E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode August 13th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి గురించి నిజం చెప్పేందుకు అమర్‌ ఇంటికి వెళ్లిన వార్డెన్‌  

Nindu Noorella Saavasam Serial Today Episode August 13th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి గురించి నిజం చెప్పేందుకు అమర్‌ ఇంటికి వెళ్లిన వార్డెన్‌  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: ఆశ్రమంలో నిద్రపోతున్న సరస్వతి వార్డెన్‌ మనోహరి, మిస్సమ్మను చంపేసినట్టు కలగంటుంది. భయంతో నిద్రలేచిన వార్డెన్‌ తన వచ్చిన కల గురించి రాజుకు చెప్తుంది. అమర్ సార్‌కు నిజం చెప్పాలని లేదంటే ఆ మనోహరి ఏదో ఒకరోజు ఆరును చంపినట్టే మిస్సమ్మను చంపేస్తుందని భయపడుతుంది. రాజు వద్దు మేడం ఎలా చెప్తారు. ఆ మనోహరి మీరు నిజం చెప్పకుండా అడ్డుపడుతుంది.. మళ్లీ మనోహరి వల్ల మీరు చిక్కుల్లో పడతారేమో అని భయపడితే.. లేదు రాజు గారు.. నిజం చెప్పిన తర్వాత మనోహరి నన్నేం చేయలేదు.. ఒకవేళ నన్ను చంపేసినా పర్వాలేదు కానీ భాగీ మేడంకు ఏం కాకూడదు..అందుకే అమర్‌ సార్‌కు నిజం చెప్పాలి మనం వెంటనే అమర్‌ సార్‌ ఇంటికి వెళ్లి నిజం చెబుదాం పదండి అంటుంది రాజు అయితే సరే మేడం మీ ఇష్టం అంటూ రాజు, వార్డెన్‌తో కలిసి అమర్‌ ఇంటికి వెళ్తారు.

అమర్‌ ఇంటి ముందు రాథోడ్‌ కారు క్లీన్‌ చేస్తుంటాడు. అప్పుడే గేటు ఓపెన్‌ చేసుకుని సరస్వతి వార్డెన్‌, రాజు లోపలికి వస్తారు. వాళ్లను చూసిన రాథోడ్‌ అప్యాయంగా పలకరిస్తాడు. ఏంటి ఇలా వచ్చారు అని అడగ్గానే.. అమర్‌ సార్‌తో మాట్లాడాలి అని వచ్చాము సార్‌ ఉన్నారా..? అని వార్డెన్‌ అడగ్గానే.. ఉన్నారు మేడం ఏదైనా ఇంపార్టెంట్‌ విషయమా అని రాథోడ్ అడిగితే అవును ఈరోజే మాట్లాడాలి అంటూ వార్డెన్‌ చెప్పగానే.. రాథోడ్ అయితే లోపలికి రండి మేడం అంటూ రాథోడ్‌ వెళ్తాడు. రాజు మాత్రం ఎందుకైనా మంచిది ఇంకోసారి ఆలోచించండి మేడం అని చెప్పగానే.. వార్డెన్‌ అన్ని ఆలోచించే వచ్చాను రాజు గారు అంటూ లోపలికి వెళ్తుంది. రాథోడ్‌ వాళ్లను హాల్లో కూర్చోమని సార్‌ పైన ఉన్నారని వెళ్లి తీసుకొస్తానని వెళ్తాడు.

Advertisement

వార్డెన్‌, రాజు అక్కడే నిల్చొని ఉంటారు. మనోహరి, చంభా రూంలోకి బయటకు వస్తారు. వార్డెన్‌ను చూసిన మనోహరి షాక్‌ అవుతుంది. దగ్గరకు వెళ్లి ఏంటి వార్డెన్‌ పొద్దున్నే ఇలా వచ్చారు.. అని అడగ్గానే.. సార్‌తో పని ఉండి వచ్చాము అని వార్డెన్‌ చెప్తుంది. ఏంటా పని అని మనోహరి అడిగితే.. సార్‌తోనే చెప్తాను అని వార్డెన్‌ అంటే.. ఏం నాతో చెప్పవా.? అంటూ మనోహరి అడిగితే. నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటుంది. మనోహరి అనుమానంగా నా గురించి అయితే రాలేదు కదా అనగానే.. వార్డెన్‌ భయం వేస్తుందా…? అంటే ఎవరు ఎవర్ని భయపెట్టారో ఒక్కసారి గుర్తు చేసుకో అనగానే.. వార్డెన్‌ కోపంగా చూస్తుంది.

అప్పుడే పైనుంచి మిస్సమ్మ వస్తుంది. మీరు వచ్చారని రాథోడ్‌ చెప్పారు.. ఆయన పైన రెడీ అవుతున్నారు మీరు కూర్చోండి అని చెప్పగానే.. పర్వాలేదు మేడం సార్‌తో మాట్లాడి వెళ్తాము అనగానే.. మిస్సమ్మ కోపంగా మనోహరిని చూస్తూ.. మీ వార్డెన్‌ వస్తే కనీసం కూర్చో అని కూడా అనలేవా..? ఆశ్రమంలో మీరు ఇదే నేర్పించారా మేడం.. లేకపోతే మనోహరి మాత్రమే నేర్చుకోలేదా..? అని అడిగితే.. అందరూ అరుంధతిలా ఉండరు కదమ్మా.. ఒకరో ఇద్దరో కొంచెం తేడాగా ఉంటారు అంటూ వార్డెన్‌ చెప్తుంటే.. మనోహరి కోపంగా వార్డెన్‌కు వార్నింగ్‌ ఇస్తుంది. మిస్సమ్మ కూడా మనోహరిని కోపంగా తిడుతూ వార్నింగ్‌ ఇవ్వబోతుంటే.. అప్పుడే అమర్‌ కిందకు వస్తాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

Podarillu Today Episode : చక్రికీ దిమ్మతిరిగే షాక్.. గోపికకు మైండ్ బ్లాక్.. మాధవ్ కు టెన్షన్..

Karthika Deepam 2 Serial Today Episode September 29th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని బెదిరించడంతో జ్యోత్స్నను జాబ్ లోంచి తీసేసిన కేఫ్ ఓనరు             

Illu Illalu Pillalu Today Episodes: భాగ్యంకు షాక్.. ప్రేమ మాటతో ఫ్యూజుల్ అవుట్.. ప్రేమ పెళ్లికి రెడీ..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్.. అవని దెబ్బకు షాక్.. పల్లవి పై అనుమానం..

Gundeninda Gudigantalu : ఒడియమ్మ బంటి.. ఒకరు కాదు.. ఇద్దరు అవుట్..

Ninnu kori Serial Today Episode September 29th ‘నిన్ను కోరి’ సీరియల్‌: జీవన్ కు వార్నింగ్ ఇస్తున్న దాక్షాయణి   

Tuesday Tv Movies : మంగళవారం మూవీ లవర్స్ కు పండగే.. డోంట్ మిస్…

సిగ్గులేదా? నెగటివ్ కామెంట్స్ పై చైత్ర రాయ్ ఎమోషనల్!

Big Stories

Advertisement
×