E-Paper
Advertisement

బిగ్ బాస్ 10లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న భల్లాల దేవ?

బిగ్ బాస్ 10లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న భల్లాల దేవ?
Advertisement

Bigg Boss 10 Wild card: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభమై అప్పుడే రెండు వారాలు పూర్తయింది.అప్పుడే మూడవ వారం కూడా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక వాడి వేడిగా నామినేషన్ ప్రక్రియ కూడా ముగిసింది. మొత్తం 10 మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. అందులో మొదటివారం మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా చైత్ర, చరణ్ ఎలిమినేట్ అయినప్పటికీ.. చరణ్ మళ్ళీ హౌస్ లోకి వచ్చి సందడి చేస్తున్నారు. ఇక రెండవ వారంలో తన ఆట తీరుతో ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయిన నేపథ్యంలో ఆడియన్స్ నుండి ఓట్లు పొందలేక కృష్ణుడు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. ఇక మూడవ వారం హౌస్ లో 8 మంది నామినేషన్స్ లోకి రాగా, ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే వార్త వైరల్ గా మారింది.

వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్న కామనర్?

ఇదిలా ఉండగా మరొకవైపు బిగ్ బాస్ సీజన్ 10లోకి వైల్డ్ కార్డు ద్వారా కొంతమంది సెలబ్రిటీలు, కామనర్స్ రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా కామనర్ మిథిలేష్ (Mithilesh Reddy) వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఎంట్రీ దాదాపు ఖరారు అయిందని, అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. మొత్తానికైతే మిథిలేష్ హౌస్ లోకి రాబోతున్నారు అంటూ వస్తున్న వార్త అభిమానులలో క్యూరియాసిటీని పెంచేసింది.

Advertisement

also read:బిగ్ బాస్ త్రిగుణ్ సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారా? ఈయన భార్య ఎవరంటే?

అగ్ని పరీక్ష సీజన్ 2 లో భల్లాలదేవ..

మిథిలేష్ విషయానికి వస్తే.. ఈయన అగ్నిపరీక్ష సీజన్ 2 లో కామనర్ గా అడుగుపెట్టారు. టాప్ 15 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు. ముఖ్యంగా తనదైన పెర్ఫామెన్స్ తో జడ్జెస్ ను మెప్పించారు. అంతేకాదు చాలా గట్టిగా పోరాడి, అద్భుతంగా ఆకట్టుకున్నారు. అలాగే వివిధ టాస్క్లలో తన ప్రతిభను కూడా చాటుకున్నారు. బాహుబలి బల్లాల దేవా అనే ట్యాగ్ ని కూడా దక్కించుకున్నారు. అలాంటి మిథిలేష్ హౌస్ లోకి అడుగు పెడతారని అందరూ అనుకున్నారు. అగ్ని పరీక్షలో అద్భుతంగా ఆడినప్పటికీ, ఆయనకు ఊహించని విధంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే అవకాశం లభించలేదు.

ఫ్యాన్స్ ఖుషీ..

Advertisement

దీంతో ఆయన అభిమానులు ఎంతో నిరాశ వ్యక్తం చేశారు. అయితే అలాంటి ఒక గొప్ప ప్లేయర్ ను వదిలేయకుండా ఇప్పుడు వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి తీసుకోబోతున్నట్లు సమాచారం . ఏది ఏమైనా అగ్నిపరీక్ష సీజన్ 2 లో తనదైన పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న మిథిలేష్ రెడ్డి ఇప్పుడు హౌస్ లోకి వచ్చి ఏ విధంగా టైటిల్ దిశగా అడుగులు వేస్తారో చూడాలి.

Related News

సరిగమపలో అదరగొడుతున్న దైవిక్.. అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే!

బిగ్ బాస్ త్రిగుణ్ సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారా? ఈయన భార్య ఎవరంటే?

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు మైండ్ బ్లాక్.. పార్వతి మాటతో షాక్.. పాపం ప్రభా..

Karthika Deepam 2 Serial Today Episode September 23rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన దీప, కార్తీక్           

Podarillu Today Episode : మహాను రెచ్చగొట్టిన చక్రీ.. అడ్డంగా బుక్కయిన మాధవ్.. మహా దెబ్బకు మైండ్ బ్లాక్..

Nindu Noorella Saavasam Serial Today Episode September 23rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి వార్నింగ్ ఇచ్చిన మిస్సమ్మలోని అరుంధతి   

Big Stories

Advertisement
×