BigTV English

Nindu Noorella Saavasam Serial Today July 26th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి షాక్‌ ఇచ్చిన రణవీర్‌

Nindu Noorella Saavasam Serial Today July 26th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి షాక్‌ ఇచ్చిన రణవీర్‌

Nindu Noorella Saavasam Serial Today Episode: బెస్ట్‌ కపుల్స్‌ కాంపిటీషన్‌లో పాల్గొనడం అమర్‌కు ఇష్టం లేదని అప్లికేషన్‌ పేపర్స్‌ మీద సైన్‌ చేయలేదని మిస్సమ్మ డల్లుగా చెప్పి పేపర్స్‌ తీసుకొచ్చి కరుణ చేతిలో పెట్టి వెళ్లిపోతుంటే.. పేపర్స్‌ చూసిన కరుణ ఇందులో మీ ఆయన సైన్‌ చేశాడే అని చెప్తుంది. దీంతో మిస్సమ్మ, మనోహరి, చిత్ర షాక్‌ అవుతారు. మనోహరి, మిస్సమ్మ హ్యాపీగా ఫీలయితే.. చిత్ర మాత్రం బాధపడుతుంది. అంటే ఆయన సైన్‌ అప్పుడే చేశాడేమో.. నేనే చూసుకోకుండా మాట్లాడాను.. అంటుంది మిస్సమ్మ. దీంతో కరుణ ఏయ్‌ పోరి పొద్దుగాల కూడా చూడాల్సిందే.. అని చెప్తుంది.


ఏదైతే అది అయింది ఆయన మాత్రం సైన్‌ చేశారు. కరుణ కాంపిటీషన్‌కు ఎన్ని గంటలకు రావాలి అని అడుగుతుంది. మీరు అక్కడ పది గంటలకు ఉంటే సరిపోతుందే అని చెప్పగానే.. ఓ తప్పకుండా టైంకే వచ్చేస్తాము.. చిత్ర నువ్వు నీ హస్బెంట్‌ రెడీ అవ్వాలంట కదా రెడీ అవ్వండి వెళ్లు గో.. ఓ మను థాంక్యూ సోమచ్‌.. సపోర్ట్‌ చేసినందుకు.. అంటూ మిస్సమ్మ సిగ్గు పడుతుంది. ఇంతలో డోర్‌ చాటు నుంచి చూస్తున్న ఆరు కూడా ఓ అంటే మా ఆయన ఫామ్‌ మీద  సైన్‌ చేశాడన్న మాట అయ్యో థాంక్యూ దేవుడా.. థాంక్యూ.. ఇప్పుడు ఈ జంటను చూసి అక్కడ అందరూ తెగ దిష్టి పెట్టేస్తారు. ఆల్‌ ది బెస్ట్‌.. అంటూ హ్యాపీగా ఫీలవుతుంది. తర్వాత మనోహరి, రణవీర్‌కు కాల్‌ చేస్తుంది. కాల్‌ లిఫ్ట్‌ చేసిన రణవీర్‌ చెప్పు మనోహరి ఇంత పొద్దున్నే కాల్ చేశావు అని అడుగుతాడు. చెప్తాను ముందు నేను అడిగేదానికి సమాధానం చెప్పు.. కొత్త నెంబర్స్‌ ఏమీ అమర్‌కు తెలిసే అవకాశం లేదు కదా..? అని అడుగుతుంది.

దీంతో లేదు.. కొత్త ఫ్రూప్స్‌ పెట్టి అన్ని నెంబర్స్‌ కొత్తవి తెప్పించా.. అమర్‌కు ఎప్పటికీ ఈ నెంబర్స్‌ తెలియవు.. అని చెప్పగానే.. గుడ్‌.. ఇవాళే వచ్చి అంజును కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లగలవా..? ఇప్పటికిప్పుడు ప్లాన్‌ ఎక్జిక్యూట్‌ చేయగలవా…? అని మనోహరి అడగ్గానే.. రణవీర్‌.. అనుమానంగా  కిడ్నాప్‌ గురించి మర్చిపో అన్నావు.. దుర్గ గురించి బ్లాక్‌ మెయిల్‌ చేయమన్నావు.. మళ్లీ నువ్వే ఫోన్‌ చేసి దుర్గ గురించి కూడా అడగొద్దు అన్నావు.. ఇప్పుడు ఫోన్‌ చేసి అంజలిని కిడ్నాప్‌ చేయగలవా అని అడుగుతున్నావు.. అసలు నీకు ఏమైంది మనోహరి.. బాగానే ఉన్నావా..? అని అడుగుతాడు. దీంతో నేను బాగానే ఉన్నాను రణవీర్‌ నువ్వు కూడా బాగా ఉండాలన్నా…? బ్రతికి ఉండాలన్నా.. భద్రంగా ఉండాలన్నా అంజలి ఈ ఇంట్లో ఉండకూడదు.. ఇప్పుడు చెప్పు.. ఇవాళ అంజలిని కిడ్నాప్‌ చేయగలవా.. లేదా..? అని అడుగుతుంది.


దీంతో చేస్తాను.. కానీ అమర్‌ ఉండగా అదంతా ఈజీ కాదని నీక్కూడా తెలుసు. కానీ ఇదంతా చెప్తున్నావు అంటే అమర్‌ ఇంట్లో లేడని అర్థం కదా అంటాడు రణవీర్‌. అవును అమర్‌ బెస్ట్‌ కపుల్‌ కాంపిటీషన్‌ అమర్‌, భాగీ, చిత్ర, వినోద్‌ అందరూ వెళ్లిపోతున్నారు అని చెప్తుంది. దీంతో ఇవాళ మొత్తం అంజలి పక్కన అమర్‌ ఉండడా..? అని రణవీర్‌ అడగ్గానే.. పక్కనే ఏంటి..? అంజలి కిడ్నాప్‌ అయింది అని తెలుసుకోలేనంత దూరంలో  ఉంటాడు. ఒక్కసారి కాంపిటీషన్‌లోకి వెళితే ఫోన్‌ లో కూడా అవలేబుల్‌గా ఉండడు.. అమర్‌కు అంజలి కిడ్నీప్‌ అయిందని తెలిసే లోపు నువ్వు అంజలిని తీసుకుని కోల్‌కతా వెల్లిపోవచ్చు అని మనోహరి చెప్పగానే.. సరే మనోహరి.. అమర్‌ వెళ్లగానే నాకు కాల్ చేయ్‌ నేను నా మనుషులను తీసుకుని వస్తాను. అని చెప్పగానే.. మనోహరి సరే అంటూ కాల్‌ కట్‌ చేస్తుంది. అమర్‌ నువ్వు కాంపిటీషన్‌కు వెళ్లవోమోనని చాలా భయపడ్డాను. కానీ నువ్వు నేను కలవడానికి ఒక అవకాశం ఇస్తున్నావు అనుకుంటుంది మనోహరి.

తర్వాత కాంపిటీషన్‌కు వెళ్తున్న అమర్‌.. రాథోడ్‌ కోసం వెయిట్‌ చేస్తుంటాడు. రాథోడ్‌ మిలటరీ వాళ్లను తీసుకుని వస్తాడు. పిల్లలకు సెక్యూరిటీ అరెంజ్‌ చేస్తున్నాడా అని మనోహరి కంగారు పడుతుంది. ఏంటిదంతా అని అమర్‌ అడగ్గానే మీరు ఎలాగూ ఉండటం లేదు కదా అని నేనే తీసుకొచ్చాను సార్‌ అని రాథోడ్‌ చెప్పగానే ఏమీ వద్దని మిలటరీ వాళ్లను రిటర్న్‌ పంపిచేస్తాడు అమర్‌. మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది. అమర్‌, మిస్సమ్మ, వినోద్, చిత్ర కాంపిటీషన్‌కు వెళ్లిపోతారు. కాంపిటీషన్‌ దగ్గర మిస్సమ్మ బాధగా పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉంటారు వాళ్లను ఎవరు చూసుకుంటారు అని అడుగుతుంది. దీంతో అమర్‌ ఒంటరిగా ఎందుకు ఉంటారు భాగీ తోడుగా మనోహరి ఉంటుంది కదా.. అంటూ చెప్తాడు. మరోవైపు రణవీర్‌ తన మనుషులతో అమర్‌ ఇంటికి వచ్చి అంజును కిడ్నాప్‌ చేయబోతుంటే.. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

Dhee: ఫ్యామిలీలు చూస్తున్నారు? ఏంటా డ్యాన్సులు.. ఇద్దరు అమ్మాయిలు అలా?

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్.. నర్మద ప్లాన్ సక్సెస్.. చందును బురిడీ కొట్టించిన భాగ్యం..

Intinti Ramayanam Today Episode: పార్వతికి పల్లవి పై అనుమానం.. ప్రణతిని మోసం చేస్తున్న అక్షయ్.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి పై బాలుకు అనుమానం.. మీనాకు దారుణమైన అవమానం..

Brahmamudi Serial Today August 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రుద్రాణికి అప్పు వార్నింగ్‌ – ఇంట్లో వాళ్లకు షాక్‌ ఇచ్చిన ధాన్యలక్ష్మీ  

Nindu Noorella Saavasam Serial Today August 13th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రకు షాక్‌ ఇచ్చిన వాళ్ల నాన్న

Big Stories

×