Nindu Noorella Saavasam Serial Today Episode: ఇంట్లో అందరూ భోజనం చేస్తుంటే.. ఆరు గుప్తను లాక్కొని వస్తుంది. మిస్సమ్మ కాంపిటీషన్ గురించి అమర్‌కు చెప్తుంది. అమర్ ఏం అటాడో చూద్దాం రండి అంటుంది. ఇద్దరు కిటికీ దగ్గరకు వస్తారు. పిల్లలు కూడా మిస్సమ్మను చెప్పమని సైగ చేస్తారు. మిస్సమ్మ తర్వాత చెప్తాను అంటుంది. దీంతో అంజు కోపంగా అందరం ఉన్నాం కదా ఇప్పుడే చెప్పు.. అందరం సపోర్ట చేస్తాం చెప్పు అంటుంది. కోప్పడితే అందరి ముందు పరువు పోతుంది తర్వాత చెప్తాను అంటుంది. అబ్బా ఏం కాదు చెప్పు అంటూ అంజు బలవంతం చేస్తుంది. చిత్ర కూడా భాగీ కంటే ముందు నేనే కాంపిటీషన్ గురించి చెప్పాలి.. భాగీకి చెప్పే చాన్స్ ఇవ్వకూడదు అని మనసులో అనుకుని బావగారు మీతో ఒక విషయం మాట్లాడాలి. ఈ విషయం వినోద్‌కు కూడా ఇంకా చెప్పలేదు అంటుంది.
దీంతో ఏంటి చిత్ర అని అమర్ అడగ్గానే.. అది తెలిసిన వాళ్లు బెస్ట్ కపుల్ కాంపిటీషన్ పెడుతున్నారు. నేను వినోద్ పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాము.. మీరేం అంటారు బావగారు అని అడుగుతుంది చిత్ర. భాగీ అడుగుతుందనుకుంటే చిత్ర అడిగిందేంటి గుప్త గారు మొత్తం ప్లాన్ అంతా చెడగొట్టింది అని ఆరు బాధపడుతుంది. అమర్ మీ ఇష్టం చిత్ర.. మీ ఇద్దరికీ వెళ్లాలి అని ఉంటే హ్యాపీగా వెళ్లండి. అని చెప్తాడు. దీంతో చిత్ర వినోద్ ఓకేనా..? వినోద్ ఫ్రైజ్ మనీ ఫిఫ్టీ లాక్స్.. మనం గెలవగలం అని నాకైతే నమ్మకం ఉంది వినోద్ అనగానే వినోద్ ఓకే వెళ్దాం అంటాడు. దీంతో చిత్ర థాంక్యూ వినోద్.. బావగారు మేము వెళ్తాము.. రేపు పొద్దున్నే మేము బయలుదేరాలి అంటుంది. దీంతో ఆరు డిసప్పాయింట్‌గా అయ్యో భాగీ ఇప్పుడు భాగీ కాంపిటీషన్ గురించి చెబితే మేము వెళ్తున్నాము అని మాకు కాంపిటీషన్‌గా మీరు వస్తున్నారా అని మళ్లీ చిత్ర గొడవ చేస్తుంది. చీ.. ఈ చిత్ర బలే లాక్ చేసింది గుప్తగారు అనగానే అవును అవును తెలివైన ఆలోచన చేసింది అంటాడు.
ఇంతలో అంజు కల్పించినుకుని డాడ్ మీరు మిస్సమ్మ కూడా కాంపిటీషన్‌కు వెళ్లొచ్చు కదా..? అని చెప్తుంది. అంజు మాటలకు ఆరు హ్యాపీగా ఫీలవుతుంది. చిత్ర, మను షాక్ అవుతారు. అమ్ము కూడా అవును డాడ్ మీరు పిన్ని కూడా కాంపిటీషన్‌కు వెళ్లండి అని చెప్తుంది. నీ పిల్ల పిచ్చుకలు ఎంత చక్కగా నీ సహోదరి కోరిక తీరుస్తున్నారో చూడుము.. అంటాడు గుప్త. అవును గుప్త గారు.. భాగీ అడిగితే చిత్ర గొడవ చేస్తుంది. కానీ అందరూ కలిసి భాగీని ఒప్పిస్తే.. అంజు చాలా ఇంటలిజెంట్ గుప్త గారు అని చెప్తుంది ఆరు. ఇంతలో మనోహరి కూడా అమర్ పిల్లలు చెప్తుంది కరెక్టే కదా… నువ్వు భాగీ కూడా వెళితే బాగుంటుంది అని చెప్తుంది.
దీంతో ఆరు అనుమానంగా ఇదేంటి గుప్తగారు ఈ రాక్షసి ఏంటి భాగీకి హెల్ప్ చేస్తుంది అని అడగ్గానే.. ఏమో ఆ బాలిక మనసులో ఏమున్నదో.. అంటాడు గుప్త. భాగీకి ఇలాంటి కాంపిటీషన్స్ ఇష్టం ఉండవు మనోహరి అని అమర్ చెప్తుండగానే మిస్సమ్మ ఏయ్ నాకు ఇష్టమే.. అంటే మనం గెలిస్తే ఫ్రైజ్ మనీ వస్తుంది. అనాథ శరణాలయంలో పిల్లలకు ఇస్తే వాళ్లు ఇంకెప్పుడు డబ్బుల గురించి ఇబ్బంది ఉండదు కదండి అని చెప్తుంది మిస్సమ్మ. పిల్లలు అందరూ డాడ్ ఫ్లీజ్ ఒప్పుకోండి అని రిక్వెస్ట్ చేస్తుంటారు. ఇంతలో అమర్ అన్నం తినకుండా లేచి వెళ్లిపోతాడు. దీంతో చిత్ర నవ్వుతూ భాగీ బావగారికి రావడం ఇష్టం లేదనుకుంటా సరేలే నేను వినోద్ వెళ్తాం అంటూ వెళ్లిపోతుంది.
మరుసటి రోజు కరుణ వస్తుంది. మీ ఆయన ఫామ్ మీద సైన్ చేసిండా..? అని అడుగుతుంది. ఏమీ అనుకోకే కరుణ. ఆయనకు ఈ కాంపిటీషన్ ఇష్టం లేదనుకుంటా..? అందుకే సైన్ చేయలేదు. అంటూ లోపలికి వెళ్లి పేపర్స్ తీసుకొచ్చి కరుణకు ఇస్తుంది. పేపర్స్ ఓపెన్ చేసి చూసిన కరుణ మీ ఆయన సైన్ చేసిండు కదనే అంటుంది. దీంతో మిస్సమ్మ షాక్ అవుతుంది. మనోహరి హ్యాపీగా ఫీలవయితే.. చిత్ర బాధపడుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?