E-Paper
Advertisement

బిగ్ బాస్ త్రిగుణ్ సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారా? ఈయన భార్య ఎవరంటే?

బిగ్ బాస్ త్రిగుణ్ సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారా? ఈయన భార్య ఎవరంటే?
Advertisement

Bigg Boss Trigun:త్రిగుణ్.. గత 15 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని, స్టార్ డం సంపాదించుకోవాలని ఎంతో ప్రయత్నం చేసినా.. రాని గుర్తింపు.. ఒక్క బిగ్ బాస్ తో లభిస్తోంది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 10 హౌస్ లోకి అడుగుపెట్టిన త్రిగుణ్ .. తనదైన ఆట, మాట తీరుతో ఆడియన్స్ లో అటెన్షన్ క్రియేట్ చేస్తూ.. ఎన్నడూ లేని గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే కామనర్ రోహిత్ ను టార్గెట్ చేసి రెచ్చగొట్టడం , ప్రతి చిన్న విషయానికి గొడవలు పెట్టుకుంటూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు హౌస్ లో నుండి బయటకు వెళ్లిన కృష్ణుడు కూడా త్రిగుణ్ నిజాయితీని మెచ్చుకుంటూ చేసిన కామెంట్లు ఆయనను అందలం ఎక్కించాయి.

త్రిగుణ్ భార్య ఎవరంటే?

ఈ నేపథ్యంలోనే త్రిగుణ్ కి సంబంధించిన పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే ఆయన ప్రేమ , పెళ్లి , భార్య ఇలా పలు విషయాలు అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. 2023 సెప్టెంబర్ 2వ తేదీన నివేదిత అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు . పైగా వీరిద్దరిది ప్రేమ వివాహం.. తమిళనాడుకు చెందిన నివేదితను.. తిరుప్పూర్ జిల్లా అవినాషి పట్టణంలోని శ్రీ సెంథూర్ మహల్ లో వీరి వివాహం జరిగింది. ఐతే కొన్నాళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సీక్రెట్ మ్యారేజ్ పై త్రిగుణ్ రియాక్షన్..

Advertisement

త్రిగుణ్ వివాహం చేసుకున్న సమయంలో.. రహస్యంగా పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ విషయాలపై ఆయన స్పందిస్తూ.. “నేను రహస్యంగా పెళ్లి చేసుకోలేదు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల నా పెళ్లి చాలా సింపుల్గా జరిగింది. నిజానికి నేను నా పెళ్లి వేడుకను చాలా ఘనంగా జరుపుకోవాలని ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాను.

also read:తల్లి కావాలంటే పెళ్లే అవసరమా? వివాహ వ్యవస్థపై శృతిహాసన్ కామెంట్స్!

పెళ్లికి ముందే అమ్మ చనిపోయింది..

Advertisement

సంగీత్, రిసెప్షన్ వంటి వేడుకల కోసం వేదికలను కూడా ఖరారు చేసాను. అడ్వాన్స్ చెక్కులు కూడా ఇచ్చాను. అయితే పెళ్లికి కేవలం మూడు నెలలు సమయం ఉన్నప్పుడు మా అమ్మ మరణించడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది . ఈ సంఘటన నా కుటుంబం పై తీవ్ర ప్రభావాన్ని చూపింది . నేను మా అమ్మకి ఏకైక కొడుకుని.. ముఖ్యంగా నేను సినిమాలో పెద్ద హీరో అవ్వడం కంటే నేను పెళ్లి చేసుకోవాలనే కోరికే ఎక్కువగా ఉండేది’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు త్రిగుణ్ .

కోరిక తీరకుండానే తల్లి మరణం..

ఇక నేను పెళ్లి చేసుకుంటే చూడాలని మా అమ్మ ఎన్నో కలలు కనింది. కానీ ఆ కల నెరవేరక ముందే ఆమె చనిపోయింది. ఇక మా అమ్మ మరణంతో కుటుంబ సభ్యులంతా తీవ్ర దుఃఖంలో ఉన్నప్పటికీ..ఇంట్లో శుభకార్యం జరగాలని భావించారు. అందుకే ఎవరినీ పిలవకుండా చాలా సింపుల్ గా పెళ్లి చేసుకోవాలని మా నాన్న చెప్పడంతో ఆయన కోరిక మేరకు ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను అంటూ తెలిపారు. మొత్తానికైతే ఇన్ని రోజులు సీక్రెట్ మ్యారేజ్ అంటూ వచ్చిన వార్తలకు ఆయన చెక్ పెట్టారు.

Related News

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు మైండ్ బ్లాక్.. పార్వతి మాటతో షాక్.. పాపం ప్రభా..

Karthika Deepam 2 Serial Today Episode September 23rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన దీప, కార్తీక్           

Podarillu Today Episode : మహాను రెచ్చగొట్టిన చక్రీ.. అడ్డంగా బుక్కయిన మాధవ్.. మహా దెబ్బకు మైండ్ బ్లాక్..

Nindu Noorella Saavasam Serial Today Episode September 23rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి వార్నింగ్ ఇచ్చిన మిస్సమ్మలోని అరుంధతి   

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ మాటతో షాక్.. శ్రీవల్లికి మరో దెబ్బ.. సుకన్య ప్లాన్ సక్సెస్..

Ninnu kori Serial Today Episode September 23rd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను చీట్ చేసి ఆస్థి కొట్టేయాలనుకున్న జీవన్ 

Big Stories

Advertisement
×