Nindu Noorella Saavasam Serial Today Episode: గార్డెన్‌లో ఆరు ఆలోచిస్తూ చిరాకుగా చూస్తూ అటూ ఇటూ తిరుగుతుంటే ఇప్పుడు ఏం జరిగిందని అంతలా ఆలోచిస్తున్నావు బాలిక అని గుప్త అడుగుతాడు. దీంతో ఆరు కోపంగా ఇంకా ఏం జరగాలి గుప్త గారు మొన్నటికి మొన్న ఫంక్షన్‌లో అంజును కిడ్నాప్ చేయాలని చూశారు. ఇవాళ ఇంటి ముందుకు వచ్చి కిడ్నాప్ చేయాలని చూస్తున్నారు. ఇలాగే వదిలేస్తే అంజుకు ఏమౌతుందోనని చాలా భయంగా ఉంది అని చెప్తుంది. దీంతో గుప్త నీ బాధ నాకు అర్తం అవుతుంది. కానీ.. అంటూ ఏదో చెప్పబోతుంటే.. ఆరు కోపంగా కానీ లేదు కాకరకాయ లేదు ఇప్పుడే వెళ్లి దాన్ని చంపి ఈ ప్రాబ్లమ్‌కు పర్మినెంట్‌గా పులిస్టాప్ పెట్టేస్తాను అని ఆరు వెళ్లబోతుంటే గుప్త అడ్డుగా నిలబడి ఆగుము బాలిక నువ్వు చేయబోతున్నది చాలా తప్పు అంటాడు.
దీంతో ఆరు అంటే తనేం తప్పు చేయడం లేదా..? లేకపోతే అవి మీకు కనిపంచం లేదా..? మీతో మాట్లాడటం టైం వేస్ట్ పక్కకు తప్పుకోండి గుప్త గారు అంటుంది. దీంతో గుప్త మేము తప్పుకోము అంటాడు. గుప్త గారు ఫ్లీజ్ నేను మనోహరిని చంపేస్తే నా కుటుంబం సంతోషంగా ఉంటుంది అంటూ వెళ్లబోతుంటే.. గుప్త గట్టిగా బాలిక నీ ఆవేశంతో వినాశనం జరుగును కానీ సమస్యలు పరిష్కారం కావు. చెడుపై మంచి గెలుచుటకు మంచి ఎన్నడూ మారకూడదు. అయినను నీవు ఈ పని చేసినచో ఆ బాలికకు నీకు ఏమి వ్యత్యాసం ఉండును. మంచి అనునది నీ ఆయుధం దానిని ఎన్నడూ వీడవకు బాలిక అని గుప్త చెప్పగానే..
ఆ మంచి నాకు ఎన్నడు మంచి చేసింది గుప్త గారు.. నన్న నా కుటుంబానికి దూరం చేసింది. నా కుటుంబం కష్టాల్లో పడేలా చేసింది. ప్రమాదం నా ఇంట్లో వచ్చి చేరేలా చేసింది అంతేగా.. అంటూ కోప్పడుతుంది ఆరు. దీంతో గుప్త కాదు బాలిక.. నీ మంచి నిన్ను నీ పతిదేవుని దగ్గరకు చేర్చినది. ఒక కుటుంబం ఇచ్చింది. ఆ కుంటుంబానికి కష్టంలో తోడుగా ఉన్నది. నీ సహోదరిని ఈ ఇంటికి చేర్చినది. నీవు ఎంతటి కష్టములు వచ్చినను మంచిని వీడలేదు. అందుకే ఆ జగన్నాథుడు నీకు శక్తులను ఇచ్చాడు. నీ సమయం పూర్తి అయినను నిన్ను ఇంక ఇచ్చటనే ఉంచాడు అంటూ గుప్త చెప్తుండగానే.. ఆరు ఎమోషనల్‌గా మనోహరి నిజస్వరూపం మా ఆయన ముందు బయట పెట్టలేనప్పుడు.. నా కుంటుంబం కష్టాన్ని తీర్చలేనప్పుడు ఇక నా శక్తులు ఎందుకు గుప్తగారు. చెప్పండి గుప్తగారు అన్నింటికీ మీ దగ్గర సమాధానం ఉంటుంది కదా.. దీనికి కూడా ఏదో సమాధానం ఉండే ఉంటుంది చెప్పండి గుప్తగారు అంటూ ఆరు అడగ్గానే..
గుప్త నీ సమస్యకు సమాధానం నీకును తెలియును బాలిక. కానీ నీకు ఆ బాలిక మీద ఉన్న కోపం వల్ల తెలుసుకోలేకపోతున్నావు అని చెప్తాడు గుప్త. దీంతో ఆరు కన్పీజ్‌గా మీరు ఏమంటున్నారో తెలియడం లేదు గుప్తగారు అంటుంది. దీంతో గుప్త నీ సమస్యకు పరిష్కారం నీ పతిదేవునికి నువ్వు నిజం చెప్పుటయా..? లేక అతగాడిక నిజం తెలియటయా..? అని అడుగుతాడు. దీంతో ఆరు ఆయనకు నిజం తెలియడము.. కానీ నేను చెప్పకూడదు ఎవరైనా వచ్చి చెప్పేలా చేయడం తప్పు కాదు అంతే కదా అంటుంది ఆరు. ఏమో అదియు నీకే తెలియాలి అంటాడు… అంటే తప్పు కాదు.. మను గురించి నాకు తప్ప ఇంకెవరికి తెలుసు… అని ఆలోచిస్తుంది ఆరు.
ఆలోచించగా ఆరుకు ఆశ్రమం వార్డెన్‌కు గుర్తుకు వస్తుంది. వెంటనే వార్డెన్ మేడం అమర్‌ను కలిసేలా చేయాలని ఆరు డిసైడ్ అవుతుంది. మరోవైపు మనోహరి.. రణవీర్‌కు కాల్ చేసి అంజలిని కిడ్నాప్ చేయడం నువ్వు ఆపకపోతే అమర్‌కు దొరికిపోతావు అని చెప్తుంది. దీంతో రణవీర్ కోపంగా ఏం మాట్లాడుతున్నావు మనోహరి అంజలి కథ ముగించకపోతే నేను జైలుకు పోతానని నీకు తెలుసు కదా అంటాడు రణవీర్. దీంతో మనోహరి తెలుసు కానీ ఇప్పుడు నువ్వు ఆపకపోతే ప్రాణాలతో ఉండవు. అది నువ్వు తెలుసుకోవాలి. అమర్ మంచితనమే చూశావు కోపం ఆవేశం తెలియదు.. అంటూ అమర్‌ను కిడ్నాప్ విషయం నుంచి డైవర్ట్ చేయి అంటూ తన ప్లాన్ చెప్తుంది. రణవీర్ సరే అంటాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?