E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today December 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:   ఆరుతో మాట్లాడాలనుకున్న అమర్‌ – కొత్త ప్లాన్‌ వేసిన మనోహరి

Nindu Noorella Saavasam Serial Today December 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:   ఆరుతో మాట్లాడాలనుకున్న అమర్‌ – కొత్త ప్లాన్‌ వేసిన మనోహరి
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode :  రాథోడ్‌ ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు చెప్పు అని మిస్సమ్మ అడగ్గానే నీ గురించే అని రాథోడ్ చెప్తాడు. మా నాన్న కూడా నా గురించి ఇంతలా ఆలోచించి ఉండరు. అన్నయ్యా పదానికి నిలువెత్తు రూపం రాథోడ్‌ నువ్వు అని మిస్సమ్మ అనగానే రాథోడ్ తల బాదుకుంటాడు. ఏమైంది రాథోడ్‌ అని మిస్సమ్మ అడగ్గానే ఇందాక స్వామిజీ వచ్చి మేడం గారు  ఇక్కడే తిరుగుతుంది కదా ఎవరికీ కనిపించని మేడం ఆత్మ నీకు కనిపిస్తుందేమోనని నాకు అనుమానం అంటాడు. దీంతో మిస్సమ్మ నేను పక్కింటి అక్కతో మాట్లాడుతున్నాను అని చెప్పగానే మాకెవరికీ కనిపించని పక్కింటి అక్క నీకెలా కనిపిస్తుంది. అని అడగ్గానే ఆరు అక్క ఫోటో నేను చూశాను. తను ఆరు అక్క కాదు. అయినా ఆత్మలను ఎవరైనా పట్టుకుంటారా..? కానీ నేను పక్కింటి అక్కను చాలా సార్లు పట్టుకున్నాను అని చెప్పగానే అవునా సరే అని రాథోడ్‌ వెళ్లిపోతాడు.

మనోహరి ఆలోచిస్తూ.. ఆ ముసలోళ్లు నా ప్రతి ప్లానుకు అడ్డు పడుతూనే ఉన్నారు. దాన్ని పౌర్ణమి లోపు పంపించేద్దాం అనుకుంటే పౌర్ణమి వరకు ఆపేశారు. దానికి ఈ మిస్సమ్మ కూడా వత్తాసు పలికింది. ఇప్పుడు ఆ పౌర్ణమి రోజు అది ఎందుకు సైలెంట్‌ గా ఉంటుంది. అయినా దాన్ని ఎలాగో మూడు రోజులు ఆపితే దాని పీడ విరగడి అయిపోతుంది. అని మాట్లాడుకుంటుంటే.. మిస్సమ్మ వస్తుంది. మిస్సమ్మను చూసిన మనోహరి షాక్‌ అవుతుంది. నేను మాట్లాడుకున్నది మొత్తం విందా అని మనసులో అనుకుంటుంది. మిస్సమ్మ దగ్గరకు వచ్చి నువ్వు ఇక మారవా మనోహరి ఎప్పుడూ ఇలా ఎవరినో ఒకరిని బాధపెడుతూనే ఉంటావా..? అంటూ ప్రశ్నిస్తుంది.

Advertisement

దీంతో మనోహరి రిలాక్స్‌ అవుతుంది. నేను మాట్లాడుకుంది వినలేదు అని మనసులో అనుకుని ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతుది. నువ్వు ఆరోజు నాకు చూపించింది ఆరు అక్క ఫోటోనేనా..? అని అడుగుతుంది. దీంతో ఆరు ఫోటోనే అని మనోహరి చెప్తుంది. దీంతో నీ మాటల్లో కంగారు.. ముఖంలో టెన్షన్‌ చూస్తుంటే ఇక్కడేదో జరుగుతుంది అని నాకు అనుమానంగా ఉంది అంటుంది. దీంతో నువ్వు ఇక్కడి నుంచి వెళ్లి అని తిడుతుంది మనోహరి. ఇంతలో అమర్‌ వస్తాడు. నేను మీ ఇద్దరితో మాట్లాడాలని వచ్చాను అని చెప్తాడు. ఏంటి అమర్‌ అని మనోహరి అడుగుతుంది.

ఘోర గురించి మాట్లాడాలి అని అమర్‌ చెప్తాడు. దీంతో మనోహరి భయంతో ఘోర గురించా..? ఏం మాట్లాడాలి.. అని అడుగుతుంది. మనం ఆరు అస్థికలు నదిలో కలిపేస్తున్నామని ఆ ఘోరకు తెలిస్తే వాడు మళ్లీ మన ఇంటికి వస్తాడు. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడానికి వచ్చాను ముఖ్యంగా మనోహరి నువ్వు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ ఘోర మన ఇంటికి వచ్చిన ప్రతిసారి నీ రూంలోకి వచ్చాడని నాకు అనుమానంగా ఉంది అని చెప్పడంతో మనోహరి మరింత టెన్షన్‌గా ఇక రాడులే అమర్‌ అని అంటుంది. దీంతో నీకెలా తెలుసు అంత కచ్చితంగా ఎలా చెప్తున్నావు అని అమర్‌, మిస్సమ్మ అడుగుతారు. మనం ఎవ్వరం చెప్పకపోతే ఘోరకు ఎలా తెలుస్తుంది. అందుకే రాడులే అని చెప్పాను అంటుంది మనోహరి.

Advertisement

ఘోర పూజలు చేస్తుంటాడు. ఆరు ఆస్తికలు నదిలో కలపడం తెలుస్తుంది. వెంటనే పూజలోంచి బయటకు వచ్చిన ఘోర నా పూజలకు అడ్డు తగిలింది ఎవరు..? దేవా ఎక్కడ తప్పు జరుగుతుంది. నా పూజల లోపమా..? చెప్పు అని అడగ్గానే ఘోర గురువు వచ్చి ఆ ఆత్మ ఆస్థికలు పుణ్యనదుల్లో కలపాలని నిర్ణయం తీసుకున్నారు. ఆస్థికలు నదిలో కలిపితే ఆ ఆత్మ నీకు బందీ కాదు. ఇక నువ్వు ఎన్ని పూజలు చేసినా వృథాయే అని చెప్తాడు. దీంతో ఈ సారి ఆ ఆత్మను బంధించకపోతే నా శిరస్సును ఖండించి నీ పాదాల దగ్గర పెడతాను అని ఘోర ప్రతిజ్ఞ చేస్తాడు.

ఘోర ప్రతిజ్ఞ గుప్తకు తెలిసిపోతుంది. గుప్త బయపడుతుంటే యముడు వచ్చి ఆ బాలిక ఆస్థికలు నదిలో కలిపేందుకు ఎలాంటి ఆటంకాలు జరగకూడదు అని హెచ్చరిస్తాడు. ఆస్థికలు నదిలో కలుపేవరకు ఎలాంటి తప్పిదం జరగకుండా చూసుకోమ్ము అని చెప్పగానే గుప్త సరే అంటాడు.

అమర్‌ స్వామిజీ ఆశ్రమానికి బయలుదేరుతాడు. ఆరు అనాథ కాదని తన తల్లిదండ్రులు వద్దని వదిలించుకుని వదిలేయలేదని తన తండ్రి తన తోడ బుట్టిన మిస్సమ్మ తనను పాతికేళ్లు గుండెల్లో పెట్టుకున్నారని ఆరుకు తెలియాలి. తనను తన కంటే తన కుటుంబం ఎంత ప్రేమించిందో తనకు తెలియాలి. తను అనాథ కావడానికి తన కుటుంబం కాదని తన కర్మ అని ఆరుకు తెలియాలి. తనతో నేను ఎలా మాట్లాడగలనో తెలుసుకోవడానికే ఆశ్రమానికి వెళ్తున్నాను రాథోడ్‌ అని అమర్‌ చెప్తాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

Karthika Deepam 2 Serial Today Episode November 8th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఇంట్లో వాళ్లతో చాలెంజ్ చేసిన జ్యోత్స్న 

Podarillu Today Episode : ముద్దులతో రెచ్చిపోయిన జంటలు.. పాపం చక్రీ.. మహాకు ముద్దుపెడతాడా..?

Brahmamudi Serial Today Episode November 8th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  ఇంట్లో మార్పులకు రాజు  శ్రీకారం – అయోమయంలో రేఖ

Intinti Ramayanam Today Episode: కన్నీళ్లు పెట్టుకున్న రమ్య .. పల్లవికి మరో షాక్.. రమ్యను కొట్టిన పల్లవి..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి అడ్డంగా ఇరుక్కుంటుందా..? అడ్డంగా బుక్కయిన అరుణ్.. హైలెట్ సీన్ ఇదే..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ దెబ్బకు భద్ర ఫ్యూజుల్ అవుట్.. ఇది కదా సర్ప్రైజ్.. నర్మదా ప్లానేంటి..?

Telugu TV Serials: టీవీ సీరియల్స్ వీక్లీ రిపోర్ట్.. ఆ సీరియల్ కు బిగ్ షాక్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Big Stories

Advertisement
×