E-Paper
Advertisement

పక్కనే ఉంటూ యువనేత పుట్టిముంచనున్న ఆ ఇద్దరు..! మొన్నటి దాకా జీవన్‌రెడ్డి.. ఇప్పుడు కౌషిక్‌రెడ్డి.. !

పక్కనే ఉంటూ యువనేత పుట్టిముంచనున్న ఆ ఇద్దరు..! మొన్నటి దాకా జీవన్‌రెడ్డి.. ఇప్పుడు కౌషిక్‌రెడ్డి.. !
Advertisement

బాగా గమనించండి. కేటీఆర్‌ ఎటూ పోతే అటు ఓ లీడర్‌ వెన్నంటే ఉంటున్నాడు. ఏ ప్రోగ్రాంకు వెళ్లినా ఆ నేత చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. ఫోటోలకు ముందుంటున్నాడు. మీడియా నజర్‌లో పడేందుకు అపసోపాలు పడుతున్నాడు. కేటీఆర్‌ మెప్పుకోసం వెంపర్లాడుతున్నాడు. అనవసర రచ్చ చేసి యువనేత చేత శభాష్‌ అనిపించుకునేందుకు దిగజారి మరీ ప్రవర్తిస్తున్నాడు. గుర్తు పట్టారా? అవును.. మీరు అనుకుంటున్నది కరెక్టే. పాడి కౌషిక్‌రెడ్డి.

విషయం తక్కువ. ఆవేశం ఎక్కువ. ఆరాటం మరీ ఎక్కువ. ఎలాగూ మరో రెండేళ్లలో బీఆర్‌ఎస్‌ సర్కార్‌ వస్తుందని ఊహల పల్లకిలో యువనేత ఊరేగుతున్నాడు కాబట్టి.. ఆ యువనేత సారథ్యంలోని సర్కార్‌లో తనకు ఓ మంత్రి పదవి ఖాయమని భావిస్తున్నట్టున్నాడు. ఎమ్మెల్యేగా గెలిచేందుకు ఇంటిల్లిపాదిని చంపుకుంటానని ఓటర్లనే బెదిరించిన మహా ఘనుడు ఈ పాడి. అలాంటి ఎమ్మెల్యేను వెంట తిప్పుకుంటున్నాడు కేటీఆర్‌.

Advertisement

ఇతనొక్కడు చాలు కేటీఆర్‌ పుట్టి ముంచేందుకు.. ఉన్న వ్యక్తిత్వాన్ని దిగజార్చేందుకు.. అని తెలియనట్టుంది. ఇప్పటికే కేటీఆర్ కు ఓ అనుభవం ఉండనే ఉంది. గుణపాఠాలు నేర్చుకునే ఉన్నాడు. ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి నుంచి. అప్పట్లో అతను వెంబడే తిరిగేది. పొద్దున లేస్తే కేటీఆర్‌ ఇంటి ముందు హాజరు. ఆయన ఎటు పోతే అటు.. మీడియాలో కేటీఆర్‌ కనబడితే.. ఆ పక్కన కచ్చితంగా జీవన్‌రెడ్డి ముఖం ఒకటి కనిపడేది.

తాను షాడో సీఎంతోనే తిరుగుతున్నానే ఓ బ్రాండ్‌ను క్రియేట్‌ చేసుకోవడం ద్వారా ఆఫీసర్లను బెదిరించేందుకు పనికొస్తుందనే ఓ వ్యూహం.. తన నియోజకవర్గంలో రాజకీయాలు చేసేందుకు… తన క్యాడర్‌ను కంట్రోల్ లో పెట్టుకునేందుకు ఇదో అస్త్రంగా ఉపయోగించుకునేవాడు. చెప్పమంటావా? రామన్నకు…! ఇది జీవన్‌ నోటి వెంట వచ్చే కామన్‌ డైలాగ్. అలా నడిపించుకున్నాడు పదేండ్లు.

Advertisement

ఆర్మూర్‌లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎంతలా అంటే.. అంతా పైసలు జమ చేసుకుని మరీ ఓడగొట్టేంత. తుక్కు కింద ఓడగొట్టారు. ఇప్పుడు గెలిచిన పైడి రాకేశ్‌కు అది బాగా కలిసివచ్చి ఎమ్మెల్యే అయిపోయాడు బీజేపీ నుంచి. ఈ విషయం బాపుకు తెలిసింది. పక్కన పెట్టేశాడు. కేటీఆర్‌కు వార్నింగ్‌ ఇచ్చాడు. వెంట తిప్పుకుంటే నీ గతి అంతేనన్నాడు. కేటీఆర్‌ కూడా దూరం పెట్టాడు. ఇప్పుడు కనిపించడం లేదు.

కానీ ఆ స్థానంలో పాడి వచ్చి చేరాడు. సేమ్‌ అదే ఓవర్‌ యాక్షన్‌. మితిమీరి ప్రవర్తన. దుందుడుకు చేష్టలు. ఇలా చేస్తేనే గానీ రామన్న మెచ్చుకోడు అని ఫిక్స్‌ అయిపోనట్టున్నాడు. బాగానే నాడి పట్టాడు. ఇలా చెలామణి అవుతున్నాడు. పక్కనే ఉండి తమ ప్రవర్తనతో పుట్టి ముంచే లిస్టులో ఎవరెవరున్నారో పాపం.. రామన్నకు తెలియదు.

తెలిసినా.. జనానికి ఇది పట్టదు కదా.. మనల్నే గెలిపించబోతున్నారు… అని ధీమాగా ఉన్నాడు. కేసీఆర్‌ కూడా మొన్న మూడోసారి కూడా సిట్టింగులకే టికెట్లు ఇవ్వలేదా? సిట్టింగులపై వ్యతిరేకత వస్తే ఏంటీ..? నా ముఖం చూసి ఓటేస్తారు.. లేదంటే కొంతమందిని ఓడగొట్టినా.. మనకు అధికారమైతే దూరం కాదు కదా అని అనుకున్నాడు.

ఇక్కడ రాజు కథ ఒకటి చెప్పాలి.  అందరూ రాజు గారి అంతఃపురానికి తెల్లారక ముందే వచ్చి తలో చెంబెడు పాలు తీసుకొచ్చి గంగాళంలో పోయాలి.. అని ఆర్డరేశాడంట రాజు. ఆ చీకట్లో అంతా తలో చెంబెడు పోశారంట. తీరా తెల్లారిన తరువాత ఆ గంగాళంలోకి చూస్తే అన్నీ నీళ్లే ఉన్నాయంట. విషయమేమిటంటే.. నేనొక్కడిని నీళ్లు పోస్తే.. రాజుకు తెలుస్తుందా? అని అనుకున్నారట. అందరూ. సేమ్‌ ఇదే మాదిరిగా బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలందరి మీద పీకల లోతు కోపంలో ఉన్నారట జనం అప్పటికే. అందుకే ఆ రిజల్టు.

Tags

Related News

బిఆర్ఎస్‌కు బిగ్ షాక్ ఇవ్వబోతున్న మల్లారెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి..?

తెలంగాణలో పవన్ కళ్యాణ్ మాస్టర్ స్ట్రోక్.. పార్టీ పటిష్టం కోసం వేసిన స్కెచ్ ఇదే!

ఖైరతాబాద్ ఎఫెక్ట్.. తెలంగాణ బీజేపీపై అమిత్ షా ఫుల్ ఫోకస్!

ఖైరతాబాద్‌పై కాంగ్రెస్‌లో మొదలైన పరేషాన్.. జంకుతున్న ఆ కీలక నేతలు?

తెలంగాణలో మహిళలకు భారీ గుడ్ న్యూస్.. రూ. 2.50 కోట్లతో కొత్త ప్రాజెక్ట్!

నిమజ్జనం పాటలను కూడా వదలని కేటీఆర్‌..! కేసీఆర్‌ను జనం మరవలేదని చెప్పేందుకు మరీ ఇంత అల్పత్వమా? ఆ సినిమా చూసి… కేసీఆర్‌ను తక్కువ చేసి…

తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై వేటు?

Big Stories

Advertisement
×