Ranya Rao: అక్రమ సంపాదన, అక్రమ రవాణా కేసులో పట్టుబడిన ప్రముఖ హీరోయిన్ రన్యా రావు (Ranya Rao) కి ఇప్పుడు ఈడీ అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. ముఖ్యంగా ఈ కేసులో రన్యా రావు కి చెందిన రూ. 34.12 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అటాచ్ చేసింది. ముఖ్యంగా బెంగళూరు విక్టోరియా లే అవుట్ లోని ఇల్లు, ఆర్కావతి లే అవుట్ లో స్థలం, తుమకూరులో పారిశ్రామిక స్థలం, ఆనేకల్ తాలూకాలోని వ్యవసాయ భూమిని అటాచ్ చేసామని ఈడీ అధికారులు శుక్రవారం మీడియాతో ప్రకటించారు. ఇకపోతే దుబాయ్ నుంచి ఈమె రూ.12.56 కోట్ల విలువైన బంగారాన్ని తీసుకొస్తూ.. ఈ ఏడాది మార్చి 3వ తేదీన కెంపెగౌడ ఎయిర్పోర్టులో పట్టుబడిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ కేసులో రాజు, రన్యారావ్, సాహిల్ జైన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ముగ్గురు కూడా పరప్పన అగ్రహారం జైలులో ఉన్నారు. ఇక ప్రస్తుతం ఈడీ అధికారులు ఈమెకు షాక్ ఇవ్వడంతో మరి దీని నుంచి ఎలా తేరుకుంటుందో చూడాలి.
రన్యా రావ్ ప్రారంభ జీవితం..
రన్యా రావ్ ప్రారంభ జీవిత విషయానికి వస్తే.. కర్ణాటక రాష్ట్రంలోని చిక్మంగళూరు జిల్లాకు చెందినది. బెంగళూరులో పాఠశాల విద్య ను పూర్తి చేసిన ఈమె.. యుక్త వయసుకు వచ్చాక నటన పైన ఆసక్తి పెంచుకుందట. అలా చదివే సమయంలోనే మోడల్ గా కెరియర్ ఆరంభించింది. ఇక ఆ తర్వాత నటన రంగంలోకి తొలి అడుగులు వేసి అక్కడ సక్సెస్ అయ్యింది రన్యా రావు.
రన్యా రావ్ సినిమా జీవితం..
2014 ఏప్రిల్ లో ప్రముఖ నటుడు, దర్శకుడు సుదీప్ (Sudeep ) దర్శకత్వంలో వచ్చిన కన్నడ చిత్రం ‘మాణిక్య’ తో వెండితెరపై అడుగులు వేసింది. ఇందులో మానస అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఈమె నటనకు విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు కూడా వెలువడ్డాయి. ఇక 2015 జూన్ లో ఈమె మొదటి తమిళ చిత్రం ‘వాఘా’ లో విక్రం ప్రభు సరసన నటించింది. 2017లో విడుదలైన పటాకి అనే హాస్య చిత్రంలో గణేష్ హీరో గా ప్రధాన పాత్ర పోషించగా.. ఇందులో పోలీసు అధికారి ప్రేమికురాలు జర్నలిస్టు సంగీతగా కూడా నటించింది. తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇకపోతే చేసింది మూడు సినిమాలే అయినా ఆ మూడు సినిమాల ద్వారా భారీ పాపులారిటీ అందుకుంది. కానీ ఇప్పుడు అక్రమ రవాణా కేసులో అడ్డంగా బుక్ అవడం గమనార్హం. ఇప్పటికే దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా భారీగా ఈమె నుండి అక్రమ బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరి ఇప్పుడు ఈడి అధికారులు ఆస్తులు అటాచ్మెంట్ కూడా చేసిన నేపథ్యంలో దీనిపై రన్యారావ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.