Nindu Noorella Saavasam Serial Today Episode: వినోద్, చిత్ర వచ్చి తాము బిజినెస్ చేయాలనుకుంటున్నామని.. అమర్‌కు చెప్తారు. ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నారు అని అమర్ అడగ్గానే.. ఇంత వరకు ఏదీ అనుకోలేదని ముందు ఇన్వెస్ట్‌మెంట్ గురించి మాట్లాడాక బిజినెస్ గురించి ఆలోచించాలనుకున్నాను అంటాడు వినోద్. దీంతో అమర్ ఏంట్రా వినోద్ మార్కెట్ గురించి తెలుసుకోకుండా బిజినెస్ చేయడం ఏంటి..? ఏం బిజినెస్ చేయాలో స్టడీ చేశాక ఇన్వెస్ట్‌మెంట్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పి అమర్ వెల్లిపోతుంటే.. చిత్ర బావగారు ఒక్క నిమిషం ఇన్వెస్ట్‌మెంట్ గురించి కూడా ఇప్పుడే మాట్లాడుకుందాం నేను వెంటనే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తుంది.
దీంతో మిస్సమ్మ అనుకుంటేనో అనిపిస్తేనో బిజినెస్ లు చేయకూడదు చిత్ర.. తెలిస్తేనే చేయాలి అని చెప్తుంది. దీంతో మనోహరి ఏం చేయాలో చేయకూడదో చిత్రకు బాగా తెలుసు కదా భాగీ.. అయినా అమర్ మాట్లాడుతున్నాడు కదా మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు.. నువ్వు చెప్పు అమర్.. అంటుంది. ఇంతలో చిత్ర మధ్యలోకి రావడం మోసం చేయడం భాగీకి అలవాటే కదా మను.. ఏంటి భాగీ అలా చూస్తున్నావు.. నీలాగా మోసం చేసి పెళ్లి చేసుకోవడానికి ప్లాన్స్ వేయాలి.. ప్రిపరేషన్ చేయాలి. కానీ బిజినెస్‌కు అంత ప్లానింగ్ అవసరం లేదు అంటుంది చిత్ర. దీంతో అమర్ కోపంగా ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు ముందూ వెనక ఆలోచించి మాట్లాడాలి. ఓరేయ్ వినోద్ నేను వెళ్లి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అంటూ అమర్ వెళ్లిపోతుంటే..
చిత్ర బావగారు ఒక్క నిమిషం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదని చెప్పండి అంతే కానీ ఇలా అప్పుడు మాట్లాడుదాం.. ఇప్పుడు మాట్లాడుదాం అది చేసి రండి ఇది చేసి రండి అని కారణాలు మాత్రం చెప్పకండి అంటుంది. దీంతో వినోద్ చిత్ర ఏం మాట్లాడుతున్నావు అంటాడు. దీంతో చిత్ర.. వినోద్ వినడానికి కష్టంగా ఉంటే ఐ యామ్ సారీ నాకైతే నేను బిజినెస్ చేసి సక్సెస్ అవ్వడం మీ అన్నయ్యకు ఇష్టం లేన్నట్టుంది అంటుంది. దీంతో మిస్సమ్మ చిత్ర నువ్వు సక్సెస్ అయితే ఈ ఇంట్లో ఆయనకంటే ఆనందించే వాళ్లు ఎవ్వరూ ఉండరు. కానీ బిజినెస్ గురించి తెలియకుండా నువ్వు చేసే చిన్న తప్పను నలుగురిని ఇంటి వైపు వేలెత్తేలా చూపిస్తుంది అని చెప్తుంది. ఇంతలో మనోహరి కల్పించుకుని నీ ప్రాబ్లం ఏంటి భాగీ ప్రయత్నమే చేయకుండా ఫెయిల్యూర్ అయిపోతుంది అని మాట్లాడుతున్నావు. పాపం ఏదో బిజినెస్ చేయాలని ఆశ పడుతుంది. దానికెందుకు అంత అడ్డు పడుతున్నావు. నువ్వేం మాట్లాడవేం అమర్ అని అడుగుతుంది మనోహరి.
ఇంతలో అమర్ అనుకుంటూ రణవీర్ వస్తాడు. మనోహరి ప్లాన్ ప్రకారం రణవీర్ డైరెక్టుగా నా కూతురు దుర్గ ఎక్కడుంది అమర్ అని అడుగుతాడు. అమర్ షాక్ అవుతాడు. తెలియదని.. తెలుసుకుని చెప్తాను అని మాత్రం చెప్పొద్దు అమర్. ఎందుకంటే నాకు కావాల్సిన సమాధానం అది కాదు. అసలు నా కూతురు ప్రాణాలతోనే ఉందా అమర్. నా అన్ని ప్రశ్నలకు నాకు త్వరలోఏ సమాధానం కావాలి అమర్. లేదంటే నేను లీగల్‌గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. మనకున్న ఫ్రెండిష్ప్‌తో నీకు ముందుగానే చెప్తున్నాను అమర్. నువ్వు అరుంధతి గారు దత్తత తీసుకున్న నా కూతురుని నాకు అప్పగించకపోతే నేను నీ మీద కేసు పెట్టి జైలుకు పంపుతాను ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి రణవీర్ వెళ్లిపోతాడు.
దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంతలో చిత్ర సరిపోయింది. బావగారు తర్వాత మాట్లాడటానికి నా దగ్గర టైం ఉన్నా.. మీ దగ్గర టైం లేన్నట్టుంది. జైలుకు వెళ్లే లోపు ఆ డబ్బులు ఏవో మాక అరైంజ్ చేసి వెళ్లండి అని వినోద్‌ను తీసుకుని లోపలికి వెళ్లిపోతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?