E-Paper
Advertisement

తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం తీపి కబురు.. కొత్తగా లక్ష రేషన్ కార్డులు, మరో వారంరోజుల్లో..

తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం తీపి కబురు.. కొత్తగా లక్ష రేషన్ కార్డులు, మరో వారంరోజుల్లో..
Advertisement

Revanth Govt: తెలంగాణలోని మధ్య-పేద తరగతి కుటుంబాలకు తీపి కబురు చెప్పింది రేవంత్ ప్రభుత్వం. కొత్తగా లక్ష రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టబోతోంది. ఆగష్టు 15న సంగారెడ్డి జిల్లా కేంద్రంగా అధికారికంగా ప్రారంభించనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆ తర్వాత అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏక కాలంలో పంపిణీ జరగనుంది.

 

తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం తీపి కబురు

Advertisement

ఆగస్టు 15 నుంచి తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా లక్షకు పైగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మొదలుకానుంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సంగారెడ్డి‌లో ఈ కార్యక్రమం ప్రారంభంకానుంది.  మధ్యాహ్నం 2 గంటలకు ఈ కార్యక్రమం మొదలుకానుంది.  ఆ రోజు నుంచి 119 నియోజకవర్గాలలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది.

 

కొత్తగా లక్ష రేషన్ కార్డులు

Advertisement

ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు సమక్షంలో కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేయనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ విడతలో సుమారు 1.05 కోట్ల కుటుంబాలకు లామినేటెడ్ రూపంలో రెడీ చేసిన నూతన రేషన్ కార్డులను ఇవ్వనున్నారు.

 

ఆగష్టు 15 న సీఎం చేతుల మీదుగా మొదలు

వాటర్‌ప్రూఫ్‌, క్రెడిట్ కార్డు తరహాలో ఆకర్షణీయంగా ఉండేలా ఈ స్మార్ట్ కార్డులు రూపకల్పన చేశారు. కార్డుపై క్యూఆర్ కోడ్‌తోపాటు ఆధునిక భద్రతా ప్రమాణాలను పొందుపరిచినట్టు సమాచారం. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు అందేలా లబ్ధిదారుల జాబితాను పూర్తి చేయాలన్నారు.

ALSO READ: 8 నెలల బేబీ కిడ్నాప్.. మూడు గంటల్లో చేధించిన పోలీసులు, అసలేం జరిగింది?

రేషన్ కార్డుల ముద్రణ మొదలు జిల్లాలకు చేరే వరకు రవాణా నిర్వహణపై ప్రత్యేక నిఘా ఉంచింది పౌరసరఫరాల శాఖ. పంపిణీలో ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగేందుకు జిల్లా కలెక్టర్లు స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని ఆయా ఆదేశాల్లో పేర్కొన్నారు. పంపిణీ ప్రక్రియ పూర్తయిన తర్వాత సమగ్ర నివేదికలను ప్రభుత్వానికి అందజేయాల్సిందిగా ఉన్నతాధికారులను ఇప్పటికే సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి.

 

Related News

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

Big Stories

Advertisement
×