E-Paper
Advertisement

‘ కాకా’ సెట్ లో ‘చిరు 48ఇయర్స్ ఇండస్ట్రీ’ సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్!

‘ కాకా’ సెట్ లో ‘చిరు 48ఇయర్స్ ఇండస్ట్రీ’ సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్!
Advertisement

Chiranjeevi: ఊరికే మెగాస్టార్ అయిపోరు ఎవరు.. ఆ స్థానాన్ని పదిలంగా ఉంచుకోవడానికి పడే కష్టం ఎలాంటిదో చిరంజీవిని చూస్తే అర్థమవుతుంది. నేడు సినిమా ఇండస్ట్రీలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డైరెక్టర్లు, హీరోలు కూడా చిరంజీవి స్ఫూర్తితో ఇండస్ట్రీలోకి వచ్చామని చెప్పిన వాళ్లే చాలామంది ఉన్నారు. రాజమౌళిని మొదలుకొని నాని వరకు ఎంతో మంది చిరంజీవి అభిమానులే ..అలాంటి చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చి నేటితో 48 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు , అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కాకా మూవీ సెట్ లో ప్రత్యేక సెలబ్రేషన్స్

ఇకపోతే చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చి 48 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఆయన ప్రస్తుతం నటిస్తున్న కాకా మూవీ టీం ప్రత్యేకంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ.. కేక్ కట్ చేయించి మరి గ్రాండ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. విషయంలోకి వెళ్తే ..ప్రస్తుతం చిరంజీవి ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో కాకా అనే చిత్రం చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒకవైపు ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుపుకుంటుంది.

అభిమాన నటుడికి స్పెషల్ సర్ప్రైజ్..

Advertisement

ఇక తమ సినిమా హీరో ఇండస్ట్రీకి వచ్చి 48 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేకంగా.. ఆయన చేత కేక్ కట్ చేయించి మరి స్పెషల్ విషెస్ తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.తెలుగు సినిమా రంగంలో మెగాస్టార్ చిరంజీవి గారు 48 ఏళ్ల ఘనప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. 48 ఏళ్ల అద్భుతమైన ప్రయాణం తరతరాలకు స్ఫూర్తినిచ్చే వారసత్వం అంటూ పోస్టు షేర్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..

also read:తెల్ల కాగితం’ ట్రైలర్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న ఎమోషనల్ లవ్ డ్రామా!

48 ఏళ్ల సినీ ప్రస్థానంపై చిరంజీవి రియాక్షన్..

Advertisement

1978లో ప్రాణం ఖరీదు సినిమాతో మొదలైన ఆయన ప్రయాణం నేటితో 48 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ” ఆరోజు మొదలైన నా సినీ ప్రయాణం నేటితో 48 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ ప్రయాణంలో ఎన్నో పాత్రలు పోషించాను . ఎన్నో విజయాలు చూసాను. అనేక అవార్డులు, గౌరవాలు కూడా అందుకున్నాను. అయితే ఇవన్నీ నాకు ఆనందాన్ని ఇచ్చినప్పటికీ.. ప్రేక్షకులు నాపై చూపించిన ప్రేమ మాత్రం అన్నిటికంటే గొప్పది. ముఖ్యంగా నా కెరియర్ మొదలైన కొత్తలో నన్ను నమ్మి ఎంతో మంది నిర్మాతలు నాకు అవకాశం కల్పించారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు” అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు చిరంజీవి.

Related News

తెల్ల కాగితం’ ట్రైలర్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న ఎమోషనల్ లవ్ డ్రామా!

బాలయ్య వాయిస్ తో ‘డోంట్  ట్రబుల్  ద ట్రబుల్’ ట్రైలర్ రిలీజ్!

వాయిదా పడ్డ ‘ఆదర్శ కుటుంబం-AK47’.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

ఇంటిమేట్ సీన్స్‌లో అసలు మ్యాటర్ ఇదే.. విషయం చెప్పిన క్రేజీ డైరెక్టర్ !

‘జార్జ్ క్రిష్’ ఫస్ట్ బూస్టర్ వచ్చేస్తోంది.. శర్వా ఫ్యాన్స్‌కు పండగే!

‘ది ప్యారడైజ్’ లో మోహన్ బాబు పాత్ర అంత భయంకరంగా ఉంటుందా?

రూ.10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఏకంగా రూ.350 కోట్ల వసూళ్లు!

Big Stories

Advertisement
×