E-Paper
Advertisement

చేతిలో రూపాయి లేదు.. శివుడిని మొక్కగానే సినిమా ఛాన్స్.. మహేష్ అచంట ఓపెన్ టాక్!

చేతిలో రూపాయి లేదు.. శివుడిని మొక్కగానే సినిమా ఛాన్స్.. మహేష్ అచంట ఓపెన్ టాక్!
Advertisement

 Kissik Talks: కమెడియన్ మహేష్ అచంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించే ఆయన.. తాజాగా బిగ్ టీవీ నిర్వహిస్తున్న ‘కిస్సిక్ టాక్స్’ కార్యక్రమంలో పాల్గొని తన పర్సనల్ విషయాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సినిమా కెరీర్‌తో పాటు ప్రేమ, బ్రేకప్స్, నమ్మకం, దేవుడిపై భక్తి గురించి తన మనసులో మాట బయటపెట్టారు.

లవ్ విషయంలో ఎవరి టైమ్ వాళ్లదే!

Advertisement

ప్రస్తుత జనరేషన్ ప్రేమ గురించి మీ అభిప్రాయం ఏంటని యాంకర్ వర్ష అడగ్గా.. మహేష్ అచంట తనదైన స్టైల్‌లో సమాధానం చెప్పారు. కాలాన్ని బట్టి మనుషుల ఆలోచనలు మారుతుంటాయని, 80లలో ఒకలా, 90లలో మరోలా, ఇప్పుడు ఇంకోలా ప్రేమ వ్యవహారాలు ఉంటున్నాయని అన్నారు.

ప్రేమ కోసం కెరీర్‌ను పాడు చేసుకుంటున్న వాళ్లకు ఏం చెబుతారనగా .. ఎవరికైనా దెబ్బ తగిలినప్పుడే అసలు విషయం అర్థమవుతుందని చెప్పారు. మన మంచికోసం ఎంతమంది చెప్పినా వినని వాళ్లు కూడా జీవితంలో ఓసారి దెబ్బ తగిలితే అప్పుడే గతంలో చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటారని అన్నారు. అనుభవంతోనే మనుషుల్లో మార్పు వస్తుందని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.

Advertisement

లవ్ పేరుతో మోసం చేసేవాళ్లకు మహేష్ ఇచ్చిన సలహా ఇదే!

ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేసేవాళ్ల గురించి అడగ్గా.. ప్రేమలో మోసపోయిన వాళ్లకు అన్యాయం జరుగుతుందని, అలాంటి పరిస్థితులు బాధ కలిగిస్తాయని చెప్పారు.ముఖ్యంగా ఎవరైనా వచ్చి ‘ఐ లవ్ యు’ చెప్పగానే వెంటనే ‘ఐ లవ్ యు టూ’ అనేయొద్దని అమ్మాయిలకు సూచించారు. ఎదుటివాళ్ల గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ప్రేమ విషయంలో నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ప్రేమ అనేది ముందే ప్లాన్ చేసుకుని చేసేది కాదని, ఇద్దరికీ నచ్చితే కలిసి ప్రయాణం చేస్తారని.. లేదంటే విడిపోతారని చెప్పారు.

కొన్నేళ్లపాటు ప్రేమలో ఉండి బ్రేకప్ అవ్వడం, ఆ బాధను తట్టుకోలేక కొందరు ప్రాణాలు తీసుకోవడం చాలా బాధాకరమని అన్నారు. ప్రేమ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదనే అభిప్రాయాన్ని పంచుకున్నారు.

నిజమైన ప్రేమ పేరెంట్స్‌దే!

ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడుతూ మహేష్ మరో ఆసక్తికరమైన విషయం చెప్పారు. పిల్లలకు మంచి జరగాలని తల్లిదండ్రులు ఎప్పుడూ కోరుకుంటారని అన్నారు. తమ పిల్లలు సరైన వ్యక్తిని ఎంచుకుంటే పెళ్లి చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారని, అదే తప్పుడు వ్యక్తి చేతిలో పడతారేమోనని భయపడతారని చెప్పారు.మీరు మనుషులను నమ్ముతారా అని వర్ష అడిగగా ఎదుటివాళ్లు మోసం చేసేవరకు తాను నమ్ముతూనే ఉంటానని చెప్పారు. నమ్మకూడదని అనుకున్నా, మళ్లీ నమ్మాలనిపిస్తుందని.. అదే తన వీక్నెస్ అని నవ్వుతూ చెప్పారు.

శివుడిపై మహేష్‌కు అంత భక్తి ఉందా?

మహేష్ అచంటకు శివుడంటే చాలా భక్తి అని సమయం కుదిరినప్పుడల్లా శివాలయానికి వెళ్తానని, కొన్నిసార్లు వరుసగా రోజూ కూడా ఆలయానికి వెళ్లిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు.తన జీవితంలో డబ్బుల విషయంలో ఇబ్బందులు ఎదురైన ఓ సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. చేతిలో రూపాయి కూడా లేని పరిస్థితి వచ్చిందని, అలాంటి సమయంలో శివాలయానికి వెళ్లి నీళ్లు పోయగానే తనకు సినిమా అవకాశం కోసం ఫోన్ వచ్చిందని వెల్లడించారు.

‘శివాలయం’ సినిమా కోసం హీరోగా అవకాశం వచ్చిందని ఫోన్‌లో చెప్పారని, ఆ తర్వాత తన సమస్యలు సర్దుకున్నాయని వివరించారు. శివుడిపై తనకు ఎంతో నమ్మకం ఉందని, కష్టాల్లో ఉన్నప్పుడు ఆ భక్తి తనకు ధైర్యాన్ని ఇస్తుందని చెప్పుకొచ్చారు.

దేవుడిని ఏమీ అడగకపోయినా అన్నీ ఇస్తాడా?

దేవుడిని ఏదైనా కోరుకుంటే అది నెరవేరిన సందర్భాలు ఉన్నాయా అని వర్ష అడిగగా మహేష్ మరో ఆసక్తికరమైన విషయం చెప్పారు. మనకు ఏది కావాలో మనకంటే దేవుడికే బాగా తెలుసని తాను నమ్ముతానని అన్నారు.

ALSO READ :బిగ్‌బాస్ టైటిల్ అతను గెలిస్తే హ్యాపీ.. మహేష్ అచంట మనసులో మాట!

అందుకే దేవుడి దగ్గరకు వెళ్లి ఇది కావాలి, అది కావాలని అడగడం కంటే.. భక్తితో దండం పెట్టుకుని రావడమే మంచిదని తనకు అనిపిస్తుందని చెప్పారు. మనకు ఏది మంచిదో దేవుడికి తెలుసనే నమ్మకంతో ముందుకు సాగుతానని వివరించారు.మొత్తానికి మహేష్ అచంట ‘కిస్సిక్ టాక్స్’ ప్రోమోలో ప్రేమ, బ్రేకప్స్ నుంచి శివుడిపై భక్తి వరకు ఎన్నో విషయాలపై ఓపెన్‌గా మాట్లాడారు

Tags

Related News

నాన్న చనిపోయినప్పుడు నా దగ్గర డబ్బులు కూడా లేవు.. మహేష్ అచంట ఎమోషనల్

బిగ్‌బాస్ టైటిల్ అతను గెలిస్తే హ్యాపీ.. మహేష్ అచంట మనసులో మాట!

ఆరుగురిని లవ్ చేశా.. నా భార్యకు చెబితే .. మహేష్ అచంట లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులా?

వాళ్లని చూస్తే కంకర రాళ్లతో కొట్టాలనిపిస్తుంది…చిరు పై మహేష్ అచంట వైరల్ కామెంట్స్

బిగ్‌బాస్‌కు వెళ్లకపోవడానికి కారణం ఇదేనా? మహేష్ అచంట ఏమన్నారంటే!

వైల్డ్ కార్డ్స్ కాదు వైల్డ్ ఫైర్.. హౌస్ లోకి అడుగుపెట్టిన స్టార్స్ వీరే!

జబర్దస్త్ కార్యక్రమం పై మహేష్ అచంట కామెంట్స్.. రెండు రోజులు పని చేస్తే చాలంటూ!

Big Stories

Advertisement
×