E-Paper
Advertisement

అఫీషియల్ లాంచ్ కంటే ముందే లీక్.. Xiaomi 18 Pro, Redmi 17 సిరీస్ రిలీజ్ డేట్స్ ఇవే!

అఫీషియల్ లాంచ్ కంటే ముందే లీక్.. Xiaomi 18 Pro, Redmi 17 సిరీస్ రిలీజ్ డేట్స్ ఇవే!
Advertisement

Xiaomi 18 Pro: టెక్ మార్కెట్‌లోకి నిత్యం ఎన్నో ఫోన్లు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ రెడ్‌మీ నోట్ సిరీస్, షావోమీ ఫ్లాగ్‌షిప్‌లు వస్తున్నాయంటే ఆ హైపే వేరు. అలాంటి స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసమే ఒక ఆసక్తికరమైన లీక్ చక్కర్లు కొడుతోంది. ఈ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో షావోమీ నుంచి వరుసగా మూడు పవర్‌ఫుల్ సిరీస్‌లు భారత్‌లో లాంచ్ కాబోతున్నాయట. ఇంతకీ ఆ ఫోన్ల లైనప్ ఏంటో చూసేద్దామా..

ముందుగా వచ్చేది బడ్జెట్ ఫోన్లే:

బడ్జెట్ ప్రియులను ఆకట్టుకునేలా రెడ్‌మీ 17 సిరీస్ సిద్ధమవుతోంది. ప్రముఖ టెక్ లీకర్ అభిషేక్ యాదవ్ అందించిన సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 5న ఈ సిరీస్ ఫోన్లు ఇండియాలో గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వనున్నాయి. తక్కువ ధరలో మంచి ఫీచర్లు కోరుకునే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్‌గా నిలవనున్నాయి.

Advertisement

Also Read: యాపిల్ వాచ్ లవర్స్‌కు క్రేజీ అప్‌డేట్.. 6 ఏళ్ల తర్వాత ఆ రాయల్ డిజైన్ మళ్లీ వస్తోంది!

సెప్టెంబర్ మిడ్‌లో నోట్ సిరీస్:

బడ్జెట్ ఫోన్ల తర్వాత కొద్ది రోజుల్లోనే అంటే.. సెప్టెంబర్ 18 లేదా 20వ తేదీ నాటికి ‘రెడ్‌మీ నోట్ 17 ప్రో’ మోడల్ మార్కెట్లోకి రానుంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 ప్రాసెసర్‌తో రానున్న నోట్ 17 ప్రో మాక్స్ వేరియంట్ కూడా దీంతో పాటే వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా.. ఈ సిరీస్‌లో ప్రో ప్లస్ మోడల్ కూడా ఉండొచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.

డిసెంబర్‌లో పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ లాంచ్:

Advertisement

ఇక టెక్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్లాగ్‌షిప్ మోడల్ ‘షావోమీ 18 ప్రో’ డిసెంబర్ నాటికి భారత వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. గతంలో షావోమీ 17, 17 అల్ట్రా మోడళ్లను మాత్రమే భారత్‌లో రిలీజ్ చేసి ప్రో వెర్షన్లను పక్కన పెట్టింది. అయితే ఈసారి తమ స్ట్రాటజీని మార్చుకుని, డిసెంబర్‌లోనే షావోమీ 18 ప్రోను తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తోంది.

Also Read: ధర ఎక్కువైనా వర్త్ అనిపించే ఫీచర్లు.. OnePlus 16లో రాబోతున్న క్రేజీ చేంజెస్ ఇవే!

Tags

Related News

ఉచిత ఇంటర్నెట్ టీవీకి చెక్? టెలికాం నిబంధనల దిశగా ట్రాయ్ అడుగులు!

వామ్మో.. ఫోన్ అప్‌డేట్ వెనుక ఇంత ప్రాసెస్ ఉందా? కోడింగ్ నుంచి మీ మొబైల్ వరకు ఎలా వస్తుందంటే!

కరెంట్ పోయిన వెంటనే..తప్పకుండా ఆపేయాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్

ఫోన్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం.. ఈ 4 సెట్టింగ్స్ మార్చితే GBల కొద్దీ స్పేస్ ఫ్రీ!

గెలాక్సీ వాచ్‌పై ఆరెంజ్ డాట్ ఎందుకు వస్తుంది? దాని అర్థం ఏంటి?

వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు ఇవ్వరో తెలుసా?

ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేయిస్తున్నారా? బ్లాక్ అండ్ బ్లూ ప్యానెల్స్ మధ్య తేడా ఇదే !

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

Big Stories

Advertisement
×