Intinti Ramayanam Today Episode july 16th: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ తలనొప్పిగా ఉందని బాధపడుతూ ఉంటాడు. తలనొప్పి ఉందని చెప్పారంట కదా మీకు జండుబాం రాస్తానని అంటుంది. ఆల్రెడీ టాబ్లెట్ వేసుకున్నాను ఇంకా ఇదే ఎందుకు అని అక్షయ్ అడుగుతాడు. టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుందా ఇది కాస్త రాస్తే తొందరగా తగ్గుతుందండి ఆరాధ్యతో మీరు చెప్పారు అంట కదా అందుకే బాంబు తీసుకొని వచ్చాను అని అవని అవని అంటుంది. అవని ప్రేమగా అక్షయ్కు జండుబాం రాసి వెళుతుంది. భానుమతి తన భర్త ఇంకా రాలేదని వెయిట్ చేస్తూ ఉంటుంది.. మా ఆయన ఇంట్లో ఉంటే వస్తానని చెప్పాడు కదా ఇంకా రాలేదేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే బయట నుంచి భానుమతి అని ప్రేమగా ఒక పిలుపు వినిపిస్తుంది. ఆ మాట వినగానే భానుమతి సంతోషంతో ఉప్పొంగిపోతుంది. ఏంటండీ ఇంత లేటుగా వచ్చారు మీరు ఇంకా స్వర్గంలో రంభ ఊర్వశిలతో ఉన్నారనుకున్నాను. అక్కడ చాలామంది ఉంటారు. కానీ నీలాంటి వాళ్ళు ఉండరు కదా నీ అంత అందగత్తె ఉండరు కదా అని కమలాకర్ వేషంలో ఉన్న కమల్ పొగడ్తలతో ముంచెత్తుతాడు.. అక్షయ్ కు అవని సేవలు చేస్తున్నాడం చూసి రాజేంద్రప్రసాద్ నీకు ఇలాంటి భార్య దొరకడం అదృష్టం అని అంటాడు. అక్షయ్ ఆలోచిస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పల్లవి అర్ధరాత్రి అటూ ఇటూ తిరుగుతూ ఆ రోజు నగలు కొట్టేసింది నిజంగానే కమల్ బావ. శ్రీయా అన్నట్లు బావే ఆ నగలను కొట్టేసాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. పల్లవి అర్ధరాత్రి అటూ ఇటూ తిరుగుతూ ఉండటం చూసిన శ్రియ.. ఏంటి నన్ను ఎలా దెబ్బ కొట్టాలని ఆలోచిస్తున్నావా అని పల్లవి తో అంటుంది. నీ గురించి తప్ప నాకు వేరే పని ఏం లేదా అని పల్లవి అంటుంది. మా బావ దొంగతనం చేశాడంటే కచ్చితంగా శ్రీకర్ బాబు కూడా హెల్ప్ చేశారని నాకు అనుమానం వస్తుంది అని అనగానే.. మీ ఆయన దొంగతనం చేశాడంటే నమ్మొచ్చు మా ఆయన జోలికొస్తే మర్యాదగా ఉండదని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పల్లవి ఇది తింగరిదా అనుకున్నా.. పిచ్చిది కూడా అని అర్థమవుతుంది.
ఉదయం లేవగానే అవని వంట చేస్తూ ఉంటుంది అక్షయ్ అవనిని నేను చూస్తాడు. అవని పైట చెంగు స్టవ్ మీద పడటంతో ఆ విషయాన్ని గమనించిన అక్షయ్ వెంటనే అవి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. పైటకొంగుకు నిప్పు అంటుకుంది ఆ మాత్రం చూసుకోవా నువ్వు అని అరుస్తాడు. నేను చూసాను కాబట్టి సరిపోయింది లేకుంటే ఎంత ప్రమాదం జరిగేది నువ్వు ఆమాత్రం కనిపెట్టలేకపోతున్నావా ఏంటి ఆ పరధ్యానం అని అరుస్తాడు. వంట చేసేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి.
ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకో అని అక్షయ్ అరుస్తూ ఉంటే అవని మాత్రం నవ్వుతూ ఉంటుంది. నేనంటే ఎంత కోపం ఉన్నా నామీద మీకు ఈ ప్రేమ మాత్రం తగ్గలేదు అని అవని అనుకుంటుంది.. ఇక పల్లవి రెడీ అవుతూ కమల్ గురక పెడుతుంటే ఇలాంటి వాన్ని చేసుకొని నేనేం సుఖపడాలి అంటూ తిట్టుకుంటూ ఉంటుంది. కమల్ వదిన అన్నయ్య ఇద్దరు కలిసి ఉంటే చాలా బాగుంది అని కలవరిస్తూ ఉంటాడు.
అయితే పల్లవి అక్షయ్ బావ వాళ్ళు నిజంగానే ఎక్కడున్నారో లేదో తెలుసుకోవాలని బయలుదేరుతుంది. ఈ విషయాన్ని పార్వతితో చెప్తుంది. పార్వతి సున్నుండలు ఇచ్చి రమ్మని పంపిస్తుంది. అవని ఇంటికి పల్లవి రాగానే అందరూ అలర్ట్ అవుతారు.. పల్లవి ఇయన్ని చూస్తే ఖచ్చితంగా అత్తయ్య కు చెప్పి లేనిపోని గొడవలు చేస్తుందని అవని జాగ్రత్తపడుతుంది. నేను వాష్ రూమ్ అర్జెంటుగా ఉంటే వచ్చాను అక్క ఈ రూమ్లో వాష్ రూమ్ కి వెళ్ళొచ్చా అని వెళ్తుంది. పల్లవి వస్తున్న విషయాన్ని అక్షయకు మెసేజ్ చేసి చెప్తుంది అవని..
Also Read : రోహిణికి దిమ్మతిరిగే షాక్..మీనాకు నిజం చెప్పిన బాలు.. ప్రభావతి పై సత్యం సీరియస్..
మొత్తానికి పల్లవి కి అక్షయ్ ని దొరక్కుండా అవని చేస్తుంది. అయితే పల్లవి బయటకు వెళ్లిన తర్వాత అక్కడ చెప్పులు ఉండడం చూసి కచ్చితంగా అక్షయ్ బావ ఇక్కడే ఉన్నాడు అని కన్ఫామ్ చేసుకోవడానికి కిటికీలోంచి చూస్తుంది.. అక్కడ అక్షయ్ కనిపించడంతో వీడియో తీస్తుంది. కచ్చితంగా అవని అక్క ఇది అంత చేసింది అని అత్తయ్యకి చెప్తే ఎంత గొడవ చేస్తుందో అర్థమవుతుంది అని పల్లవి వెళ్తూ ఉంటుంది. అవని కారు ఆపి పల్లవి ఈ నిజాన్ని నువ్వు అత్తయ్య చెప్తే నీ గురించి మీ నాన్న గురించి మొత్తం బండారు అని బయట పెట్టాల్సి వస్తుందని బెదిరిస్తుంది. అంతేకాదు నీకు ఒకటి ఇవ్వడం మర్చిపోయానని చంప పగలగొడుతుంది. మీ నాన్న గురించి నీ గురించి బయట పెడితే ఆ తర్వాత మీ నాన్న జైలుకు వెళ్తాడు నువ్వు రోడ్ల పట్టుకుని తిరుగుతావు అని వార్నింగ్ ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..