E-Paper
Advertisement

సామాన్లు బాగుండాలే..లిరిక్స్‌తో మళ్ళీ దొరికిపోయిన బషీర్ మాస్టర్!

సామాన్లు బాగుండాలే..లిరిక్స్‌తో మళ్ళీ దొరికిపోయిన బషీర్ మాస్టర్!
Advertisement

Basheer Master:బషీర్ మాస్టర్…డీ రియాలిటీ షోలో తనదైన స్టెప్పులతో ఫేమస్ అయిన ఈ క్రేజీ కొరియోగ్రాఫర్ డాన్స్ కన్నా తనపై వచ్చే మీమ్స్ తోనే ఎక్కువగా హైలెట్ అవుతుంటాడు.ముఖ్యంగా ఫేమస్ అయిన పాటలకి తన స్టైల్ లో కొరియోగ్రఫీ చేస్తూ నెటిజన్లకి మాంచి స్టఫ్ అవుతుంటాడు.ఇక సినిమాలు చేయకపోయినా సంగీత్ ఈవెంట్స్ తో రెండు చేతులా సంపాదిస్తున్న బషీర్ మాస్టర్ ఈ మధ్య ఫోక్ సాంగ్స్ కి కొరియోగ్రఫీ చేయడం మొదలెట్టాడు.

‘సామాన్లు బాగుండాలే’ అంటూ డబల్ మీనింగ్

Advertisement

అయితే అందరూ చేస్తున్నారు ..అలాగే చేస్తే మజా ఏమొస్తుంది అనుకున్నాడో ఏమో..ఏకంగా ‘సామాన్లు బాగుండాలే’ అంటూ డబల్ మీనింగ్ వచ్చే పాటకి కొరియోగ్రఫీ చేశాడు.పైగా ఇందులో లీడ్ డాన్సర్ గా తనే నటించడం విశేషం. ఇక తాజాగా దీనికి సంబందించిన ప్రోమో కూడా రిలీజ్ అయింది.ఇందులో బషీర్ మాస్టర్ పాటకి వేసిన స్టెప్పులు,ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ , ఒక ఎత్తయితే ,పాటలోని ఆ లిరిక్స్ మరో ఎత్తు అంటూ ఈ పాట విన్నవారంతా ఒక్క సారిగా తమ కామెంట్లకి పని పెట్టారు.

ఇలా బూతు సాంగ్ చేసావేంటన్నా

Advertisement

మరీ ముఖ్యంగా ఫోక్ సాంగ్ అంటూ బిల్డప్ ఇచ్చి తీరా ఇలా బూతు సాంగ్ చేసావేంటన్నా ..ఇందుకు కాదు నిన్ను సోషల్ మీడియాలో ట్రోల్ చేసేది అంటూ సెటైర్స్ వేస్తున్నారు నెటిజన్లు.మరికొంతమంది అయితే మా బషీర్ భాయ్ కొరియోగ్రఫీ చేస్తే ఎదో మాంచి మాస్ ఫోక్ సాంగ్ అనుకున్నాం కాని ఇలా వైరల్ అవ్వడం కోసమే ఇలా మరీ దిగజారి ఇలా టూ మచ్ డబల్ మీనింగ్ ఉన్న పాటకి కొరియోగ్రఫీ చేస్తాడని అనుకోలేదు అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

అయితే ఇదే పాటకి అందరూ బాగా చేశారు మాత్రం ఒక్క నువ్వు తప్ప అంటూ ఒకరు సెటైర్ కామెంట్ చేస్తే,మరి కొందరు మాత్రం కిందా మీదా ఊపు,మా బషీర్ అన్న తోపు అంటూ కామెంట్ చేస్తున్నారు.అయితే అలా మెచ్చుకుంటూ కామెంట్ పెట్టడం ట్రోలింగ్ లో భాగామేనా అన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మరికొందరు అయితే ప్రోమో కాదు అసలైన ఎంటర్ టైన్ మెంట్ పూర్తి పాట రిలీజ్ అయ్యాకే వస్తుంది అంటూ కామెంట్స్ విసురుతున్నారు.

పుల్ సాంగ్ వచ్చాక ఎలా టార్గెట్ అవుతాడో !

నిజానికి బషీర్ మాస్టర్ ఒక్కడే కాదు చాలా పాటల్లో ఇలా ఆడియన్స్ దృష్టిని ,చెవులని ఆకర్షించడానికి పాటల్లో డబుల్ మీనింగ్ వచ్చేలా లిరిక్స్ ని చేర్చడం సర్వసాధారణం అయిపొయింది. అయితే ఈ సారి బషీర్ భాయ్ పాట మరింత శృతి మించడంతో ట్రోలింగ్ కి పని చెబుతున్నారు నెటిజన్లు.

ఏది ఏమైనా ఒకప్పుడు ఫోక్ సాంగ్ అంటే యాస ,బాష ,కట్టు బొట్టు,కల్చర్ ,కంటెంట్ అన్నట్టుగా ఉండేది ..కాని రాను రాను పాట రిలీజ్ అయితే అది మిలియన్ల వ్యూస్ కొట్టెయ్యాలి అన్న టార్గెట్ ఒక్కటే అవడంతో ఎడా పెడా ఎలా ఉన్నా సరే ,వైరల్ అయితే చాలు అన్నట్టుగా హద్దులు దాటేస్తున్నారు.చూడాలి మరి ‘సామాన్లు బాగుండాలే’ అంటూ ప్రోమో కే ఇలా మీమర్స్ కి స్టఫ్ అయిన బషీర్ మాస్టర్ పుల్ సాంగ్ వచ్చాక ఎలా టార్గెట్ అవుతాడో !

Tags

Related News

ఏకంగా 50 కట్స్ తో టీవీలోకి ధురంధర్ 2.. ఎప్పుడు? ఏ ఛానల్ అంటే?

బిగ్ బాస్ సీజన్ 1 నుండి 10 వరకు.. హోస్టుల రెమ్యూనరేషన్లు తెలిస్తే షాక్!

మేము లవర్స్ కాదురా నాయనా..రీతు చౌదరి షాకింగ్ పోస్ట్..!

Gundeninda GudiGantalu Today episode: మీనాకు మరో రికార్డ్.. మీనాకు రింగ్ గిఫ్ట్.. రోహిణికి షాక్…

Podarillu Today Episode : చక్రీకి దిమ్మతిరిగే షాక్.. మహా ప్లాన్ ఇదా..? అస్సలు ఊహించని ట్విస్ట్..

Illu Illalu Pillalu Today Episodes: హమ్మయ్య ఆల్ హ్యాపీ.. డ్యాన్స్ లతో రచ్చ రచ్చ.. భద్ర కీలక నిర్ణయం..?

Ninnu kori Serial Today Episode October 1st ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు తన మనసులో మాట చెప్పిన సామ్రాట్ 

Big Stories

Advertisement
×