తిరిగి వచ్చేసింది.. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో బిజీగా ఉంటున్నా ఈ ముద్దుగుమ్మ ఇటీవలే తను ప్రేమించిన బాయ్ ఫ్రెండ్ శివతో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే.. త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి పీటలు లేకపోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ తర్వాత సీరియల్స్ చేస్తుందా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది..

?igsh=MXRoNWlyYXV3cTVwaw==

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: బాలు, మీనా సెర్చింగ్.. మనోజ్ పై బాలుకు అనుమానం.. షీలా ఎంట్రీ హైలెట్..

Related News

ఫైమా, యాదమరాజు మధ్య బాంగిల్స్ గోల.. నవ్వులే నవ్వులు!

సోనియానే నా హీరో అన్న యష్.. ఎందుకో తెలుసా?

సనాతన ధర్మంపై ఫైమా ఏమందో తెలుసా.. ఫ్యామిలీ రియాక్షన్ కూడా ఇదే!

యాదమరాజుతో ఫస్ట్ టైమ్ థియేటర్‌కు వెళ్లిన స్టెల్లా.. అక్కడ ఏం జరిగిందంటే?

ఫైమా బెటరా? వర్ష బెటరా?.. సమాధానం విని అంతా నవ్వాల్సిందే!

సింగిల్‌గా ఉండటమే బెస్ట్ అంటున్న వర్ష.. విష్ణుప్రియ కౌంటర్ అదుర్స్!

రూ.15 లక్షలకే ఎందుకు టెంప్ట్ అయ్యావు.. మిథిలేష్ కు ఇచ్చిపడేసిన శివాజీ!

బషీర్ మాస్టర్ ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Big Stories

Advertisement
×