E-Paper
Advertisement

మాజీ నేవీ సీల్‌కు మళ్లీ డేంజరస్ మిషన్… న్యూక్లియర్ కోడ్స్ కోసం ప్రాణాలకు తెగించి పోరాటం… హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్

మాజీ నేవీ సీల్‌కు మళ్లీ డేంజరస్ మిషన్… న్యూక్లియర్ కోడ్స్ కోసం ప్రాణాలకు తెగించి పోరాటం… హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్
Advertisement

Action Thriller: హై వోల్టేజ్ యాక్షన్‌తో సినిమా అంటే మూవీ లవర్స్ కూడా చెవి కోసుకుంటారు. స్కాట్ అడ్కిన్స్ జేక్ హారిస్‌గా నటించిన ‘One Last Shot’  సినిమా చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. స్టోరీ కూడా అలానే ఉంటుంది మరి. ఇందులో మాజీ సహచరుడే ప్రమాదకర శత్రువుగా మారుతాడు. న్యూక్లియర్ మిషన్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో మెర్సెనరీలు, డెడ్‌లీ ట్రాప్స్, గన్ ఫైట్స్‌తో యాక్షన్‌కు కొదవ ఉండదు.

 కథలోకి వెళ్తే…

జేక్ హారిస్ (Jake Harris) ఒక అనుభవజ్ఞుడైన నేవీ సీల్. ఎన్నో ప్రమాదకరమైన ఆపరేషన్లను ఎదుర్కొన్న తర్వాత అతను వార్ లైఫ్ కి  దూరంగా ఉండాలని చూస్తుంటాడు. గతంలో జరిగిన సంఘటనలు అతని మనసులో ఇంకా మిగిలే ఉంటాయి. ఇక సాధారణ జీవితంలోకి వెళ్లిపోదామని అనుకున్న సమయంలోనే ప్రపంచ భద్రతను ప్రభావితం చేసే ఒక పెద్ద ముప్పు ఎదురవుతుంది. అతని మాజీ సహచరుడు ఎలియట్ కార్టర్ (Elliot Carter) ఇప్పుడు శత్రువుగా మారిపోయాడు. అతని లక్ష్యం సాధారణమైంది కాదు. అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్‌ను ఒక న్యూక్లియర్ బంకర్‌లో బంధించి, అక్కడి నుంచి న్యూక్లియర్ కోడ్స్‌ను స్వాధీనం చేసుకోవాలన్నది అతని ప్లాన్. ఆ కోడ్స్ అతని చేతికి చిక్కితే కేవలం ఒక ప్రాంతం కాదు.. ప్రపంచ స్థాయిలోనే భారీ ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది.

Advertisement

ఇలాంటి పరిస్థితుల్లో జేక్‌ను మళ్లీ రంగంలోకి పిలుస్తారు. తన బృందంతో కలిసి శత్రు ప్రాంతంలోకి వెళ్లాల్సిన బాధ్యత అతనిపై పడుతుంది. కానీ ఇది సులభమైన మిషన్ కాదు. అతని బృందం ముందుకు వెళ్లే ప్రతి అడుగులోనూ మెర్సినరీలు, బూబీ ట్రాప్స్, ఆయుధాలతో కూడిన దాడులు ఎదురవుతాయి. ఒక్క తప్పు నిర్ణయం తీసుకున్నా మిషన్ విఫలమయ్యే ప్రమాదం ఉంటుంది. జేక్‌కు బయట శత్రువులతో పోరాటం ఒక సమస్య అయితే, లోపల అతని గతం మరో సమస్యగా మారుతుంది. ఒకప్పుడు తనతో కలిసి పనిచేసిన వ్యక్తే ఇప్పుడు ప్రపంచానికి ముప్పుగా మారడం అతని నిర్ణయాలను మరింత క్లిష్టంగా చేస్తుంది. అతన్ని ఎలా ఆపాలి? ఎంత దూరం వెళ్లాలి? ఎవరిని నమ్మాలి? అనే ప్రశ్నలు ప్రతి దశలోనూ ఎదురవుతాయి.

న్యూక్లియర్ కోడ్స్‌ను కార్టర్ దక్కించుకునేలోపు జేక్ అతని ప్లాన్‌ను అడ్డుకోవాలి. సమయం తక్కువ. శత్రువులు ఎక్కువ. మార్గం ప్రమాదాలతో నిండి ఉంటుంది. ఈ నేపథ్యంలో జేక్ తన టీమ్‌తో కలిసి చేసే ఆపరేషన్‌లో యాక్షన్ సన్నివేశాలు కీలకంగా మారతాయి. చివరికి జేక్ తన గతాన్ని పక్కన పెట్టి మిషన్‌ను పూర్తి చేయగలడా? కార్టర్ చేతుల్లోకి న్యూక్లియర్ కోడ్స్ వెళ్లకుండా అడ్డుకోగలడా? అనే ఉత్కంఠతతో ‘వన్ లాస్ట్ షాట్’ (One Last Shot)స్టోరీ సాగుతుంది. క్లైమాక్స్ మరింత కిక్ ఇస్తుంది ఈ మూవీలో.

 తెలుగులో అందుబాటులో ఉందా?

Advertisement

జేమ్స్ నన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో స్కాట్ అడ్కిన్స్, స్టీవెన్ క్రీ, హన్నా వేర్, డాల్ఫ్ లండ్‌గ్రెన్, నీల్ లిన్‌పో తదితరులు నటించారు. సినిమా నిడివి 1 గంట 37 నిమిషాలు. ‘One Last Shot’ సెప్టెంబర్ 22న డిజిటల్‌కు వచ్చింది. Prime Videoలో అందుబాటులో ఉంది.  ఫాస్ట్ యాక్షన్, మిలిటరీ మిషన్స్, న్యూక్లియర్ థ్రెట్, గన్ ఫైట్స్ ఇష్టపడేవారికి ఈ సినిమా మంచి యాక్షన్ రైడ్‌గా నిలుస్తుంది.

Read Also: పగతో రగిలిపోయే గ్యాంగ్‌స్టర్… రాత్రికి రాత్రే ఊరంతా ఊచకోత… మెంటల్ మాస్ రివేంజ్

Related News

విశ్రాంతి కోసం స్పాకు వెళ్లిన నలుగురు ఫ్రెండ్స్… కట్ చేస్తే ఫుల్ కామెడీ

కొండల్లోని అద్భుతమైన మాయా చెట్టు… కలల ప్రపంచంలోకి తీసుకెళ్లే విజువల్ ఫ్యాంటసీ అడ్వెంచర్

నగరాన్ని కాపాడిన సూపర్‌ హీరోనే నిందితుడు… మూడేళ్ల తర్వాత సరదా తీర్చేసిన యాక్షన్ థ్రిల్లర్

రిహాబ్‌కు తీసుకెళ్లాల్సిన కుర్రాడితో చిక్కుల్లో… ఇద్దరు డ్రైవర్ల జర్నీ ఫుల్ రచ్చ… కామెడీ ఎంటర్‌టైనర్

సేఫ్‌ లు ఇలా కూడా తెరుస్తారా ? పియానో ట్యూనర్‌ టాలెంట్ కు పిచ్చెక్కాల్సిందే… మైండ్ బ్లాకింగ్ థ్రిల్లర్

200 ఏళ్ల వెనక్కి వెళ్లే ప్రేమికులు… అడుగడుగునా డేంజరస్ ట్విస్టులు… టైమ్-ట్రావెల్ విజువల్ వండర్

చీకట్లో విరుచుకుపడ్డ వింత రాక్షసులు… 500 ఏళ్ల నాటి నిజం బట్టబయలు… అర్ధరాత్రి ఆ అడవిలో ఏం జరిగింది ?

Big Stories

Advertisement
×