Podarillu Serial Today Episode: నారాయణ, కేశవ, మాధవ ముగ్గురు కలిసి చక్రితో ఆటాడుకుంటారు. గోపికను తీసుకొస్తానని మహా వెళ్లడంతో చక్రి కంగారు పడుతుంటాడు. మహా గోపికను తీసుకొస్తుందా లేదా… ఆని ఆలోచిస్తుంటాడు. అయితే మాధవ మాత్రం మంచివాళ్లకు ఒక్క పెళ్లి కావడమే గగనంగా మారింది నీకు మాత్రం రెండో పెళ్లి జరగబోతుంది అంటూ వెటకారంగా మాట్లాడతాడు. అసలు పెళ్లామే రెండో పెళ్లి చేయడం ఇప్పుడే చూస్తున్నాను అంటూ నారాయణ ఎద్దేవా చేస్తాడు. కేశవ కూడా చక్రిని ఆట పట్టిస్తాడు. పెద్ద వదిన వెళ్లి చిన్న వదినను తీసుకొస్తుంది అంటూ నవ్వుకుంటారు. చక్రి మాత్రం టెన్షన్ పడుతూనే ఉంటాడు.
గోపిక చనిపోవాలని డిసైడ్ అవుతుంది. అందుకోసం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంది. ఫ్రెండ్స్ ఎంత చెప్పినా వినకుండా డోర్ వేసుకుని నిద్రమాత్రలు మింగడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే అక్కడకు వెళ్లిన మహా, కన్నా గోపికను డోర్ ఓపెన్ చేయమని చెప్తారు. చక్రి నీతో మాట్లాడాలట అని చెప్పగానే. .గోపిక డోర్ తీస్తుంది. వెంటనే మహా, కన్నా లోపలికి వెళ్తారు.
ఇంట్లో ఉన్న చక్రీ టెన్షన్ పడుతూనే మహాకు నువ్వైనా చెప్పు అంటూ మాధవను అంటే.. అతడు ఒప్పుకోడు అప్పుడే కేశవ ఫోన్ చేసి పెళ్లిబట్టలు తీసుకురమ్మని చెప్తాడు. ఎందుకని చక్రి అడిగితే పెళ్లి వాళ్లు వచ్చేసరికి నువ్వు రెడీగా ఉండాలి కదా అంటూ మాధవ చెప్తాడు. మాధవ మాటలకు చక్రి మరింత టెన్షన్ పడుతుంటాడు. అందరూ తనతో కావాలనే ఇలా ప్రవర్తిస్తున్నారని అర్థం చేసుకుంటాడు చక్రి. అదే విషయం వాళ్లకు చెప్తాడు. అయితే నీతో ఆడుకోవడానికి నువ్వేమైనా మాకు బామ్మర్ధివా..? బావవా..? అంటూ వెటకారంగా ప్రశ్నిస్తారు. నీకు అంత నమ్మకం లేకపోతే కన్నా కూడా వెళ్లాడు కదా వాడికి ఫోన్ చేసి అడుగు చెప్తాడు అంటూ మాధవ చెప్తాడు.
చక్రి కన్నాకు ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావని అడిగితే.. గోపిక వాళ్ల ఇంట్లో ఉన్నామని కన్నా చెప్తాడు. కన్నా మాటలు చక్రి నమ్మడు దాంతో కన్నా సెల్పీ తీసి చక్రికి పంపిస్తాడు. ఫోటో చాలా వీడియో కూడా పెట్టమంటావా..? అని అడిగితే.. అక్కడేం చేస్తున్నారని చక్రి అడుగుతాడు. పెద్ద వదిన చిన్న వదినను తీసుకురావడానికి వెళ్లింది. తీసుకుని వెంటనే వచ్చేస్తామని కన్నా కూడా వెటకారంగా చెప్తాడు. కన్నా మాటలకు చక్రి మరింత టెన్షన్ పడుతుంటాడు. ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తుంటాడు.
సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించిన గోపికను మహా ఓదారుస్తుంది. అసలు చక్రి ఎన్నాళ్లుగా పరిచయం అని అడుగుతుంది. 20 రోజులుగా పరిచయం అని గోపిక చెబితే మహా ఆశ్చర్యపోతుంది. 20 రోజుల్లోనే చచ్చిపోయేంత ప్రేమ పుట్టిందా అంటూ ప్రశ్నిస్తుంది. చక్రి ఎప్పుడైనా నిన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పాడా అంటూ అడుగుతుంది. గోపిక లేదని చెప్తుంది. పోనీ ఫోన్‌లో మాట్లాడటం.. మెసేజ్ చేసుకోవడం.. సినిమాలకు వెళ్లడం, పార్కులకు వెళ్లడం లాంటివి ఏమైనా చేశారా… అని అడిగితే..
లేదని గోపిక చెప్తుంది. మరి నువ్వు ప్రేమిస్తున్నట్టు ఎప్పుడైనా చెప్పావా…? అంటూ మహా అడిగితే.. చెప్పానని అప్పటి నుంచి చక్రి తనను దూరం పెడుతున్నాడని చెప్తుంది. దీంతో మహా కోపంగా గోపికను తిడుతుంది. చక్రి నిన్ను మోసం చేయలేదు కదా ఎందుక సూసైడ్ చేసుకోవడం అంటూ క్లాస్ తీసుకుంటుంది. అయినా నీకున్న అందానికి చక్రి ఏంటి ఎవరైనా పడిపోతారు.. మనల్ని వద్దనుకున్నవాళ్ల ముందు మనం గొప్పగా ఎదిగి చూపించాలి అని మహా చెప్పడంతో గోపిక మనసు మార్చుకుంటుంది. చక్రిని మరచిపోతానని అంటుంది. ఇంతలో ఇవాళ్టీ పొదరిల్లు సీరియల్ ఏపిసోడ్ అయిపోతుంది.