Ravi Teja Daughter:తులాభారం సినిమా ఓపెనింగ్ కి మాస్ మహారాజా రవితేజ తన కూతురు మోక్షదతో రావడం తో ఇపుడు ఇండస్ట్రీ అంతా ఒకటే చర్చ.ఈ సినిమాకి మోక్షద ఏం చేస్తుంది.ఆమెకి సినిమాలపై ఇంట్రెస్ట్ ఉందా ? కొంపదీసి త్వరలో ఏమైనా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా అంటూ ఒకటే ఆరాలు తీస్తున్నారు మూవీ లవర్స్.
నిజానికి తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులు సినిమాల్లోకి రావడం కొత్త విషయమేమీ కాదు. అయితే హీరోల కొడుకులు ఈజీగానే ఎంట్రీ ఇస్తుంటారు కానీ హీరోయిన్స్ గా కూతుళ్ళు అడగు పెట్టాలంటే బోలెడన్ని లెక్కలుంటాయి. పైగా తెలుగులో స్టార్ హీరోల కూతుళ్ళు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇవ్వడం , ఇచ్చినా సక్సెస్ లు చూడటం చాలా అరుదనే చెప్పాలి.
మోక్షద విషయానికి వస్తే
అలాంటిది తాజాగా మాస్ మహారాజ తన కూతురిని సినిమా ఓపెనింగ్ కి తీసుకురావడంతో ఇటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ ,అటు మూవీ లవర్స్ లోనూ ఒక ప్రతేకమైన ఆసక్తి కనిపిస్తుంది. మాములుగా పర్సనల్ లైఫ్ ని సినిమాలతో పెద్దగా ముడిపెట్టడానికి ఇష్టపడని రవితేజ కూతురు మోక్షదతో కలిసి అటెండ్ అవడం చూస్తుంటే ముందు ముందు సంథింగ్ స్పెషల్ ఏమైనా ఉండి ఉండాలే అంటూ అప్పుడే ఒక అంచనాకి వస్తున్నారు మాస్ మహారాజ ఫ్యాన్స్.అయితే మోక్షద విషయానికి వస్తే రవితేజ తులాభారానికి లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించబోతుందని తెలుస్తుంది.
రవితేజ కెరీర్ లో బ్లాక్ బస్టర్
ఇక రవితేజ విషయానికి వస్తే శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రిమూవీ మేకర్స్ నిర్మించిన ఇరుముడి సినిమా రవితేజ కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెల్సిందే. కేవలం ముప్పై ఐదు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 250 కోట్లని వసూలు చేయడంతో రవితేజ తర్వాతి సినిమా అయిన తులాభారంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక దీనితో పాటే సమాంతరంగా హసిత్ గోలి దర్శకత్వంలో దాగుడు మూతలు దండాకోర్ అనే సినిమా ని కూడా పరిగెత్తించబోతున్నాడట రవితేజ. రాజ రాజ చోర, స్వాగ్ సినిమాలు హసిత్ గోలి దర్శకత్వంలోనే వచ్చాయని తెలిసిందే.
టాలీవుడ్ లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో !
ఇండస్ట్రీలో హీరోల పిల్లలు బయట కనిపించినప్పుడల్లా వారెప్పుడు వెండితెరపైకి ఎంట్రీ ఇస్తారా అని క్యూరియస్ గా ఎదురుచూస్తారన్న సంగతి తెల్సిందే. ఇపుడు మోక్షద విషయంలో కూడా అలాంటి ప్రశ్నే ఉత్పన్నం అవుతుంది. చూడాలి మరి చూడానికి హీరోయిన్ కన్నా ఎక్కడా తీసిపోని ఈ అందాల భామ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో !
ALSO READ :చిరు ఇండస్ట్రీకి మొగుడవుతాడని చెప్పిన ఆ హీరో ఎవరో తెలుసా?