Intinti Ramayanam Today Episode March 18th: నిన్నటి ఎపిసోడ్ లో.. పెళ్లి జరుగుతుండగా ప్రణతి లెటర్ రాసిపెట్టి వెళ్లడం తో పెళ్లి ఆగిపోతుంది. దానికి ఇంట్లో అందరు ప్రణతి ఎక్కడికి వెళ్ళిపోయిందని టెన్షన్ పడుతుంటారు. శ్రీకర్ కమల్ మాత్రం ప్రణతిని వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. ప్రణతి కనిపించలేదు. పల్లవి ఇదే అదును చూసుకొని అవని పై నిందలు వస్తుంది. ఇదంతా చేసింది అవనినే అంటూ దారుణంగా అవమానిస్తుంది.. ఎందుకు అక్క ఇలా చేయవల్లే ప్రణతి ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఎక్కడికి పంపించావో చెప్పు నీ వల్లే పరువు పోయింది.. నువ్వు కాకపోతే ఇంకెవరు ప్రణతిని బయటకు పంపిస్తారు మొన్న ఏం చేసినందుకు వచ్చి ఇది చేశా వు మళ్ళీ పెళ్లి ఆపేసి మావయ్య గారికి పెళ్లి పరువునే తీసేసావ్ అనేసి అంటుంది. శ్రీయ, పార్వతి కూడా దారుణంగా మాట్లాడటంతో అవని ఏం మాట్లాడుతున్నావ్ అని అడుగుతుంది. అటు అక్షయ్ మాత్రం అందరిని దారుణంగా తిడతాడు. ఇంట్లోని వాళ్లంతా ప్రణతి కోసం టెన్షన్ పడుతారు. అవనితో పాటు ప్రణతి అక్కడకు వస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రణతిని చూసి అందరూ సంతోషపడతారు. కానీ ఒక్కసారిగా తన మెడలో పూల దండను చూసి షాక్ అవుతారు. అంతేకాదు ప్రణతితో పాటు భరత్ కూడా రావడంతో అందరు షాక్ అవుతారు. పార్వతి ఏవండీ ఒకసారి చూడండి అని అంటుంది. పనీపాట లేదా ఈ పోరంబోకుని నువ్వు పెళ్లి చేసుకున్నావా అని ప్రణతిని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు.. అవని నేను చెప్పేది ఒకసారి వినండి ఈ పెళ్లి ఎందుకు జరిగిందో ఒకసారి వింటే మీకే తెలుస్తుంది అని అనగానే కానీ ఎవరు వినరు అక్షయతో సహా అందరూ అవనీని అరుస్తారు. కానీ ప్రణతిని పార్వతి దారుణంగా కొడుతుంది.. అక్షయ్ నువ్వు ఎలాంటి దానివో అందరూ చెబుతున్న కూడా నేను నమ్మలేదు నీ గురించి నాకు తెలుసు అని అనుకున్నాను నీ మీద నాకు అలాంటి నమ్మకం ఉంది అని అనుకున్నాను. సీత రాముడి మధ్య నమ్మకం ఉంది కాబట్టే వాళ్ళు దాంపత్యం ఇలా సాగింది అన్నావు కానీ మీ వల్ల నా కుటుంబం ఎన్నో అవమానం ఎదుర్కొంది అలాంటిది నిన్ను ఎలా క్షమిస్తానని అనుకున్నావ్ నా కళ్ళ ముందు ఉంటే నేను రాక్షసుల్లాగా మారిపోతానని అక్షయ్ అంటాడు.
ఒక్కసారి నేను చెప్పేది వినండి అని అందరికీ అవని ఎన్నిసార్లు చెప్పినా కూడా వినరు.. ఇక రాజేంద్రప్రసాద్ ఏం వినాలి ఏం వినాలి అని అంటున్నావ్ అని అవనిపై అరుస్తాడు. నువ్వు నా కుటుంబం పై ఇంత కక్ష్య పెంచుకుంటావని అస్సలు అనుకోలేదు అని కోపంగా అరుస్తాడు. నువ్వు ఆస్తిపై కన్నేసావని అందరూ చెప్తున్నా నేను నమ్మలేదు. భార్యని చంపాలి అనుకున్నావ్ అని నాకు కట్టుకున్న భార్య చెప్పిన కూడా నేను నమ్మలేదు. నా కూతురు జీవితాన్ని ఈ దౌర్భాగ్యుడు చేతిలో పెట్టి మోసం చేశావు. ఇక ప్రణతి మాట్లాడడానికి ముందుకొస్తే రాజేంద్రప్రసాద్ మాత్రం మాట్లాడనివ్వకుండా ఉంటాడు. ప్రణతిని కొట్టబోయి నువ్వు ఆడపిల్లవు కాబట్టి నీ మీద చెయ్యి ఎత్త లేకపోతున్నానని అంటాడు.
ఇక ఇంట్లోనే వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటారు ముఖ్యంగా పల్లవి తన ప్లాన్ వర్కౌట్ అయిందని రెచ్చిపోయి మాట్లాడుతుంది. అక్షయ్ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపో అని అరుస్తాడు. ప్రణతి అవని తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బయటకు వెళ్లి బాధపడుతూ ఉంటుంది అసలు ఏం జరిగేది అనేది ఒకసారి గుర్తు చేసుకుంది. ప్రణతి కోసం వెతుకుతూ అవని వెళ్తుంటే మధ్యలో బరత్ కలిసి ప్రణతి అటు వెళ్లింది అక్క ఏమైంది అని వెతుక్కుంటూ వెళ్లిపోతారు.
ప్రణతి ఒక గుట్ట పైకి వెళ్లి విషం తాగుబోతుంటే అవని భరత్ ఇద్దరు వెళ్లి ఆమెను కాపాడుతారు. నువ్వు ప్రేమించిన వ్యక్తితో నేను పెళ్లి చేస్తాను నువ్వు ఎందుకు ఇలా తొందరపడి నిర్ణయం తీసుకున్నావని ప్రణతిని అడుగుతుంది అవని. ప్రణతి అతను నాకు పెళ్లి ఫిక్స్ అయింది అన్నయ్య చెప్పిన తర్వాత అసలు అడ్రస్ లేకుండానే వెళ్లిపోయాడు వదిన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇల్లు కూడా మారిపోయాడు అని అంటుంది. ఈ చిన్న విషయానికి నువ్వు చనిపోవాలనుకుంటున్నావంటే నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు వదిన నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ ని నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా నేను చచ్చిపోవాల్సిందే అని అంటుంది. ప్రణతి ఆ అబ్బాయి దొరికేంతవరకీ ఇద్దరికీ పెళ్లి అయింది మన విషయం ఎవరికీ చెప్పొద్దని భరత్ ప్రణతి దగ్గర మాట తీసుకుంటుంది. ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..