BigTV English

Nindu Noorella Saavasam Serial Today May 17th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి షాక్‌ ఇచ్చిన అమర్‌ – మిస్సమ్మ చంపకుండా వదిలేశానన్న మనోహరి  

Nindu Noorella Saavasam Serial Today May 17th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి షాక్‌ ఇచ్చిన అమర్‌ – మిస్సమ్మ చంపకుండా వదిలేశానన్న మనోహరి  

Nindu Noorella Saavasam Serial Today Episode : కోల్‌కతా నుంచి వచ్చిన అమర్‌ బాధగా మిస్సమ్మను హాస్పిటల్‌కు తీసుకెళ్దామా..? ఏదైనా ప్రాబ్లమా అని ఇంటికి వచ్చి ట్రీట్‌మెంట్ చేస్తున్న డాక్టర్‌ను అడుగుతాడు. వద్దని ఏం పర్వాలేదని కాకపోతే రెస్ట్ తీసుకోవాలని ఆ కాలు మీద బరువు వేసి నడవొద్దని చెప్పి వెళ్లిపోతుంది. అమర్‌, మిస్సమ్మ పక్కన కూర్చుని అసలు ఎలా పడ్డావు అని అడుగుతాడు. బట్టలు ఆరేసి లోపలికి వస్తుంటే జారి పడ్డానండి అని మిస్సమ్మ చెప్పగానే.. ఇంతలో నిర్మల నాన్నా అమర్‌ ఆ దేవుడి దయవల్ల మన భాగీకి ఇవాళ పెద్ద ప్రమాదమే తప్పింది అని చెప్తుంది. అసలు చూసుకుని నడవమని నీకు ఎన్నిసార్లు చెప్పాను.. ఇవాళ ఎంత ప్రమాదం తప్పిందో చూశావా..? అంటాడు అమర్‌. దీంతో మిస్సమ్మ నేను చూసుకునే నడుస్తున్నానండి కానీ అక్కడ వాటర్‌ ఉన్నాయి. అందుకే జారి పడిపోయాను అని చెప్తుంది.


స్టెప్స్‌ దగ్గర వాటర్‌ ఎలా వచ్చాయి.. అసలు అక్కడ వాటర్‌ ఎవరు పోశారు..  అని అమర్‌ అనుమానంగా అడగ్గానే.. మనోహరి భయంగా  అమర్‌ అక్కడ వాటర్‌ ఎవరు పోస్తారు.. మిస్సమ్మ బట్టలు తీసుకుని వెళ్లినప్పుడు పడి ఉండొచ్చు అని చెప్తుంది. సరే జరిగిందేదో జరిగిపోయింది. భాగీ డాక్టర్‌ చెప్పింది గుర్తుంది కదా..? నాలగు రోజులు బెడ్‌ మీద నుంచి కిందకు దిగకూడదు అని నిర్మల చెప్పగానే.. ఆహా మాటలైతే చెప్పావే కానీ బెడ్‌ మీద కూర్చోబెట్టి సేవలు చేయమంటే ఎవరు చేస్తారే అంటాడు శివరాం. అనామిక ఏదో చెప్పబోతుంటే వద్దని సైగ చేస్తాడు. దీంతో అనామిక నేను చేసేదాన్నే కానీ పిల్లలతోనే నాకు టైం సరిపోతుంది.. ఆంటీ చూసుకుంటారేమో అంటుంది. దీంతో నిర్మల భయంగా అమ్మో నేనా కూర్చుంటే లేవడానికే గంట పడుతుంది. ఇక భాగీని ఏం చూసుకుంటాను అమ్మా అంటుంది.

ఇంతలో మనోహరి కల్పించుకుని అమర్‌ తనని వాళ్లింటికి పంపించేద్దాం.. అక్కడైతే వాళ్ల నాన్నా పిన్ని ఉంటారు. మళ్లీ నయం అయ్యాక ఇక్కడికి రమ్మని చెబుదాం.. అంటుంది. దీంతో అమర్‌ తన ఇల్లు ఇదే మనోహరి.. నువ్వు ఏ ఇంటికి పంపించాలి అనుకుంటున్నావో నాకైతే అర్థం కావడం లేదు. అని చెప్పగానే.. నేను అలా అనలేదు అమర్‌. లాస్ట్ టైం నువ్వు ఇబ్బంది పడ్డట్టు మళ్లీ ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పాను అంటుంది మనోహరి.. దీంతో అమర్‌ ఇబ్బందా..? నా భారం నేను చూసుకోవడంలో ఏం ఇబ్బంది ఉంది. అయినా ఇబ్బంది ఉన్నా కూడా చేయాలి.. చేస్తాను. భర్తగా అది నా బాధ్యత భాగీని నేను చూసుకుంటాను. ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని అమర్‌ చెప్పగానే.. మనోహరి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నాకు తెలిసి ఇదంతా ఇదే చేసి ఉంటుంది. దీన్న ఏం చేసినా పాపం లేదు అని అనామిక మనసులో అనుకుని మిస్సమ్మకు జాగ్రత్తలు చెప్పి అమ్మో బయట రాజు గారు ఉన్నారు కదా వెళ్లాల అని బయటకు వెళ్తుంది అనామిక.


బయట యమధర్మరాజు, చిత్రగుప్త, విచిత్రగుప్త ఉంటారు. అనామిక వెళ్లి సారీ రాజు గారు లోపల నా చెల్లిపడిపోయిందన్న బాధలో ఉండిపోయాను సారీ అని చెప్తుంది. ఎవ్వరూ పలకరు. దీంతో ఏమైంది గుప్త గారు ఎందుకు ముగ్గురు అలా ఉన్నారు అని అడుగుతుంది. దీంతో యమదర్మరాజు నువ్వు ఈ శరీరంతో ఉండటం మంచిది కాదు. మా మాట విని మాతో రమ్ము అని చెప్తాడు. దీంతో అనామిక ఏంటి రాజు గారు జరిగింది అంతా చూసి కూడా నన్ను రమ్మంటున్నారా..? మనోహరి ఎంత దుర్మార్గురాలో తెలిసి కూడా నన్ను తీసుకెళ్తారా..? అంటూ ప్రశ్నింస్తుంది. దీంతో యమధర్మరాజు అవును బాలిక నీ సమయం ముగిసింది. నువ్వు ఇచ్చట ఉన్నన్నీ రోజులు నీకు కష్టాలే  తప్పా సుఖం ఉండదు. నువ్వు చేసిన పుణ్యాలకు స్వర్గానికి వెళ్లి అనుభవించుము అని చెప్తాడు.

నా కుటుంబం ఇక్కడ కష్టాల్లో ఉంటే నన్ను వెల్లి ఆనందంగా ఉండమంటున్నారా..? రాజు గారు అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో యముడు కోపంగా బాలిక నీకు ఈ కుటుంబమునకు ఎటువంటి సంబంధం లేదు.. నీ మరణంతో రుణ బంధం ముగిసింది. మా మాట విని మాతో రమ్ము అని పిలవగానే.. సారీ రాజు గారు నేను రాలేను అని చెప్తుంది. దీంతో యముడు కోపంగా వచ్చే పౌర్ణమి నాటికి నువ్వు మా లోకానికి రాలేకపోతే నీకు మరు జన్మ ఉండదు. నీ పాపపుణ్యాలు సమానం అయిపోతాయి అని చెప్పగానే.. పర్వాలేదు రాజు గారు ఈ లోపు మనోహరి అంతం చేసి వస్తాను అని చెప్తుంది. ఆలోపు నువ్వు చేయకపోతే అని చిత్రగుప్త అడగ్గానే.. రాజు గారు చెప్పినట్టు నా జన్మ గతించిపోతుంది అని అనామిక చెప్పగానే.. యముడు కోపంగా వెళ్లిపోతాడు.

మరోవైపు మిస్సమ్మను బయటకు తీసుకురావడానికి రాథోడ్‌ వీల్‌ చైర్‌ తీసుకుని వెళ్తాడు. నిన్ను బయటకు తీసుకురమ్మని మా సార్‌ నీకు వీల్‌ చైర్‌ పంపించారు అని చెప్తాడు. దీంతో మిస్సమ్మ కోపంగా మీ సార్‌ ఎక్కడ అని అడుగుతుది. ఫోన్ మాట్లాడతున్నారు అని రాథోడ్‌ చెప్పగానే.. మీ సారే లోపలికి వచ్చి నన్ను ఎత్తుకుని ప్రేమగా బయటకు తీసుకెళ్లాలి అని చెప్తుంది. అదే విషయం రాథోడ్‌ వెళ్లి అమర్‌ కు చెప్పగానే అమర్‌ వచ్చి మిస్సమ్మను ఎత్తుకుని లాన్‌లోకి తీసుకెళ్తాడు. అక్కడే బుక్‌ చదువుతూ కూర్చున్న మనోహరి చూసి షాక్‌ అవుతుంది. దీన్ని చంపకుండా అనవసరంగా విడిచిపెట్టాను అనుకుంటుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

Intinti Ramayanam Today Episode: అక్షయ్ ను రెచ్చగొట్టిన పల్లవి.. పోలీస్ కంప్లైంట్.. ప్రణతి కోసం నిజం చెప్తాడా..?

GudiGantalu Today episode: మీనా మిస్సింగ్.. ప్రభావతి ఇంట్లో టెన్షన్..లెటర్ తో ఇంట్లో బాంబ్..

Nindu Noorella Saavasam Serial Today october 5th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరును బంధించేందుకు చంభా కొత్త ప్లాన్‌    

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి రాబోతున్న చిత్రాలు.. ఆ ఒక్కటి వెరీ స్పెషల్..

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి నర్మద స్ట్రాంగ్ వార్నింగ్..కత్తి పట్టిన ప్రేమ.. ఇది కదా ట్విస్ట్ అంటే..

Big tv Kissik Talks: మహేష్ విట్టా లవ్ లో ఇన్ని  ట్విస్టులా.. నా ఆటోగ్రాఫ్ సినిమాని తలపిస్తోందిగా?

Big tv Kissik Talks: బిగ్ బాస్ నా జీవితాన్నే మార్చేసింది.. ఆ క్షణం ఎప్పటికీ మర్చిపోలేను?

Big tv Kissik Talks: పేరుకే గొప్ప నటుడు.. సొంత ఇల్లు కూడా లేదు.. ఇండస్ట్రీలో ఇంత మోసమా?

Big Stories

×