E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode August 19th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  పార్థును  మనోహరితో బయటకు వెళ్లమన్న మిస్సమ్మ, రాథోడ్ 

Nindu Noorella Saavasam Serial Today Episode August 19th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  పార్థును  మనోహరితో బయటకు వెళ్లమన్న మిస్సమ్మ, రాథోడ్ 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  ఉదయమే పిల్లలను తీసుకుని బయటకు వెళ్లి ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మిస్సమ్మను చూసి అమర వెటకారంగా మాట్లాడతాడు. దీంతో ముగ్గు వేయడం అంటే అంత ఈజీ అనుకున్నారా..? అయితే మీరు ఒక ముగ్గు వేసి చూపించండి అంటుంది మిస్సమ్మ. అందుకు పిల్లలు కూడా డాడీ చూద్దాం ఒక ముగ్గు వేయండి డాడీ అంటారు. అమర్‌ కోపంగా చూస్తూ.. మిలటరీలో ఉన్నాడు ముగ్గు వేయడం రాదు అనుకున్నావా..? అంటే.. మాటలు చెప్పడం కాదండి.. ముగ్గు వేసి చూపించండి అంటూ రెచ్చగొడుతుంది మిస్సమ్మ. అయితే వేస్తాను అది ఇలా ఇవ్వు అంటూ పిండి తీసుకుని ముగ్గు వేయడానికి రెడీ అవుతాడు అమర్‌. పిల్లలు, మిస్సమ్మ ఆసక్తిగా చూస్తుంటారు. కిందకు కూర్చున్న అమర్‌ ముగ్గు వేయడానికి చుక్కలు పెడతాడు. తర్వాత ఎలా వేయాలో అర్థం కాక ఆలోచిస్తుంటాడు.

మిస్సమ్మ మాత్రం హలో శ్రీవారు.. ముగ్గులోకి దింపినంత ఈజీ కాదు ముగ్గు వేయడం అంటే అని చెప్పగానే.. ఎలా వేయాలబ్బా అని అమర్‌ ఆలోచిస్తుంటాడు. అప్పుడే రాథోడ్‌ వస్తాడు. గేటు దగ్గర నుంచే అమర్‌ ముగ్గు వేయడం గమనించి దగ్గరకు వచ్చి ఆశ్చర్యంగా ఇక్కడున్న సీసీ కెమెరాలు ఆఫ్‌ చేయండి.. పై నుంచి విమానాల్లో ఎవరైనా గమనిస్తారేమో అడ్డుగా ఏదైనా పట్టండి లేకపోతే మా సార్‌ ఏంటి..? ముగ్గు వేయడం ఏంటి.. అది ఎవరైనా శ్రతుదేశాల వాళ్లు చూస్తే మా ఇజ్జత్‌ పోతుంది అంటాడు.. రాథోడ్‌..

Advertisement

అమర్‌ మాత్రం ముగ్గు వేయడం కూడా ఒక ఆర్ట్‌ రాథోడ్‌ మనలాంటి వాళ్లకు అన్ని తెలిసి ఉండాలి.. వచ్చి ఉండాలి.. రా చూడు నేను ముగ్గు ఎలా వేస్తానో అంటూ చుక్కల మధ్య వంకరటింకరగా లైన్లు కలుపుతాడు. ఇప్పుడు చూడు రాథోడ్‌ నా ముగ్గు ఎలా ఉందో అంటాడు. ఆ ముగ్గు చూసిన రాథోడ్‌.. నవ్వుతూ.. సార్‌ ఇదేదో ప్రపంచానికే తెలియని దేశపు జాతీయజెండాలా ఉంది అంటూ నవ్వుతాడు. అమర్‌ లేచి పిల్లలు మీరు వెళ్లి వార్మప్‌ చేయండి.. నేను రన్నింగ్‌ చేసి వస్తాను అంటూ వెళ్లిపోతాడు. రాథోడ్‌ నవ్వుతూ మిస్సమ్మ మొత్తానికి మా సారును ముగ్గులోకి దించేశావు.. ఇంతకీ పార్థు సార్‌ ఏం చేస్తున్నారు అంటూ ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్తారు.

హాల్లో పేపర్‌ చూస్తూ ఉన్న పార్థును చూసి రాథోడ్‌, మిస్సమ్మ నవ్వుకుంటారు.. ఈయనకు బొత్తిగా ప్రపంచ జ్ఞానం లేదు మిస్సమ్మ.. లేకపోతే వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇలా ఒంటరిగా పేపర్‌ చదువుతూ కూర్చున్నాడేంటి..? అంటాడు.. మిస్సమ్మ మాత్రం మనమే పార్థు గారికి చెప్పాలి రాథోడ్‌ అనగానే.. అవును మిస్సమ్మ పార్థు సారుకు జాకీలు పెట్టి మనమే రెచ్చగొట్టాలి లేదంటే ఇలాగే ఉండిపోతాడు.. అనుకుంటూ దగ్గరకు వెళ్లి పలకరిస్తారు. మీరు వారం రోజుల్లో పెళ్లి పెట్టుకని ఇలా ఉంటారేంటి సార్‌ అంటాడు రాథోడ్‌.. ఇలా కాకపోతే మరెలా ఉండాలి రాథోడ్‌ అని పార్థు అడిగితే.. మీరెలా ఉండాలంటే అంటూ రాథోడ్‌, మిస్సమ్మ చెప్తుంటే.. చంభా వచ్చి వింటుంది. అమ్మో వీళ్లేమో పార్థు సార్‌ను రెచ్చగొడుతున్నారు.. ఈ విషయం వెంటనే మనోహరికి చెప్పాలి అనుకుంటూ మనోహరి దగ్గరకు పరుగుపరుగున వెళ్తుంది చంభా.. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆస్తుల చిట్టా బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

సుప్రీత ఇండస్ట్రీకి రావడం వెనుక అతని ప్రమేయం ఉందా? ఆయన కోరిక నెరవేర్చారా??

Big Stories

Advertisement
×