Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరు నగలు చిత్రకు ఇచ్చిన మిస్సమ్మను కిచెన్‌లోకి వెళ్లి ఓదారుస్తుంటాడు అమర్. ఇంతలో బయటి నుంచి రాథోడ్ కంగారుగా పరుగెత్తుకుంటూ వచ్చి సార్ అంటూ పిలుస్తాడు. అమర్ బయటకు హాల్లోకి వచ్చి ఏమైంది రాథోడ్ అని అడుగుతాడు. దీంతో రాథోడ్ సార్ ఆ ఫోన్ ఆన్ అయిందట సార్ రాము లోకేషన్ ట్రేస్ చేశాడు అని చెప్తాడు. దీంతో లొకేషన్ ఎక్కడ చూపిస్తుంది రాథోడ్ అని అమర్ కోపంగా అడగుతాడు. ప్రస్తుతానికి ఆవిడ ఎక్కడికో వెళ్తున్నారు సార్. లొకేషన్ రోడ్ నెంబర్ సిక్స్ లో చూపిస్తుంది అని చెప్తాడు. అవునా వెంటనే రామ్‌ను లోకేషన్ మనకు షేర్ చేయమని చెప్పు.. నువ్వు కారు తీయ్ అని చెప్తాడు. రాథోడ్ ఒకే సార్ అంటూ వెళ్లిపోతాడు. ఏమైందండి ఎవరిని వెతుకుతున్నారు అని మిస్సమ్మ అడుగుతుంది.
రణవీర్ వైఫ్‌ను భాగీ అని చెప్తాడు అమర్. ఆవిడ ఎవరో తెలిసిందా అని అడుగుతుంది మిస్సమ్మ. రణవీర్ కాల్ రికార్డ్ తెప్పించమని చెప్పాను కదా అని అమర్ చెప్తే అవునండి చెప్పారు అంటుంది మిస్సమ్మ. అందులో ఒక నెంబర్‌తో రణవీర్ రోజూ మాట్లాడుతున్నాడు. డీటెయిల్స్ కనుక్కుంటే తెలిసింది ఫేక్ ఐడీతో ఆ సిమ్ తీసుకున్నారు అని సో అదే నెంబర్‌ను ట్రేస్ చేస్తున్నాం. సరే భాగీ నేను వెళ్లాలి ఏమైనా తెలిస్తే నీకు కాల్ చేస్తాను అని అమర్ చెప్పగానే.. సరే అండి మీరు జాగ్రత్త అని చెప్తుంది మిస్సమ్మ. అమర్ వెళ్లిపోతాడు. రామ్ తో కాల్‌లో టచ్‌లో ఉంటూ కారులో వెళ్తుంటాడు అమర్, రామ్ ఆవిడ ఎక్కడ వెళ్తున్నారు అని అడుగుతాడు. దీంతో సార్ మీకు ఆవిడ కరెక్టుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నారు అని చెప్తాడు. ఆ లోకేషన్ రాథోడ్‌కు పంపించు అని చెప్తాడు అమర్. సరే అంటూ లోకేషన్ రాథోడ్‌కు పంపిస్తాడు రామ్.
మరోవైపు ఆలోచిస్తున్న మిస్సమ్మ నా గెస్ కరెక్టు అయితే రణవీర్ వైఫ్ మనోహరి అంటే మనోహరి, రణవీర్‌తో వేరే ఫోన్‌లో టచ్‌లో ఉందన్నమాట. ఆయన రణవీర్ వైఫ్‌ను ఫాలో అవుతున్నారు అనుకుంటే.. ఇంట్లో మను ఉండకూడదు.. మను రణవీర్ వైఫో కాదో ఇప్పుడే తెలిసిపోతుంది. అని కిందకు వెళ్లి మనోహరి రూంలో చూస్తుంది. అక్కడ మనోహరి కనిపించదు. ఇళ్లంతా వెతుకుతుంది. ఎక్కడా మనోహరి కనిపించదు. దీంతో మను ఇంట్లో ఎక్కడా లేదు అంటే నా అనుమానమే నిజమా..? అనుకుంటూ చిత్ర రూంలోకి వెళ్తుంది మిస్సమ్మ. మిస్సమ్మను చూసిన చిత్ర చెప్పు భాగీ ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతుంది. మను ఎక్కడ అని అడుగుతుంది. తన రూంలో ఉంటుంది. లేదా బాల్కనీలో ఉంటుంది అని చిత్ర చెప్తుంది. ఇంట్లో ఎక్కడా లేదు.. బయటకు ఏమైనా వెళ్లిందా.?ఎక్కడికి వెల్లిందో నీకేమైనా చెప్పిందా అని అడుగుతుంది. నాకేం చెప్పలేదు అంటుంది చిత్ర.
మిస్సమ్మ అక్కడి నుంచి బయటకు వెళ్తుంది. కన్ఫామ్ ఆయన ఫాలో అవుతుంది మనోహరినే ఆయనకు ఫోన్ చేసి చెబుదాం అనుకుని ఫోన్ చేయబోయి ఆగిపోతుంది. మరోవైపు మనోహరి నేరుగా రణవీర్ ఇంటికి వెళ్తుంది. వెనకే అమర్, రాథోడ్ ఇద్దరూ లోకేషన్ ట్రేస్ చేస్తూ రణవీర్ ఇంటికి వస్తారు. వాళ్లు రావడం చూసిన రణవీర్, మనోహరి షాక్ అవుతారు. వెంటనే మనోహరి లోపలికి వెళ్తుంది. ఇంతలో ఇంట్లోకి వచ్చిన అమర్ అనుమానంగా మాట్లాడుతూ ఇంట్లో అటూ ఇటూ తిరుగుతుంటాడు. మనోహరి ఉన్న దగ్గరకు వెళ్లబోతుంటే రణవీర్ పిలిచి కాఫీ టీ ఏమైనా తాగుతారా..? అని అడుగుతాడు. దీంతో అమర్ తిరిగి వెనక్కి వెళ్లి కాఫీ టీ ఏమీ వద్దు రణవీర్ అంటాడు. ఇవాళ నైట్ మా వినోద్ , చిత్రల రిసెప్షన్ ఉంది నిన్ను పిలుద్దామని వచ్చాను అంజు నిన్ను మరీ మరీ పిలవమని చెప్పింది అంటూ వెళ్లిపోతాడు అమర్. అమర్ వెళ్లగానే.. మనోహరి ఊపిరి పీల్చుకుంటుంది.
తర్వాత రిసెప్షన్‌కు ఇంట్లో అంతా ఏర్పాట్లు జరుగుతుంటాయి. అందరూ హడావిడిగా ఉంటారు. పిల్లలు రూంలో రెడీ అవుతుంటారు. ఇంతలో అమ్ము ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావని అంజు అడిగితే అమ్మ గుర్తుకు వచ్చిందని చెప్తుంది. దీంతో అంజు మన అమ్మ ఇక్కడే ఉందేమో నువ్వెందుకు ఏడుస్తావు అంటూ ఓదారుస్తుంది. వాళ్లను గమనిస్తున్న ఆరు కూడా ఎమోషనల్ అవుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?