E-Paper
Advertisement

Ninnu kori Serial Today Episode September 21st ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రను కత్తితో పొడిచిన రౌడీలు – అయోమయంలో సామ్రాట్ 

Ninnu kori Serial Today Episode September 21st ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రను కత్తితో పొడిచిన రౌడీలు – అయోమయంలో సామ్రాట్ 
Advertisement

Ninnu kori serial today Episode: అందరూ డైనింగ్‌ టేబుల్ దగ్గర భోజనం చేస్తుంటే.. చంద్ర వడ్డిస్తుంది. అప్పుడే శ్రీజ వెళ్లి బావకు తాను వడ్డిస్తానని  చెప్పి సామ్రాట్‌కు బెండకాయ ప్రై వడ్డించబోతే చంద్ర వద్దని అది సామ్రాట్‌ గారికి నచ్చదని.. ముఖ్యంగా ఈ టైంలో ఆయన బెండకాయ ఫ్రై లాంటివి తినకూడదని చెప్తుంది. శ్రీజ కోపంగా బావకు ఏం కావాలో నాకు తెలియదా..? మీరు ఇచ్చి మెడిసిన్స్‌ వరకే హద్దుల్లో ఉండండి అంటూ వార్నింగ్‌ ఇస్తుంది. మదన్‌ ఏవో మాటలు చెప్పి అందరినీ కూల్‌ చేస్తాడు. దాక్షాయణి మాత్రం రేపు అందరం మన ఊరి గుడికి వెళ్దాం. చంద్ర నువ్వు కూడా రావాలి అంటూ చెప్పగానే.. అందరూ సరే అంటూ వెళ్లిపోతారు.

చంద్ర ఒక్కడే రూంలో కూర్చుని ఆలోచిస్తుంటే.. వాళ్ల నాన్న మందు తీసుకెళ్లి మనిద్దరం మందు తాగి ఎన్ని రోజులైందో కదా అంటూ మందు కలిసి ఇవ్వగానే.. సామ్రాట్‌ కు తాను రఘురాంతో కలిసి తాగిన విషయం గుర్తుకు వస్తుంది. అప్పుడే చంద్ర, మదన్‌ లోపలకి వస్తారు. మీరేం వర్రీ అవ్వకండి ఇదంతా మాకు అలవాటే అంటాడు కేశవ. సామ్రాట్‌ మాత్రం అవును నేను ఇదంతా గమనిస్తుంటే.. నాకు కొంచెం గుర్తుకు వస్తుంది. అని చెప్తాడు. ఆ మాటలు విన్న చంద్ర బావకు మామయ్య గుర్తుకు వచ్చినట్టున్నాడు అని మనసులో అనుకుంటుంది.

Advertisement

అప్పుడే దాక్షాయణి రూంలోకి వస్తుంది. కోపంగా ఏంటండి ఇది ఇదేం కొత్త అలవాటు నాన్న నువ్వేంటి..? అని అడగ్గానే.. మదన్‌ మేడం ఈ గ్లాస్‌ నాది. బ్రదర్‌కు చీర్స్‌ అని చెబితే.. నా గ్లాస్‌ లాక్కున్నారు అని చెప్పగానే.. దాక్షాయణి కోపంగా కేశవకు వార్నింగ్‌ ఇచ్చి రెండుంటే రెండు పెగ్గులు అంతకన్నా ఎక్కువ తాగారంటే రేపటి నుంచి 41 రోజులు దీక్ష చేయిస్తాను అంటూ చెప్పి వెళ్లిపోతుంది. సామ్రాట్‌ ఇక మందు తాగనని చెప్పగానే.. మదన్‌ను కంపెనీ ఇవ్వమని అడిగితే బాటిల్‌ తీసుకుని పదండి అంటూ ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. చంద్ర కూడా సామ్రాట్‌ గారు మీకు ఫిజియో చేయాలి కదా పదండి అంటూ తీసుకెళ్తుంది.

గార్డెన్‌లో సామ్రాట్‌తో చంద్ర పిజియో చేయిస్తుంటే సామ్రాట్‌ చంద్రను అబ్జర్వ్‌ చేస్తుంటాడు. చంద్ర కిందపడబోతుంటే.. పట్టుకుంటాడు. ఇంట్లో ఎవ్వరినీ చూసినా పెద్దగా ఏమీ అనిపించడం లేదు. కానీ నిన్ను చూస్తేనే నాకు నువ్వు ముందు నుంచి తెలిసినట్టు అనిపిస్తుంది. నేను మీకు హాస్పిటల్‌లోనే పరిచయం అయ్యానా..? లేక అంతకుముందే తెలుసా..? అని అడగ్గానే.. చంద్ర ఎమోషనల్ అవుతూ ఇక్కడ చల్లగా ఉంది లోపలికి వెళ్దాం పదండి అంటూ వెళ్లిపోతుంది.

Advertisement

మరుసటి రోజు ఉదయం అందరూ గుడికి వెళ్తారు. గుడిలో పూజారి దాక్షాయణి వాళ్లకు స్వాగతం పలికి సామ్రాట్‌ ఆరోగ్యం గురించి అడుగుతాడు. దాక్షాయణి గుడి గొప్పదనం గురించి చెప్తుంది. ఆ గుడి తమ పూర్వీకులు కట్టించారని ఎంతో ప్రాముఖ్యత గల గుడి అని చెప్తుంది. శ్రీజ వెంటనే సామ్రాట్‌కు గతం గుర్తుకు చేయాలని ప్రయత్నిస్తుంటే.. మదన్‌ అడ్డుపడి మీరు వెంటనే అలా చేయకండి ఆయన బ్రెయిన్‌ తట్టుకోలేదు అంటూ అడ్డుపడతాడు. అప్పుడే దాక్షాయణి కల్పించుకుని సామ్రాట్‌ను ప్రదక్షిణ చేసి రమ్మని చెప్తుంది. సరే అంటూ సామ్రాట్‌ వెళ్తాడు.

చంద్ర మాత్రం భయంతో నా భర్తను సామ్రాట్‌ గారు అనుకుని శత్రువులు చంపడానికి ప్రయత్నిస్తున్నారు.. నా భర్తకు ఏ ప్రమాదం రాకుండా కాపాడు స్వామి అంటూ మొక్కుతుంది. అప్పుడే బయట ప్రదక్షిణకు వెళ్లి సామ్రాట్‌ మీద రౌడీలు అటాక్‌ చేస్తారు.   మదన్‌ వెళ్లి రౌడీలతో ఫైట్‌ చేస్తుంటాడు.. అప్పుడే ఒక రౌడీ వెనక నుంచి సామ్రాట్‌ను కత్తితో పొడవబోతుంటే.. చంద్ర వెళ్లి కత్తిని చేతితో పట్టుకుంటుంది. చేయి తెగి రక్తం వస్తుంది. రౌడీలు పారిపోతారు. దాక్షాయణి ఎమోషనల్ అవుతూ చంద్ర ఆ దేవుడే నీ రూపంలో వచ్చి నా కొడుకుని కాపాడాడు అంటూ అందరినీ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇంతలో ఈరోజు నిన్ను కోరి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Gundeninda GudiGantalu Today episode: ప్రభా దెబ్బకు రోహిణి ఫ్యూజుల్ అవుట్.. మీనా మాటతో షాక్.. అయ్యో పాపం మీనా..

Podarillu Today Episode : చక్రికీ నిజం తెలుస్తుందా..? ఇది కదా హైలెట్.. శైలు కు వార్నింగ్..

Karthika Deepam 2 Serial Today Episode September 21st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంటికి వెళ్లిన కార్తీక్, దీప – నిజం విన్న దక్షిణమూర్తి          

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమను రెచ్చగొట్టిన భద్ర.. పెళ్లికి హడావిడి.. ప్రేమ, ధీరజ్ ఫైట్..

Telugu Serials : ఈ వారం టాక్ ఆఫ్ ది సీరియల్ ఇదే.. అస్సలు ఊహించలేదు..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఆ రెండు సీరియల్స్ అవుట్..

Monday Movies in Tv : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్…

Big Stories

Advertisement
×