Nindu Noorella Saavasam Serial Today Episode: పిల్లల రూంలోకి వెళ్తున్న మిస్సమ్మకు అనామిక ఫోన్ చేస్తుంది. వెంటనే మిస్సమ్మ తన రూంలోకి వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. నిన్న కాల్ చేస్తే ఇవాళ కాల్ చేస్తారా..? పోనీలే ఇవాళైనా చేశారు అంటూ మిస్సమ్మ మాట్లాడుతుంటే.. అనామిక.. ఆరులా మాట్లాడుతుంది. భాగీ ఒక్క నిమిషం నేను చెప్పేది విను అంటుంది. దీంతో మిస్సమ్మ ఏమైంది అక్కా ఎందుకు అదోలా మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. దీంతో అనామిక నువ్వు ఇక మీదట ఈ నెంబర్‌కు కాల్ చేయకు అని చెప్తుంది. దీంతో మిస్సమ్మ బాధగా ఎందుకు అక్కా ఏమైంది అని అడుగుతుంది. నువ్వు ఇక నా ఫోన్ కోసం వెయిట్ చేయకు భాగీ అని చెప్తుంది అనామిక. నేను కలిసే క్షణం కోసం ఎదురు చూడను.
లైఫ్‌లో ఏం జరిగినా ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా ముందుకు అడుగు వేయి.. నేను ఎక్కడున్నా..? నువ్వు సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను. బై అంటూ కాల్ చేస్తుంటే.. మిస్సమ్మ బాధగా అక్కా ఒక్క నిమిషం కాల్ కట్ చేయకండి.. హలో అంటూ ఏదో చెప్పబోతుంటే.. ఇంతలో అమ్ము కలగజేసుకుని అమ్మ చెప్పినట్టు నువ్వు డాడీతో హ్యాపీగా ఉండు భాగీ అంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. అమ్ము సారీ అని మెల్లగా చెప్పగానే.. మిస్సమ్మ అనుమానంగా డాడీ ఏంటి.. మీరు ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. దీంతో అనామిక నేను పిల్లలతో మీ డాడీతో హ్యాపీగా ఉండమని చెప్పాను అంటూ ఫోన్ కట్ చేస్తుంది.
తర్వాత మిస్సమ్మ తన ఫ్రెండ్ హర్షకు ఫోన్ చేస్తుంది. తనకు అనామిక కాల్ చేసిన నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ లోకేషన్ ట్రేస్ చేయాలని అడుగుతుంది. హర్ష సరే నెంబర్ పంపించు కనుక్కుంటాను అని చెప్తాడు. దీంతో మిస్సమ్మ నెంబర్ పంపించగానే కనుక్కుని కాల్ చేస్తాను అంటాడు హర్ష. మిస్సమ్మ హ్యాపీగా ఉంటే అనామిక వచ్చి ఏంటి చాలా సంతోషంగా ఉన్నావని అడిగితే నెంబర్ ట్రేస్ చేసే విషయం చెప్పబోయి ఆగి గంట తర్వాత చెప్తానని వెళ్లిపోతుంది మిస్సమ్మ.
మరోవైపు బాబ్జీని కలవడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్తారు మనోహరి, చిత్ర. అయితే స్టేషన్ బయట నిలబడిన చిత్ర నేను ఇక్కడే ఉంటాను నువ్వు లోపలికి వెళ్లి మాట్లాడు అని చెప్తుంది. దీంతో మనోహరి ఆగు ఇద్దరం కలిసే వెళ్తున్నాం. ఇదే ఫైనల్ అని చెప్తుంది. దీంతో చిత్ర ఒకసారి ఆలోచించు మనోహరి.. అసలే ఆ ఎస్సైకి నీ మీద డౌటు ఉందని చెప్తున్నావు. పులి బోనులోకి వెళ్లి ఇరుక్కోవడం అవసరమా చెప్పు అంటుంది. దీంతో మనోహరి వెళ్లకుంటే వెంటనే వాణ్ని కోర్టుకు తీసుకెళ్తారు. రిమాండ్‌కు పంపిస్తారు. ఒక్కసారి జైలుకు తీసుకెళ్లిపోతే మళ్లీ వాణ్ని కలవడం కష్టం అవుతుంది ఇప్పుడు కలిసి వాడు నోరు తెరవకుండా చేస్తేనే నేను తప్పించుకోగలను.. వెళ్దామా..? అనగానే… ఏదో పెద్దగా రెండు ఆప్షన్లు ఇచ్చినట్టు వెళ్దాములే అంటుంది చిత్ర. ఇద్దరూ లోపలికి వెళ్లబోతుంటే.. అమర్, రాథోడ్ వస్తారు.
వాళ్లను చూసిన మనోహరి, చిత్ర షాక్ అవుతారు. దగ్గరకు వచ్చిన అమర్.. మనోహరి చిత్ర ఇక్కడ మీరేం చేస్తున్నారు అని అడుగుతాడు. మనోహరి, చిత్ర మౌనంగా ఉంటారు. సార్ అడుగుతున్నారు కదా చెప్పండి అని రాథోడ్ అడుగుతాడు. దీంతో బాబ్జీతో మాట్లాడదామని వచ్చాము అని మనోహరి చెప్తుంది. ఇంటి దగ్గర వస్తావా అంటే వాడి ముఖం చూడా చూడలేను. చూసి ఆవేశం ఆపుకోలేను అన్నాను. ఈ స్టేషన్ దరిదాపుల్లోకి కూడా రానని అన్నావు అంటాడు అమర్.. దీంతో మనోహరి భయపడుతుంది. చిత్ర కల్పించుకుని సార్ తను రానంటేనే నేనే తనను తిట్టి ఇక్కడికి తీసుకొచ్చాను. ఆరును చంపిన వాడు దొరికితే వాణ్ని కలిసి ఆరు లాంటి అమ్మాయిని ఎందుకు చంపాలనిపించింది అని అడగమని బలవంతంగా తీసుకొచ్చాను సార్ అని చెప్తుంది. మనోహరి కూడా నేను రాకూడదనే అనుకున్నాను. వాడి కళ్లల్లో పశ్చాతాపం కొంచమైనా కనిపిస్తుందేమో చూద్దామని వచ్చాను. ఆరు చావు కోరుకున్నదెవరో ఇప్పటికైనా చెప్పమని అడగడానికి వచ్చాను అమర్ అని చెప్తుంది. దీంతో రాథోడ్ వాడు చెప్పాల్సిన అవసరం లేదు మేడం ఎవరో తెలిసే ఒక పెద్ద ఆధారమే దొరికింది. అని రాథోడ్ చెప్పగానే.. మనోహరి, చిత్ర షాక్ అవుతారు.
మిస్సమ్మ ఇచ్చి సెల్ నెంబర్‌ను ట్రేస్ చేసి కాల్ చేస్తాడు హర్ష. హర్ష కాల్ రాగానే ఆత్రుతగా మిస్సమ్మ.. హర్ష చెప్పు నెంబర్ ట్రేస్ చేశావా..? అని అడుగుతుంది. ఆ చేశాను అని హర్ష చెప్తాడు. ఆ నెంబర్ కొడైకెనాల్ లోనే ఉంది అని చెప్పగానే.. కొడైకెనాల్ లో ఎక్కడుందో చెప్పగలవా అని అడుగుతుంది మిస్సమ్మ. దీంతో హర్ష నేను గైడ్ చేస్తుంటాను నువ్వు వెళ్తావా అంటాడు. వెళ్తానని మిస్సమ్మ చెప్పగానే.. హర్ష.. మిస్సమ్మను గైడ్ చేస్తుంటాడు. హర్షన్న చెప్పినట్టు తిరిగి తిరిగి చివరికి మిస్సమ్మ తాము ఉంటున్న ఇంటి దగ్గరకే వస్తుంది. ఇంటిని చూడగానే మిస్సమ్మ షాక్ అవుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..?అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?