E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode June 25th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి షాక్ ఇచ్చిన చంభా  

Nindu Noorella Saavasam Serial Today Episode June 25th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి షాక్ ఇచ్చిన చంభా  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: తనను కాపాడిన గుప్తకు బుజ్జమ్మ థాంక్స్‌ చెప్తుంది. బుజ్జమ్మను ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండమని గుప్తు చెప్తాడు. గుప్త తనకు ఇచ్చిన ఉంగరం తీసి ఇస్తుంది. గుప్త ఆ ఉంగరం తీసుకుని వెళ్లిపోతుంటే అప్పుడే అమర్‌ వాళ్లు బుజ్జమ్మను వెతుక్కుంటూ దగ్గరకు వస్తారు. అమర్‌ నీకేం కాలేదు కదా బుజ్జమ్మ అని అడగ్గానే.. తనకేం కాలేదని బుజ్జమ్మ చెప్తుంది. రాథోడ్‌ సంతోషంగా నీకేం కాదని నాకు ముందే తెలుసు బుజ్జమ్మ అంటాడు. అమర్‌ అనుమానంగా ముందే తెలుసంటే ఎలా రాథోడ్‌ అని అడగ్గానే.. రాథోడ్‌ అంతకుముందు బుజ్జమ్మ మీద గద్ద అటాక్ చేసిన విషయం చెప్తాడు. తర్వాత అమర్‌ ఇంటికి వెళ్దాం పదండి అనగానే.. బుజ్జమ్మ గుడికి వెళ్దామని తాను ఏదో మొక్కుకున్నానని ఆ మొక్కు తీర్చాలని చెప్తుంది. అయితే గుడికే వెళ్దాం పదండి అంటూ అందరూ గుడికి వెళ్లిపోతారు.

గుడిలోకి వెళ్లాక పిల్లలు తమ మొక్కులు తీర్చుని వస్తామని అమర్‌కు చెప్తారు. అమర్‌ సరే అనగానే.. పిల్లలకు తోడుగా రాథోడ్‌ వెళ్తుంటాడు. మిస్సమ్మ కూడా వెళ్తుంది. వాళ్లందరూ వెళ్లిపోయాక.. మనోహరి, చంభా మాత్రం అక్కడే నిలబడి చూస్తుంటారు. అమర్‌ అనుమానంగా మనోహరిని తన కోసం ఏం మొక్కు మొక్కుకోలేదా..? అని అడుగుతాడు.. దీంతో మనోహరి తాను ఎప్పుడో మొక్కుకున్నానని.. మొక్కు కూడా తీర్చేశానని చెప్తుంది. ఏం మొక్కుకున్నావని ఎప్పుడు మొక్కుకున్నావని.. ఎప్పుడు మొక్కు తీర్చేశావని అమర్‌ అడిగితే.. యాక్సిడెంట్‌ అయిన మరుసటి రోజే మొక్కుకున్నానని.. అమర్‌ హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అయినప్పుడే మొక్కు తీర్చుకున్నానని చెప్తుంది.

Advertisement

అప్పుడే అక్కడకు వచ్చిన పంతులు నీ మొక్కు ఈ గుడిలోనే తీర్చావా అమ్మ అని అడుగుతాడు. మనోహరి అవునని చెప్తుంది. పంతులు మాత్రం అనుమానంగా నిన్ను ఎప్పుడూ ఈ గుడిలో చూడలేదు అంటాడు. మీరు ఆరోజు సెలవులో ఉన్నారేమో పంతులుగారు అంటూ మనోహరి చెబితే.. పంతులు తనకు సెలవులు ఏమీ లేవని పైగా తాను ఫ్యామిలీతో ఉండేది కూడా ఇక్కడేనని ట్వంటీఫోర్‌ బై సెవెన్‌ నేను ఇక్కడే ఉంటానని పంతులు చెప్పగానే.. మీకు అనుమానంగా ఉంటే సీసీటీవీ ఫుటేజ్‌ చెక్‌ చేసుకోమని మనోహరి చెప్తుంది. దీంతో పంతులు ముక్కంటి సన్నిధిలో సీసీటీవీ చూడటం దేనికి అయినా దేవుడి గుడిలో తప్పు చేస్తే ఆ పాపం ఊరికే పోదని హెచ్చరించి వెళ్లిపోతాడు పంతులు. మనోహరి మాత్రం ఆ పంతులు మర్చిపోయినట్టు ఉన్నాడు ఆయన మాటలు పట్టించుకోవద్దని అమర్‌కు చెప్తుంది.

మరోవైపు పిల్లులు మొక్కులు తీర్చుకుంటుంటే.. మిస్సమ్మ కూడా తన మొక్కు తీర్చుకుంటానని రాథోడ్‌కు చెబితే రాథోడ్‌ ఆశ్చర్యంగా నువ్వేం మొక్కు మొక్కుకున్నావని అడుగుతాడు. గుడి మెట్లు శుభ్రం చేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి.. తలపై నిప్పుల బోణం ఎత్తుకుని మోకాళ్ల మీద మెట్లు ఎక్కి అమ్మవారికి నిప్పుల బోణం సమర్పిస్తానని మొక్కుకున్నాను రాథోడ్‌ అని చెప్పగానే.. రాథోడ్‌ ఆశ్చర్యంగా ఏంటి మిస్సమ్మ అంత కష్టమైన మొక్కా అనగానే.. మనం ఎంత కష్టపడితే దేవుడు మనకు అంత ఇస్తాడు అంటూ తాను మొక్కు తీర్చుకోవడానికి వెళ్తుంది మిస్సమ్మ.

Advertisement

మరోవైపు చంభా, మనోహరి దగ్గరకు వెళ్లి అక్కడ పిల్లలు మొక్కులు చెల్లిస్తున్నారు. భాగీ కూడా పెద్ద ఎత్తున ఏదో మొక్కు చెల్లిస్తుంది అని చెప్పగానే.. మనోహరి కోపంగా దాని పిచ్చి కాకపోతే  ఈ ప్రపంచంలో అదొక్కటే భార్య అయినట్టు ఓవర్‌ చేస్తుంది. ఈ పూజల వల్ల దేవుడు వరం ఇస్తాడా..? అమర్‌కు గతం గుర్తుకు వస్తుందా..? అనగానే.. చంభా ఏమో అదే జరగొచ్చు.. అయినా భర్త పిల్లల గురించ నీకేం తెలుసులే అని మనసులో అనుకుంటూ నువ్వు కూడా ఏదో ఒక మొక్కు చెల్లించుకున్నట్టు నటించు నువ్వే చేసినా వాళ్లకంటే గొప్పగా ఉండాలి. అప్పుడే నువ్వు సార్‌ దృష్టిలో పడతావు అంటూ చెప్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?

శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బోలే.. దెబ్బకు రియాక్షన్?

Nirupam Paritala : మంచుకొండల్లో డాక్టర్ బాబు… ఏమున్నాడ్రా బాబు..

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Big Stories

Advertisement
×