OTT Movie : కుల వివక్ష ఇది సమాజంలో నిత్యం ఎదుర్కుంటున్న సమస్య. ఈ కంప్యూటర్ యుగంలో కూడా దీనినే పట్టుకుని వేలాడుతున్నారు. ఈ సమస్య తగ్గటానికి ఇంకా కొంచెం సమయం పట్టేటట్లే ఉంది. ఈలోగా జరగాల్సినవి జరిగిపోతూనే ఉన్నాయి. అయితే కుల వివక్ష జానర్ లో ఒక తమిళ సినిమా ఆలోచింపజేసేవిధంగా ఉంటోంది. ఒక గ్రామంలో కుల వివక్షతో అవమానాలు ఎదుర్కొన్న ఒక యువకుడు, తన కుటుంబ గౌరవాన్ని తిరిగి పొందేందుకు సిటీకి వెళ్లి ధనవంతుడవుతాడు. తిరిగి గ్రామానికి వచ్చిన అతను కుల వ్యవస్థను సవాలు చేసి, తన హక్కుల కోసం పోరాడుతాడు. ఈ జర్నీలో ఏం జరిగిందనేదే ఈ స్టోరీ. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది అనే వివరాల్లోకి వెళితే …
టెంట్‌కొట్టలో స్ట్రీమింగ్
ఈ తమిళ యాక్షన్ సినిమా పేరు ‘Seeran’. 2024లోవచ్చిన ఈ సినిమాకి దురై కె. మురుగన్ దర్శకత్వం వహించారు. ఇందులో జేమ్స్ కార్తీక్, ఇనియా, సోనియా అగర్వాల్, కృష కురుప్, ఆజీద్ ఖలీక్, ఆడుకలం నరేన్, అరుంధతి నాయర్, సెంద్రాయన్, పిచ్చైక్కరన్ మూర్తి ప్రధాన పాత్రల్లో నటించారు. నెట్కో స్టూడియోస్ నిర్మాణంలో దీనిని రూపొందించారు. ఈ సినిమా 2024 అక్టోబర్ 4న థియేటర్లలో రిలీజ్ అయింది, 130 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 5.0/10 రేటింగ్ ఉంది. టెంట్‌కొట్ట (Tentkotta) ఓటీటీలో 2025 మే 30 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also : 16 ఏళ్ల అమ్మాయితో 60 ఏళ్ల ముసలాడు… కుర్రాడి ఎంట్రీతో ఊహించని మలుపులు
కార్తి ఒక తమిళ గ్రామంలో తక్కువ కులానికి చెందిన కుటుంబం నుంచి వస్తాడు. గ్రామంలో కుల వివక్షతో, అతని కుటుంబం నిరంతరం అవమానాలు ఎదుర్కొంటుంది. కార్తి తల్లితో పాటు ఆమె చిన్ననాటి స్నేహితురాలు యాజ్ఞిని కూడా ఈ అన్యాయాన్ని భరిస్తుంటారు. ఈ అవమానాలతో విసిగిపోయిన కార్తి, తన కుటుంబ గౌరవాన్ని తిరిగి పొందేందుకు సిటీకి బయలుదేరతాడు. సిటీలో కష్టపడి పని చేసి, కార్తి ధనవంతుడవుతాడు. అతని జీవితం సక్సెస్‌ఫుల్‌గా మారుతుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ, కాన్ఫిడెన్స్‌తో బలమైన వ్యక్తిగా తిరిగి గ్రామానికి వస్తాడు. అక్కడ అతను గ్రామంలోని కుల వ్యవస్థ, దాన్ని నడిపించే పెద్దమనుషులను సవాలు చేస్తాడు.
ఈ క్రమంలో పూంగోతై అనే ఒక స్త్రీ, అతని పోరాటంలో సపోర్ట్ చేస్తుంది. అలాగే చర్చ్ సిస్టర్ (సోనియా అగర్వాల్) కూడా అతనికి మద్దతు ఇస్తుంది. కార్తి గతంలో తనని అవమానించిన వాళ్లతో పేచీ పెట్టుకుంటాడు. ఇక పూంగోతై, చర్చ్ సిస్టర్ సపోర్ట్‌తో అతను గ్రామంలో సంస్కరణలు తీసుకొస్తాడు. అయితే ఆ గ్రామంలో జరిగే ఒక జాతరలో గొడవ తీవ్రంగా జరుగుతుంది. దేవుడి వేషం వేసుకునే క్రమంలో ఇది తారాస్థాయికి చేరుకుంటుంది. ఇక స్టోరీ కూడా ఒక ట్రాజిడీతో ఎండ్ అవుతుంది. ఈ జాతర ఏమిటి ? దేవుడి వేషం ట్విస్ట్ ఎలా వస్తుంది ? కార్తి తెచ్చే మార్పు ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.