Nindu Noorella Saavasam Serial Today Episode: చిత్ర ఇంట్లో వాళ్లను పిలిచి నగల గురించి అడుగుతుంది. దీంతో మిస్సమ్మ, నిర్మల, శివరాం, పిల్లలు షాక్ అవుతారు. చిన్న కొడలికి అంటూ ఏదో ఒకటి దాచి ఉంటారు కదా మీ నగలు, ఆరు నగలు అన్ని తీసుకొస్తే క్లియర్ చేసుకుందాం అని చెప్తుంది. దీంతో మిస్సమ్మ ఆరు అక్క నగలు ముట్టుకోవడానికి ఎవ్వరికీ వీలు లేదు. అది ఆయన మాట అని చెప్తుంది. మాటే కదా భాగీ మారిస్తే సరిపోతుంది. ఆరు నా ఫ్రెండ్ పైగా నాకు తోడి కోడలు కూడా తన నగలను నేనెందుకు ముట్టుకోకూడదు. నేను ఆ నగలను చూడాలి అని అడుగుతుంది. దీంతో నిర్మల ఆ నగలు ఇప్పుడు భాగీవి అమ్మా నీకు నా నగలు చిన్న కోడలు కోసం కొన్న నగలు ఉన్నాయి చూపిస్తాను రా అని చెప్తుంది.
దీంతో చిత్ర ఒక్క నిమిషం ఆంటీ అదేంటి ఆంటీ వినోద్ అందరం కలిసే ఉందాం అంటున్నారు మరి మీరేంటి అప్పుడే భాగాలు పెట్టేస్తున్నారు. బంగారం ఒక్కటేనా..? ఆస్థులు కూడా భాగాలు పంచేశారా..? అంటే క్లారిటీ ఉంటే మేము ఎక్కడ ఉండాలో డిసైడ్ అవుదామని చిత్ర చెప్పగానే.. మిస్సమ్మ కోపంగా చిత్ర నువ్వు ఇంటికి వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు. అప్పుడే ఆస్థుల గురించి భాగాల గురించి మాట్లాడుతున్నావా..? ఒకటి బాగా గుర్తు పెట్టుకో ఆ అన్నదమ్ములు ఎప్పటికీ కలిసే ఉంటారు. ఉండాలి కూడా అర్తం చేసుకుని పద్దతి మార్చుకో ప్లీజ్ చిత్ర అంటుంది.
దీంతో చిత్ర నేనేదో వినోద్‌తో వేరు కాపురం పెడుతున్నట్టు నువ్వు అలా మాట్లాడుతున్నవేంటి భాగీ నేను మీ అందరితో కలిసే ఉండాలనుకుంటున్నాను. నాకు కూడా కుటుంబం కావాలి. కానీ ఇలా భాగాలు పెట్టే ప్రేమ నాకు అసలు వద్దు అంటుంది. దీంతో నిర్మల అమ్మా చిత్ర ఎవ్వరూ భాగాలు పెట్టలేదు అమ్మా ఆరు నగలు ఎవ్వరూ ముట్టుకోరు అదే చెప్తున్నాను అంటుంది. దీంతో చిత్ర మీరు భలే గమ్మతుగా మాట్లాడుతున్నారు ఆంటీ ఆరు నగలు భాగీవి అంటున్నారు. వాటిని ఎవ్వరూ ముట్టుకోకూడదు అంటున్నారు. మళ్లీ అందరం కలిసే ఉండాలంటున్నారు బాగుంది ఆంటీ మీ పద్దతి చాలా బాగుంది అంటుంది. కిటికీలోంచి అంతా గమనిస్తున్న ఆరు భాదపడుతుంది. ఏంటి గుప్త గారు అసలు భాగీ అత్తయ్యా దానికి అంత సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం ఏంటి..? నాలుగు తగిలించి లోపలికి పోవాలని చెప్పక అంటూ కోప్పడుతుంది. ఓర్పుతో, ప్రేమతో ఆ బాలిక మనసు మార్చాలని చూస్తున్నారు అని గుప్త చెప్తాడు.
దీంతో ఆరు కోపంగా ఒళ్తంతా పొగరున్న దానితో ఏంటండి ఓర్పు.. నాకే కనక చాన్స్ ఉంటేనా… దాన్ని నాలుగు తగిలించే దాన్ని అంటుంది. చిత్ర చెప్పండి ఆంటీ మీరు చెప్పే దాంట్లో న్యాయం ఉందా..? అని అడుగుతుంది. దీంతో అంజు చిత్ర పిన్ని అసలేమైంది మీకు నిన్నేమో కలశం చెంబు మిస్సమ్మకు తగిలేలా చేశారు. ఇప్పుడు నాన్నమ్మతో గొడవ పడుతున్నారు అసలేంటి మీరు అంటుంది. దీంతో చిత్ర ఓహో అయితే నేను వచ్చిన తర్వాత ఇంట్లో మనఃశాంతి లేదు అంటున్నావా..? అంజు అంటుంది చిత్ర. దీంతో మిస్సమ్మ కోపంగా చిత్ర పిల్లల జోలికి రావొద్దు చెప్తున్నా..? అంటుంది. ఓహో నేను కొత్తగా వచ్చాను ఎక్కడ అందరూ నన్ను మెచ్చుకుని నన్ను మంచి అంటారని భయపడి పిల్లకు ట్రైనింగ్ ఇచ్చి నా మీదకు ఉసిగొల్పుతున్నావా..? భాగీ అంటుంది.
దీంతో అమ్ము.. చిత్ర పిన్ని ఊరికే నోరు పారేసుకోకండి మిస్సమ్మ మాకేం నేర్పలేదు అంటుంది. దీంతో చిత్ర అయితే వేలడంత లేరు మీరు నాకు చెప్తున్నారా..? నన్ను ఇన్ని మాటలు అంటారా.? అంటూ తిడుతుంది. దీంతో ఆనంద్ ఇప్పుడు మేము మిమ్మల్ని ఏమన్నామని అలా మాట్లాడతున్నారు అంటాడు. అయినా పెళ్లికి ముందు వరకు మాతో బాగానే ఉన్నారు కదా ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటూ ఆకాష్ అనగానే.. అందరూ కలిసి నన్ను టార్గెట్ చేసి నన్ను ఇన్నిని మాటలు అంటున్నారు కదూ ఇప్పుడే వెళ్లి వినోద్‌ను తీసుకొస్తాను. వినోద్ వచ్చి మీ అందరికీ ఈ ఇంట్లో నా స్థానం గురించి చెప్తాడు. అంటూ లోపలకి వెళ్తుంది.
కిటికీలోంచి చూస్తున్న ఆరు గుప్త గారు నా కుటుంబాన్ని ఇంత బాధ పెడుతున్న దాన్ని ఏమీ చేయలేకపోతున్నాను. ఫ్లీజ్ చిత్రకు బుద్ది చెప్పాలి ఎలా అని అడుగుతుంది. దీంతో గుప్త నవ్వుతూ బాలిక నీకున్న శక్తులు అన్ని ఉపయోగించి ఎవ్వరికీ ఎలాంటి హానీ చేయకూడదు అని చెప్పగానే.. ఆరు అవును కదా నాకు శక్తులు ఉన్నాయి కదా అంటూ గార్డెన్ లోకి వెళ్తుంది. అప్పుడే పైన మెట్ల దగ్గరకు వినోద్ అంటూ వచ్చిన చిత్ర కనిపిస్తుంది. ఆ మెట్ల మీద నుంచి కిందపడిపో అని ఆరు అనగానే.. చిత్ర కింద పడిపోతుంది. ఆరు నవ్వుతూ వెల్లిపోతుంది.
వెనకే వెళ్లిన గుప్త ఆరుకు షాకింగ్ న్యూస్ చెప్తాడు. ఈ ఇంట్లో పెద్ద ప్రమాదం జరగబోతుంది. ఏదో ప్రళయం ముంచుకొస్తుంది. కానీ ఎవరికీ ఏమి జరగుతుదో తెలియడం లేదు. ఆ ప్రమాదం నీకు జరుగుతుందా..? లేక నీ పిల్ల పిచ్చులకు జరుగుతుందా..? అనేది తెలియడం లేదు. ఒక వేశ నీ పతిదేవునకు జరుగునా అన్నది కానీ నీ సహోదరికి జరుగునా తెలియడం లేదు. కానీ ఏదో కీడు జరగబోతుంది అని తెలుస్తున్నది. అని గుప్త చెప్తుండగానే రణవీర్ కొంత మంది రౌడీలను తీసుకుని అమర్ ఇంటి ముందు లారీతో వచ్చి ఆగుతాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?