E-Paper
Advertisement

ఇక సెలవు.. ముగిసిన షావుకారు జానకి అంత్యక్రియలు!

ఇక సెలవు.. ముగిసిన షావుకారు జానకి అంత్యక్రియలు!
Advertisement

Sowcar Janaki: తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో కలుపుకొని ఏకంగా 400కు పైగా చిత్రాలలో నటించి, తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు షావుకారు జానకి(Sowcar Janaki). 1950లో ఎన్టీఆర్ (Sr NTR) హీరోగా నటించిన ‘షావుకారు’ సినిమాలో హీరోయిన్గా నటించి, అదే సినిమా పేరును తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఏడు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో చిత్రాలలో నటించి హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, బామ్మ గా, అమ్మమ్మగా పలు పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాంటి ఈమె గత వారం రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చెన్నైలోనే కావేరి హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ.. వృద్ధాప్య కారణాల వల్ల ఆరోగ్య పరిస్థితి విషమించి ఆమె తుది శ్వాస విడిచారు.

ముగిసిన అంత్యక్రియలు..

షావుకారు జానకి మరణ వార్త అభిమానులను, సినీ సెలబ్రిటీలను ఒక్కసారిగా కలచివేసింది. ముఖ్యంగా షావుకారు జానకి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపోతే నేడు ఆమె అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల, సమక్షంలో ఘనంగా పూర్తయ్యాయి. ఆగస్టు 22 శనివారం నాడు ఆమె పార్తివదేహాన్ని అభిమానులు, ప్రజలు, సినీ ప్రముఖుల సందర్శనార్థం చెన్నైలోని ఆమె నివాసంలోనే ఉంచి, సాయంత్రం చెన్నైలోని బెసెంట్ నగర్ లో ఉన్న స్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. జానకమ్మ అంత్యక్రియలు పూర్తవడంతో ఆమె అభిమానులు, సినీ సెలబ్రిటీలు మరోసారి ఆమెకు సంతాపం వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతం అవుతున్నారు.

షావుకారు జానకి కెరియర్..

Advertisement

ఏడు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళ్, కన్నడ , మలయాళం భాషలలో 400కు పైగా చిత్రాలలో నటించిన ఈమె.. సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు లను మొదలుకొని చిరంజీవి, కమలహాసన్, జూనియర్ ఎన్టీఆర్, మంచు విష్ణు వంటి హీరోల చిత్రాలలో కూడా నటించి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా మూడు తరాల హీరోలతో కలిసి పనిచేసిన ఈమె ఏకంగా నలుగురు ముఖ్యమంత్రులతో కూడా నటించి మెప్పించారు. ఇకపోతే ఈమెకు ముగ్గురు సంతానం కాగా ..నలుగురు మనుమలు, నలుగురు ముని మనుమలు కూడా ఉన్నారు.

ALSO READ:బిగ్ బాస్ 10లోకి టెంపర్ మూవీ విలన్?

షావుకారు జానకికి గుర్తింపు తెచ్చిన మొదటి 5 చిత్రాలు..

Advertisement

షావుకారు జానకికి గుర్తింపు తెచ్చిన ఐదు చిత్రాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. స్వర్గీయ నందమూరి తారక రామారావు, జానకి ఇద్దరికీ షావుకారు చిత్రం ఒక ముఖ్యమైన ఆరంభాన్ని అందించింది. ఇది జానకికి తొలి సినిమా కాగా, ఎన్టీఆర్ కి తొలి హీరో పాత్ర అప్పటికి జానకి వయసు 18 సంవత్సరాలు. ఉల్లాసభరితమైన , భావవ్యక్తీకరణ కలిగిన సుబ్బులు పాత్రలో ఆమె నటనకు విస్తృత గుర్తింపు లభించింది. ఈ సినిమా టైటిల్ ను తన ఇంటిపేరుగా మార్చుకొని షావుకారు జానకిగా స్థిరపడిపోయింది. ఈ చిత్రం తర్వాత 1955లో అక్కినేని నాగేశ్వరరావుతో చేసిన రోజులు మారాయి చిత్రం ఈమెకు మంచి ఇమేజ్ అందించింది. అలాగే కన్యాశుల్కం, డాక్టర్ చక్రవర్తి, సంసారం ఒక చదరంగం చిత్రాలు ఈమెకు మంచి పేరును అందించాయి.

Related News

‘ రామాయణ’ చిత్ర నిర్మాత ఆఫీసులపై ఐటీ దాడులు!

హీరో అర్జున్ కూతురు వివాహం ఫిక్స్.. ఎప్పుడంటే..?

సైనికుడిగా సేవలు, జీతంలో 90 శాతం రైతులకు.. నానా పటేకర్ గురించి తెలిస్తే సెల్యూట్ చేస్తారు!

సేనాపతి ఈజ్ బ్యాక్.. ‘ఇండియన్ 3’ నుంచి అదిరిపోయే అప్డేట్ !

నానా పటేకర్ భార్య గురించి తెలియని విషయాలు?

ప్రముఖ సీనియర్ నటుడు నానా పటేకర్ ఇక లేరు.. గోవాలో అపస్మారక స్థితిలో..

భార్యతో మంచు మనోజ్ ప్రత్యేక పూజలు.. ఫోటోలు వైరల్!

దయచేసి అలాంటి వార్తలు ప్రచారం చేయకండి.. బండ్ల గణేష్ సంచలన ప్రకటన!

Big Stories

Advertisement
×