Nindu Noorella Saavasam Serial Today Episode: గుప్త, ఆరును తీసుకుని యమలోకం బయలుదేరుతారు. ఆకాశంలో వెళ్తుంటే.. ఆరు అందరినీ గుర్తు చేసుకుని బాధపడుతుంది. దీంతో తీరిపోయిన రుణబంధాల గుర్తుకు తెచ్చుకుని బాధపడొద్దని ఓదారుస్తాడు. మరోవైపు మనోహరి రణవీర్‌కు కాల్ చేస్తుంది. అమర్ ఆ ఇంటి చుట్టు అంజు చుట్టూ పెద్ద కొట కడుతున్నాడు దాన్ని దాటుకుని నేను లోపలికి రాలేను అందుకే నేను ఆ ఇంట్లోకి రాలేను. నువ్వు ఎలాగూ ఆ ఇంట్లోనే ఉంటావు కదా ఏ చిన్న అనుమానం వచ్చినా నాకు ఫోన్ చేసి చెప్పు అంటాడు రణవీర్. సరే కానీ ఇదంతా ఎందుకు అంజలియే దుర్గ అని తెలిస్తే అంజలిని వదిలేస్తావా..? అని అడుగుతుంది మనోహరి. నాకు ఆస్థి కన్న ఏది ఎక్కువ కాదని నీకు తెలుసు కదా మనోహరి. నా సమాధానం ఏంటో నీకు తెలుసు. నాకు నిజం కావాలి అంటాడు రణవీర్.
దీంతో మనోహరి సరే ఏదైనా నాకు తెలిస్తే నీకు ఫోన్ చేస్తాను అంటూ కాల్ కట్ చేస్తుంది. ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతూ.. డీఎన్‌ఏ రిపోర్ట్ ఫెయిల్ అయితే అంజలి మా కూతురు కాదా..? మరి అమర్ ఎందుకు అబద్దం చెప్తున్నాడు అని ఆలోచిస్తుంది. ఇంతలో అంజు పరుగెడుతూ వెళ్తుంటే..? మనోహరి అంజును ఆపి తదేకంగా చూస్తుంది. దీంతో అంజు హలో ఆంటీ ఎందుకు ఆపారో చెప్పకుండా అలా చూస్తున్నారేంటి..? అని అడుగుతుంది. దీంతో మనోహరి క్లారిటీ కోసం అని చెప్తుంది. దేని గురించి అని అంజు అడగ్గానే ఆ ఆరు నిన్న ఎలా చూసుకునేది.. అందరితో సమానంగా చూసుకునేదా..? అని అడుగుతుంది.
దీంతో అంజు రణవీర్ అంకుల్‌కు మీకు ఏమైంది ఆంటీ ఎందుకు అలా అడుగుతున్నారు. మొన్న కూడా అంకుల్ అంతే అమ్మ ఎలా చూసుకునేది అని అడిగారు అని అంజు చెప్పగానే.. ఓ అది రణవీర్ ముందే అడిగారా..? అని మనసులో అనుకుంటుంటే అంజు హలో ఆంటీ ఎందుకు అని అడుగుతున్నాను అంటుంది. దీంతో మనోహరి ఎందుకంటే మా ఇద్దరికీ నువ్వంటే బాగా ఇష్టం అని అడిగాను అంటుంది. దీంతో అంజు మా అమ్మకు డాడీకి నేనంటే చాలా ఇష్టం.. అమ్ము, అన్నయ్యల కంటే నన్నే బాగా చూసుకునేవారు అని చెప్తుంది. ఇంతలో మనోహరి ఒక్కసారి నువ్వు నన్ను అమ్మ అని పిలుస్తావా..? అని అడుగుతుంది. ఇంతలో అమ్మువాళ్లు వచ్చి అంజును ఆడుకుందాం పద అని తీసుకెళ్తుంటే అంజు అక్కడే ఆగిపోయి అమ్మా అని పిలుస్తుంది. ఆ పిలుపునుక మనోహరి షాక్ అవుతుంది. వెంటనే తిరిగి చూస్తుంది. అంజు మీరు అన్నట్టే పిలిచాను కదా మళ్లీ మళ్లీ అడగకండి నాకు మా అమ్మను తప్పా ఇంకెవరినీ అమ్మా అని పిలవడం కుదరదు అంటూ అంజు వెళ్లిపోతుంది.
మరోవైపు యమలోకం వెళ్లిపోతున్న ఆరు అనుమానంగా గుప్త గారు నేను కచ్చితంగా పైకి రావాల్సిందేనా..? నాకు సాయం చేసే దేవుళ్లు ఎవ్వరూ లేరా..? నేను యూస్ చేసుకునే లైఫ్‌లైన్ లేదా..? అని అడుగుతుంది. దీంతో గుప్త కోపంగా ఏమిటీ నువ్వు మాట్లాడుతున్నది. ఇన్ని రోజులు భూమ్మీద ఉన్న ఆశ తీరలేదా..? అయినా నీకు సాయం చేయడం తప్పా ఆ జగన్నాథుడికి వేరే పని లేదనుకుంటివా..? నీకిచ్చిన సమయం పూర్తి అయింది. అయినా నువ్వు భూలోకం తిరిగి వెళ్లి ఏమి చేయుదువు అంటూ ప్రశ్నిస్తాడు. దీంతో ఆరు ఏమో గుప్తు గారు ఏదైనా అద్బుతం జరగవచ్చు.. మీరే దగ్గరుండి నన్ను భూలోకం తీసుకెళ్లవచ్చు అని చెప్తుండగానే.. చిత్రగుప్తుడు కంగారుగా వస్తాడు. గుప్తను పక్కకు తీసుకెళ్లి త్రిమూర్తులు యమపురికి వచ్చి తనిఖీలు చేస్తున్నారు.
ఈ సమయంలో ఈ బాలిక అక్కడికి వచ్చిన ఎడల మన ఇరువురము ప్రభువుల వారితో కలిసి ఈ బాలిక లెక్కల విషయంలో మనము చేసిన తప్పులు తెలిసిపోవును అందుకే వారు వెళ్లు వరకు ఈ బాలికను తీసుకుని భూలోకమునకు వెళ్లుము అని చెప్తాడు. దీంతో ఇంత కష్టపడి ఈ బాలికను ఇక్కడిదాకా తీసుకువచ్చింది మరలా భూలోకం తీసుకువెళ్లుటకా..? ఆ పని నేను చేయలేను. వారు యమపురిని వదిలి వెళ్లు వరకు ఇచ్చటనే ఈ బాలికను మేఘములలో తిప్పెదను అంటాడు గుప్త. అయితే నారదముని చూస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకో అంటాడు. దీంతో మీరు కూడా నాతో భూలోకం వస్తే నేను సమ్మతించెదను అంటాడు గుప్త. దీంతో చిత్ర గుప్తుడు సరే అంటాడు. ముగ్గురు కలిసి మళ్లీ భూలోకం తిరుగుతారు.
మరోవైపు రణవీర్‌కు తమ ఇంట్లో జరుగుతున్న విషయాలు చెప్తున్న ఫోన్ నెంబర్ ట్రేస్ చేయడానికి అమర్ టీంతో రెడీగా ఉంటాడు. అప్పుడే రణవీర్‌తో మాట్లాడటానికి ఫోన్ ఆన్ చేస్తుంది మనోహరి. ఫోన్ అన్ అయిందని అమర్ టెక్నికల్ టీం చెప్తుంది. పది సెకండ్లలో ఆ ఫోన్ ఎక్కడ ఉందో చెప్తామంటారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?