E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode August 11th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు షాక్‌ ఇచ్చిన అమర్‌ – మనోహరిని హెచ్చరించిన చంభా

Nindu Noorella Saavasam Serial Today Episode August 11th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు షాక్‌ ఇచ్చిన అమర్‌ – మనోహరిని హెచ్చరించిన చంభా
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి, ప్రచండతో ఫోన్‌ మాట్లాడుతుంటే.. అమర్‌ వస్తాడు. మనోహరి ఏదో ఒకటి మాట్లాడి కాల్‌ కట్‌ చేస్తుంది. అమర్‌ ఎవరు ఫోన్‌ చేసింది అని అడిగితే తన ఫ్రెండ్‌ చేశాడని చెప్తుంది మనోహరి. మరి ఎందుకు కాల్‌ కట్‌ చేశావు.. అని అడిగితే.. తర్వాత మాట్లాడదామని కట్‌ చేశానని ఏంటి అమర్‌ నువ్వు నన్ను అనుమానిస్తున్నావా..? అని అడిగితే.. సారీ మనోహరి బుజ్జమ్మ ఇష్యూ జరిగినప్పటి నుంచి అందరి మీద డౌటు వస్తుంది సరే నువ్వు వెళ్లి పడుకో అంటాడు. మనోహరి, చంభా రూంలోకి వెళ్లిపోతారు.

రూంలోకి వెళ్లగానే.. చంభా ఫోన్‌ చేసింది ఎవరు మనోహరి అని అడుగుతుంది. ఫోన్‌ చేసింది ప్రచండ. తన నెంబర్‌ సేవ్‌ చేసుకోలేదు కాబట్టి బతికిపోయాము.. లేదంటే దొరికిపోయుండేదాన్ని అని మనోహరి చెప్పగానే.. చంభా షాక్‌ అవుతుంది. ఆల్‌ రెడీ సగం దొరికిపోయాము మనోహరి. నీ టైం బాగాలేదు అనుకున్నాం కానీ ఇంత దరిద్రంగా ఉంటుంది అనుకోలేదు.. రూపు పెళ్లి అయ్యాక ఇంకెలా ఉంటుందో అంటూ తిడుతుంది. మనోహరి భయంగా చూస్తుంటుంది.

Advertisement

మరుసటి రోజు ఉదయమే మిస్సమ్మ నిద్రలేచి టైం చూసి కంగారుపడుతుంది. ఆరు అయిపోయింది. ఈపాటికి అందరూ లేచి ఉంటారు. నేను బుక్‌ అయ్యాను అనుకుంటూ కంగారుపడుతుంది. తిరిగి చూస్తే.. బెడ్‌ మీద అమర్‌ ఉంటాడు. అమర్‌ను చూసి రిలాక్స్‌ అవుతుంది. అమర్‌ను చూస్తూ ఏంటి అల్లారం పని చేయలేదా.. లేక మీరు ఇప్పుడే నిద్ర లేస్తున్నారా..? అని అడుగుతుంది. అమర్‌ నింపాదిగా లేస్తూ.. నేను లేచి చాలా సేపు అయింది అని చెప్పగానే.. మరేంటి ఇవాళ మీ స్పీకర్‌ పని చేయలేదా..? అంటే అన్ని వర్కింగ్‌లోనే ఉన్నాయని అమర్‌ చెప్తాడు. మరేంటి ఇవాళ హాలిడేనా అని అడుగుతుంది మిస్సమ్మ. కాదు డిఫెన్స్‌ డే అని అమర్‌ చెబితే ఓ అయితే ఇవాళ కూడా మనోహరితో నేను ఫైట్‌ చేయాలా..? అంటుంది మిస్సమ్మ. అవసరం లేదని తనకు పెళ్లి ఉంది కదా..? ఫైట్‌ చేస్తే తన ఫేస్‌ పాడవుతుంది అందుకే వద్దన్నాను అంటాడు అమర్‌. మరి ఇవాళ ఎవరికి టాస్క్‌ లేదా అని మిస్సమ్మ అడిగితే.. ఎందుకు లేదు.. ఉంది కాసేపు ఆగు నీకే తెలుస్తుంది అంటాడు అమర్‌.

పిల్లల రూంలోకి పాము వెళ్లుంది. అప్పుడే నిద్ర లేచిన ఆకాష్‌ పామును చూసి భయంతో వణికిపోతూ.. మిగతా పిల్లలను నిద్రలేపుతాడు. ఆనంద్‌ పామును చూసి గట్టిగా కేకలు వేస్తుంటాడు. అంజు, బుజ్జమ్మ మాత్రం సైలెంట్‌గా పామును చూస్తుంటారు. ఆకాష్‌, ఆనంద్‌ వేసే కేకలు కింద రూంలో ఉన్న మిస్సమ్మ విని కంగారుగా పైకి పరుగెత్తుకుంటూ వెళ్తుంది. రూంలో పామును చూసి మిస్సమ్మ భయపడుతుంది. వెనకే అమర్‌, పార్థు, మనోహరి వస్తారు. మిస్సమ్మ భయంగా ఏవండి పాము అంటుంది. పార్థు గన్‌ తెస్తానని అంటాడు. వద్దని అమర్ చెప్తాడు. ఆనంద్‌, ఆకాష్‌ భయంతో మిస్సమ్మ మమ్మల్ని కాపాడు అంటుంటారు. బుజ్జమ్మ, అంజు మాత్రం తాము కప్పుకున్న దుప్పటి మెల్లగా తీసి పాము మీద వేస్తారు.

Advertisement

పాము దుప్పట్లో లాక్‌ అయింది ఇక భయపడొద్దు అన్నయ్య అంటుంది అంజు. ఇక మీరు ధైర్యంగా బెడ్‌ దిగండి అన్నయ్యలు అంటూ బుజ్జమ్మ చెప్తుంది. అందరూ రూంలోకి వెళ్తారు. పార్థు బుజ్జమ్మ, అంజులను మెచ్చుకుంటాడు. దీంతో అంజు, బుజ్జమ్మ మేమెవరం అంకుల్‌ ది గ్రేట్‌ అమరేంద్ర గారి పిల్లలం కదా అంటారు. అమర్‌ కూడా వాళ్లిద్దరిని మెచ్చుకుని ఆనంద్‌, ఆకాష్‌ కూడా వారిలాగా ధైర్యంగా ఉండాలని చెప్తాడు. అప్పడే మిస్సమ్మ అనుమానంగా అసలు ఇంట్లోకి పాము ఎలా వచ్చింది అనగానే.. అమర్‌ నేనే పంపించాను అంటాడు. అమర్‌ మాటలకు అందరూ షాక్‌ అవుతారు. అమర్‌ అవును పిల్లల ధైర్యం చెక్‌ చేద్దామని నేనే పంపించాను అంటూ వీరయ్య నీ పాము నువ్వు తీసుకెళ్లు అనగానే.. వీరయ్య వచ్చి పామును తీసుకుని వెళ్లిపోతాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం 

 

Related News

ఫైమా, యాదమరాజు మధ్య బాంగిల్స్ గోల.. నవ్వులే నవ్వులు!

సోనియానే నా హీరో అన్న యష్.. ఎందుకో తెలుసా?

సనాతన ధర్మంపై ఫైమా ఏమందో తెలుసా.. ఫ్యామిలీ రియాక్షన్ కూడా ఇదే!

యాదమరాజుతో ఫస్ట్ టైమ్ థియేటర్‌కు వెళ్లిన స్టెల్లా.. అక్కడ ఏం జరిగిందంటే?

ఫైమా బెటరా? వర్ష బెటరా?.. సమాధానం విని అంతా నవ్వాల్సిందే!

సింగిల్‌గా ఉండటమే బెస్ట్ అంటున్న వర్ష.. విష్ణుప్రియ కౌంటర్ అదుర్స్!

రూ.15 లక్షలకే ఎందుకు టెంప్ట్ అయ్యావు.. మిథిలేష్ కు ఇచ్చిపడేసిన శివాజీ!

బషీర్ మాస్టర్ ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Big Stories

Advertisement
×