Bigg Boss 10: బిగ్ బాస్.. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీజన్ 10 ప్రారంభమై అప్పుడే రెండు వారాలు పూర్తయింది. మొదటి వారంలో చైత్ర ఎలిమినేట్ కాగా , రెండవ వారంలో కృష్ణుడు ఎలిమినేట్ అయ్యారు. నిజానికి మొదటి వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా కామన్ మ్యాన్ కేటగిరీలో హౌస్ లోకి అడుగుపెట్టిన ఆర్.జే.చరణ్ ఎలిమినేట్ అయినప్పటికీ.. మళ్లీ ఆడియన్స్ పోల్ నిర్వహించగా.. బిగ్ బాస్ మరో అవకాశం కల్పించింది. ఇకపోతే షాలిని వర్సెస్ వర్షిణి మధ్య ఏ విధంగా అయితే పోటీ జరుగుతోందో అదే విధంగా ముఖేష్ – దేబ్జాని మధ్య లవ్ ట్రాక్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.
ఇకపోతే ఇద్దరు లవ్ బర్డ్స్ గా చాలా చక్కగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సమయంలో ముఖేష్ తన స్వార్థాన్ని బయటపెట్టాడు. ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ముఖేష్ స్వార్థానికి బలైన దేబ్జాని ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యింది. ఇష్టపడుతున్న అమ్మాయి కోసం అతడు ఇంత స్వార్థంగా ఎలా ఆలోచించాడు అంటూ కూడా నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం..
“టెంటేషన్ వర్సెస్ టెన్షన్” టాస్క్ లో భాగంగా ముఖేష్ కి బిగ్ బాస్ ఫోన్ చేసి మాట్లాడుతూ..” ముఖేష్ మీ నాన్నని మిస్ అవుతున్నారా?” అని అడగగా.. “కచ్చితంగా బిగ్ బాస్.. ఆయన చనిపోయి మూడు సంవత్సరాలవుతోంది ” అంటూ తెలిపాడు. ఇక బిగ్ బాస్ మాట్లాడుతూ..” మీరు మీ నాన్నతో ఉన్న ఫోటోని టెంటేషన్ గా పొందబోతున్నారు. అయితే ఆ టెంటేషన్ మీ చేతికి అందే ముందు ఎవరికి టెన్షన్ ఇవ్వాలనుకుంటున్నారో చెప్పండి “అంటూ బిగ్ బాస్ చెబుతారు. ఇక వెంటనే వర్షిణి , దేబ్జానీలను ఎంపిక చేసుకున్న ముఖేష్ అనూహ్యంగా.. “ఐ యాం సారీ దేబ్జానీ” అంటూ దేబ్జానీ కోసం ఆమె కుటుంబ సభ్యులు పంపిన ఒక లెటర్ ను ముఖేష్ స్పాయిల్ చేశారు.
also read:‘ కాకా’ సెట్ లో ‘చిరు 48ఇయర్స్ ఇండస్ట్రీ’ సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్!
బిగ్ బాస్ మాట్లాడుతూ.. దేబ్జానీ తన అమ్మానాన్న ప్రేమతో పంపిన లెటర్ ను కోల్పోయింది అంటూ చెప్పడంతో ఒక్కసారిగా కన్నీటి పర్యంతమై నేల కూలింది దెబ్జానీ . ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ముఖేష్ పై ఫైర్ అవుతున్నారు . ఒక అమ్మాయికి అంత ప్రేమగా తల్లిదండ్రులు లెటర్ పంపితే నీ స్వార్థం కోసం దానిని ఎలా నువ్వు స్పాయిల్ చేయగలిగావు అంటూ మండిపడుతున్నారు. మొత్తానికైతే లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో వైరల్ గా మారుతుంది.
బిగ్ బాస్ విషయానికి వస్తే.. మొత్తం పదిమంది సెలబ్రిటీలతో 6 మంది సామాన్యులతో సీజన్ 10 ప్రారంభమయ్యింది. హౌస్ లోకి అడుగుపెట్టిన తొలివారమే సామాన్యలు తమ ఆట తీరుతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. పైగా తొలి కెప్టెన్గా సామాన్యురాలు కేటగిరీలో హౌస్ లోకి అడుగుపెట్టిన ఝాన్సీ కెప్టెన్ గా నిలవగా.. స్టార్ ఆఫ్ ద వీక్ గా ముఖేష్ నిలిచారు.