SNICKO CONTROVERSY Over Steve Smith: ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ ( Australia vs Bangladesh) టెస్ట్ సిరీస్ (Bangladesh tour of Australia, 2026) ఇవాళ ప్రారంభమైంది. డార్విన్ మరారా క్రికెట్ మైదానం ( Marrara Cricket Ground, Darwin ) వేదికగా ఇవాళ ఉదయం ఆరు గంటల సమయంలో ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ షురూ అయింది. ఇందులో టాస్ గెలిచి, ఆస్ట్రేలియా బ్యాటింగ్ కు దిగింది. ఈ క్రమంలోనే పీకల్లోతు కష్టాల్లో పడింది ఆస్ట్రేలియా. 100 పరుగులు కూడా పూర్తి చేయకుండానే నాలుగు వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్ బౌలర్ల దాటికి ఆస్ట్రేలియా టాపార్డర్ కుప్పకూలింది. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా ఈ మ్యాచ్ లో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వివాదం రాజుకుంది. ఆస్ట్రేలియా గ్రేట్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ క్యాచ్ (Steve Smith ) ఔట్ అయినప్పటికీ, నాటౌట్ గా ప్రకటించడంతో తెరపైకి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి.
ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ ( Australia vs Bangladesh) మధ్య ఇవాళ తొలి టెస్ట్ ప్రారంభం కాగా, ఈ మ్యాచ్ లో నాలుగవ వికెట్ కు స్టీవ్ స్మిత్ బరిలోకి దిగాడు. ఈ నేపథ్యంలో ఎబాడాట్ హుస్సేన్ (Ebadot Hossain) 21వ ఓవర్ వేశాడు. ఆ సమయంలో డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు స్మిత్. అయితే బంతి స్మిత్ బ్యాట్ ను తగిలి వికెట్ కీపర్ చేతిలో పడింది. ఆ సమయంలో అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. కానీ తాను ఔట్ అయ్యాననే భావనతో స్టీవ్ స్మిత్ పెవిలియన్ వైపు నడవడం మొదలుపెట్టాడు.
దాదాపు 30 గజాలు పెవిలియన్ వైపు నడిచాడు. దీంతో సంబరాలు చేసుకుని, రివ్యూ కు వెళ్లారు బంగ్లాదేశ్ ఫీల్డర్స్. థర్డ్ ఎంపైర్ రివ్యూ ను పరిశీలించగా… అల్ట్రా ఎడ్జ్ లో డిఫెక్షన్ కనిపించలేదు. దీంతో ఆన్ ఫీల్డ్ అంపైర్ కుమార ధర్మసేన నిర్ణయానికి కట్టుబడి స్మిత్ ను నాటౌట్ గా ప్రకటించేశారు థర్డ్ అంపైర్. దీంతో మళ్ళీ క్రేజ్ లోకి వచ్చి స్టీవ్ స్మిత్ వచ్చాడు. ఎప్పటిలాగే మళ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు.
అయితే ఆస్ట్రేలియా ఆటగాడు స్మిత్ కు అనుకూలంగా థర్డ్ అంపైర్ నిర్ణయం తీసుకోవడంపై బంగ్లాదేశ్ క్రికెటర్లతో పాటు అభిమానులు సీరియస్ అవుతున్నారు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలవాలని ఫిక్సింగ్ జరిగిందని ఆరోపణలు కూడా చేస్తున్నారు. స్టీవ్ స్మిత్ తాను అవుట్ అని వెళ్ళిపోయినప్పటికీ.. థర్డ్ అంపైర్ మాత్రం దౌర్జన్యంగా వ్యవహరించాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఐసీసీ విచారణ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో అల్ట్రా ఎడ్జ్ వ్యవస్థ పని చేయడం లేదని మండిపడుతున్నారు.
🚨 SNICKO CONTROVERSY HITS AUSTRALIA AGAIN 🚨
– Steve Smith seemed to have edged it
– Bangladesh appealed, then took a review
– Smith was almost walking back to the pavilion
– The fielders were confident it was out
– Snicko showed no spike.The incident has already sparked… pic.twitter.com/ddAYag8fSL
— Hamza Khan (@Hamzakhan17_) August 13, 2026