E-Paper
Advertisement

బిగ్‌బాస్‌కు వెళ్లకపోవడానికి కారణం ఇదేనా? మహేష్ అచంట ఏమన్నారంటే!

బిగ్‌బాస్‌కు వెళ్లకపోవడానికి కారణం ఇదేనా? మహేష్ అచంట ఏమన్నారంటే!
Advertisement

Kissik Talks:తెలుగు సినిమాల్లో కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మహేష్ అచంట. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలలో నటిస్తున్న సంగతి తెల్సిందే.
ముఖ్యంగా తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించే మహేష్ అచంట.. తాజాగా బిగ్ టీవీ నిర్వహిస్తున్న ‘కిస్సిక్ టాక్స్’ కార్యక్రమంలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

రామ్ చరణ్ అలా ఉంటారా? మహేష్ అచంట ఆసక్తికర కామెంట్స్!

Advertisement

రామ్ చరణ్‌తో కలిసి షూటింగ్స్‌లో ఉన్నప్పుడు ఆయన ప్రవర్తన ఎలా ఉంటుందని అడగ్గా మహేష్ అచంట మాట్లాడుతూ.. రామ్ చరణ్ చాలా డౌన్ టు ఎర్త్‌గా ఉంటారని చెప్పారు. ముఖ్యంగా ఆఫ్ స్క్రీన్‌లో ఆయన టైమింగ్ చాలా బాగుంటుందని ప్రశంసించారు.రామ్ చరణ్‌కు మంచి కామెడీ టైమింగ్ ఉందని, ఆయనకు పూర్తి స్థాయి టైమింగ్ ఉన్న పాత్రలు వస్తే ఇంకా బాగా చేస్తారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే దుల్కర్ సల్మాన్ కూడా చాలా డౌన్ టు ఎర్త్‌గా ఉంటారని, తనలాంటి ఆర్టిస్టులకు మంచి సపోర్ట్ ఇస్తారని పేర్కొన్నారు.

కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవాళ్లకు మహేష్ సలహా!

Advertisement

సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఎంతోమంది యువత కలలు కంటుంటారు. కానీ అవకాశాలు ఎలా సంపాదించుకోవాలి? ఎవరిని కలవాలి? టాలెంట్‌ను ఎలా నిరూపించుకోవాలి? అనే విషయంపై మహేష్ అచంట తన అభిప్రాయాన్ని ఇలా చెప్పుకొచ్చారు.టాలెంట్ ఉంటే అవకాశాలు వెతుక్కుంటూ రావచ్చని, ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా కూడా తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉందని చెప్పారు. ఒకరికి అవకాశం రాకపోతే మరొకరు గుర్తించే అవకాశం ఉంటుందని వివరించారు.

హార్డ్ వర్క్‌తో పాటు స్మార్ట్ వర్క్ కూడా

కేవలం నటుడిగానే ప్రయత్నించాల్సిన అవసరం లేదని, రైటర్‌గా, క్రియేటర్‌గా లేదా రీల్స్ ద్వారా కూడా తమ ప్రతిభను చూపించవచ్చని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో హార్డ్ వర్క్‌తో పాటు స్మార్ట్ వర్క్ కూడా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇండస్ట్రీలో అందరికీ ఒకేసారి అవకాశాలు రావు. కానీ తమలో ఉన్న ప్రతిభను సరైన విధంగా చూపించగలిగితే ముందుకు వెళ్లే దారులు తెరుచుకుంటాయని మహేష్ చెప్పిన మాటలు కొత్తగా ప్రయత్నించే వారికి ప్రోత్సాహాన్ని ఇస్తాయనే చెప్పాలి.

బిగ్‌బాస్‌కు వెళ్లడం లేదా? మహేష్ అచంట ఏమన్నారంటే!

మహేష్ అచంటకు కూడా బిగ్‌బాస్ నుంచి ఆఫర్ వచ్చిందని. ఈ సీజన్‌లో ఆయన హౌస్‌లోకి వెళ్తారా అని అడగ్గా మహేష్ స్పందిస్తూ.. బిగ్‌బాస్ నిర్వాహకులు తనను ప్రతి సీజన్‌కు పిలుస్తున్నారని తెలిపారు. అయితే సినిమాల షూటింగ్స్ కారణంగా ఇప్పటివరకు వెళ్లలేకపోయానని వివరించారు.

ఒక సీజన్ సమయంలో ‘గుంటూరు కారం’ షూటింగ్‌లో ఉండటం, మరోసారి ఇతర పనుల్లో బిజీగా ఉండటంతో అవకాశం కుదరలేదని చెప్పారు.బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లాలంటే కొంతకాలం పూర్తిగా అందుబాటులో ఉండాల్సి ఉంటుందని, నిర్వాహకులు కోరుకునేన్ని రోజులు ఉండే అవకాశం తనకు లభిస్తే తప్పకుండా వెళ్తానని తెలిపారు.

ALSO READ :మాస్ మహారాజా కూతురు అదుర్స్…. హీరోయిన్ గా ఎంట్రీ ఎప్పుడో !

దీంతో మహేష్ అచంట బిగ్‌బాస్ ఎంట్రీపై మరోసారి చర్చ మొదలైంది. అయితే ఆయన ఈ సీజన్‌లో పాల్గొనడం ఖాయమని చెప్పలేదు. తగిన సమయం కుదిరితే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాననే సంకేతం ఇచ్చారు.మొత్తానికి ‘కిస్సిక్ టాక్స్’తో మహేష్ అచంట తన వ్యక్తిగత జీవితం నుంచి సినిమా అనుభవాల వరకు చెప్పుకొచ్చారు.

Tags

Related News

చేతిలో రూపాయి లేదు.. శివుడిని మొక్కగానే సినిమా ఛాన్స్.. మహేష్ అచంట ఓపెన్ టాక్!

బిగ్‌బాస్ టైటిల్ అతను గెలిస్తే హ్యాపీ.. మహేష్ అచంట మనసులో మాట!

ఆరుగురిని లవ్ చేశా.. నా భార్యకు చెబితే .. మహేష్ అచంట లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులా?

వాళ్లని చూస్తే కంకర రాళ్లతో కొట్టాలనిపిస్తుంది…చిరు పై మహేష్ అచంట వైరల్ కామెంట్స్

వైల్డ్ కార్డ్స్ కాదు వైల్డ్ ఫైర్.. హౌస్ లోకి అడుగుపెట్టిన స్టార్స్ వీరే!

జబర్దస్త్ కార్యక్రమం పై మహేష్ అచంట కామెంట్స్.. రెండు రోజులు పని చేస్తే చాలంటూ!

నా డైలాగ్స్ అంటే మహేష్ బాబుకి పిచ్చ ఇష్టం.. రంగస్థలం మహేష్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×