E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode September 25th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  కుక్క బారి నుంచి మనోహరిని సేవ్‌ చేసిన అమర్‌

Nindu Noorella Saavasam Serial Today Episode September 25th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  కుక్క బారి నుంచి మనోహరిని సేవ్‌ చేసిన అమర్‌
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: చంభా చెప్పినట్టు ఆశ్రమం నుంచి తిరిగి వెళ్లున్న కారును తాము అనుకున్న చోట ఎలా ఆపాలా అని ఆలోచిస్తుంది. రాథోడ్ తాను చెబితే కారు ఆపడు కదా అనుకుంటుండగానే.. రాథోడ్ కారు ఆపేస్తాడు. మనోహరి బయటకు చూస్తే.. తనకు చంభా చెప్పిన ప్లేస్‌ లోనే కారు ఆగుతుంది. అది చూసి మనోహరి షాక్‌ అవుతుంది. ఏంటి నేను చెప్పకుండానే కారు ఆగిపోయింది అనుకుంటుండగానే.. మిస్సమ్మ ఏంటి రాథోడ్‌ కారు ఇక్కడ ఆపావు అని అడుగుతుంది. ముందు చూడండి మిస్సమ్మ సార్‌ కారు ఉంది అని చెప్తాడు. రోడ్డు పక్కన పంక్చర్‌ అయిన అమర్‌ కారు కనిపిస్తుంది. అది చూసి అందరూ కారు దిగుతారు.

మిస్సమ్మ కారు దిగగానే.. అక్కడే చెట్టు చాటున వెయిట్‌ చేస్తున్న చంభా మంత్రం వేసి తాను రెడీ చేసిన కుక్కను మిస్సమ్మ మీదకు ఉసిగొల్పుతుంది. ఆ కుక్క గట్టిగా అరుస్తూ.. కోపంగా చూస్తూ.. మిస్సమ్మ ముందుకు వెళ్తుంది. అరుస్తూ.. మిస్సమ్మను చూస్తుంది. మిస్సమ్మ కూడా కోపంగా కుక్కను చూస్తుంది. మనోహరి మాత్రం ఇంకా ఆలస్యం చేస్తావేంటే. దాని మీదకు వెళ్లు కరువు.. దానిలోని ఆరు ఆత్మ బయటకు వచ్చేలా చేయ్‌ అని మనసులో అనుకుంటుంది. అప్పుడే రాథోడ్ కోపంగా ఈ కుక్కను ఇట్లా కాదు మిస్సమ్మ ఉండు అంటూ పక్కకు వెళ్లి రాయి తీసుకొచ్చి కొట్టబోతుంటే.. మిస్సమ్మ వద్దు రాథోడ్‌ ఆ కుక్కను ఏమీ అనొద్దు అంటుంది.

Advertisement

ఏం మూగజీవం అని ప్రేమ చూపిస్తున్నారా మేడం అని రాథోడ్‌ అడిగితే.. అది మూగజీవం కాదు రాథోడ్‌ మంత్రజీవి అని మిస్సమ్మ చెప్తూ.. కుక్క కళ్లల్లోకి సూటిగా చూస్తుంది. ఒక వెలుతురు మిస్సమ్మ కళ్లల్లోంచి కుక్క కళ్లల్లోకి వెళ్తుంది. వెంటనే మిస్సమ్మ కుక్కకు మనోహరి మీదకు వెళ్లమని కళ్లతో సైగ చేస్తుంది. కుక్క డైవర్ట్‌ అయి మనోహరిని కోపంగా చూస్తుంది. మనోహరి షాక్‌ అవుతుంది. ఇదేంటి నన్ను కోపంగా చూస్తుంది. అని మనసులో అనుకుంటూ భయపడుతుంది. కుక్క మెల్లగా మనోహరి వైపు వెళ్తుంటే.. మనోహరి భయంతో పారిపోతుంది. కుక్క కూడా వెనకాలే వెంబడిస్తుంది.

అంతా గమనిస్తున్న చంభా కుక్కను ఆపేందుకు మంత్రం వేస్తుంది. తన మంత్రదండంతో భైరవ నువ్వు కరవాల్సింది మనోహరిని కాదు వెనక్కిరా వచ్చి భాగీని కరువు అని చెప్తుంది. అయినా అక్కడ కుక్క ఏమీ పట్టించుకోకుండా మనోహరి  పని పట్టే పనిలో ఉంటుంది. చంభా భయంతో అయ్యో ఆత్మ శక్తి ముందు నా మంత్రశక్తి పని చేయడం లేదు ఇప్పుడెలా కుక్క చావు చావడం అంటే ఇదేనేమో ఇవాళ మనోహరి కుక్క చేతిలో చావబోతుంది. ఇప్పుడెలా అని భయపడుతుంది. కుక్క వెనకాల తరుముతుంటే.. పరుగెడుతున్న మనోహరి అరుంధతి నన్ను కాపాడు అంటూ కేకలు వేస్తుంది. రాథోడ్‌ షాక్‌ అవుతాడు.. ఏంటి మేడం ఇక్కడ నేను, నువ్వు ఉన్నావు.. రాథోడ్‌ కాపాడు అనో.. లేకపోతే భాగీ కాపాడు అనో అనాలి కానీ మనోహరి ఏంటి అరుంధతి కాపాడు అంటుంది అని అడిగితే.. దానికి నేను వచ్చిన విషయం తెలుసు రాథోడ్‌ అందుకే అలా పిలుస్తుంది అని మిస్సమ్మలోని ఆరు ఆత్మ చెప్తుంది.

Advertisement

అప్పుడే ఆశ్రమం నుంచి తిరిగి కారు దగ్గరకు వస్తుంటాడు అమర్‌. మనోహరిని కుక్క తరమడం చూసి తన గన్‌ తీసి గాల్లోకి కాల్పులు జరుపుతాడు. ఆ సౌండ్‌కు కుక్క పారిపోతుంది. అమర్‌ను చూసి చంభా భయపడితే.. మనోహరి ఊపిరి పీల్చుకుంటుంది.   ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Friday Tv Movies : శుక్రవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

బిగ్ బాస్10 లోకి ముగ్గురు వైల్డ్ కార్డు ఎంట్రీస్.. వచ్చి రావడంతోనే గొడవలు!

గుప్పెడంత మనసు జగతి మేడం కొత్త రూట్.. ఫీజు మాత్రం చాలా తక్కువ!

పాట అంటే ఇదిరా సామి.. ‘సువ్వి సువ్వి’ రీక్రియేషన్ చూసి తీరాల్సిందే!

కడుపునిండా తిండి పెట్టి.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్!

జబర్దస్త్ లో ఉన్న ఎవరికి కామెడీ రాదు..కమెడియన్ కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్ ఆదిరెడ్డికి కౌంటర్ ఇచ్చిన కృష్ణుడు..వ్యూస్ కోసమే అంటూ!

Big Stories

Advertisement
×