Illu Illalu Pillalu Today Episode September 21st : ప్రేమని ఎలాగైనా సరే మళ్లీ మన ఇంటికి తీసుకుని వెళ్లాలి అని వేదవతి అందరితో చెప్తుంది అయితే పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా వేదవతి మా ప్రేమను మాతో పంపించండి తను మా ఇంటి కోడలు మా ఇంట్లోనే ఉండాలి అని అడగడంతో ఒక్కసారిగా భద్రత పాటు ప్రేమ కూడా షాక్ అవుతుంది. మెల్లో పసుపు తాడు వేసుకుంటే అది తాళిబొట్టు ఎలా అవుతుంది ? ఎవరు సాక్ష్యం లేరు కానీ ఆ పెళ్లి చెల్లదు అంటూ భద్రావతి క్లాసులు పీకుతుంది. అయితే వేదవతి ఎలా జరిగినా అది పెళ్లి అవుతుంది. కానీ వేరే ఉద్దేశం కాదు కదా అని ఎంత చెప్తున్నా సరే భద్రా మాత్రం నా మేన కోడలిని నేను ఎక్కడికి పంపించను అని చెప్తుంది. తన మేనకోడల్ని ఎక్కడికి పంపించను అంటూ భద్ర పెద్ద గొడవే చేస్తుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు.
ఏంటి ఆ పెళ్లి చల్లగా ఎందుకు చెల్లదు తన మెడలో నా కొడుకు తాళి కట్టాడు తను నా కోడలే అని రామరాజు అంటాడు. కానీ భద్రావతి మాత్రం పసుపు తాడుని తాళి అని మీరే అంటున్నారు. నా మేనకోడల్ని నేను ఎప్పటికీ పంపించను అని భద్ర అది గట్టిగా కూర్చుంటుంది. ఆ పెళ్లి చెల్లదు అని నువ్వు అంటున్నావు. అదే పెళ్లిని నేను అంగరంగ వైభవంగా చేసి అందరూ ముందు సాక్షాలను సంపాదించి నీకు చూపిస్తాను అని భద్రకు దిమ్మ తిరిగిపోయేలా వార్నింగ్ ఇస్తాడు రామరాజు.. మళ్లీ పెళ్లి చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు అని నర్మదా అంటున్నా సరే సాక్షాలు కావాలని అంటుంది కదా ఆ సాక్షాలు నా కొడుకు కోడలికి మళ్ళీ పెళ్లి చేసి అందరికీ చూపిస్తాను అని రామరాజు ధీమా వ్యక్తం చేస్తాడు. రామరాజు మాట విన్న భద్రావతి ఎలాగైనా సరే ప్రేమని ధీరజ్ని విడగొట్టాలి అని ప్లాన్ చేస్తుంది.
ప్రేమ ఒక్కటే కూర్చుని బాధ పడిపోతూ ఉండగా.. భద్ర అలాగే సేన ఇద్దరు కూడా ప్రేమ మనసుని మార్చాలి అని ఒక చోటికి వస్తారు. ప్రేమను వింత బాధ పడిపోతున్నావు కానీ దీనంతటికీ కారణం ఆ కుటుంబమే. అందులో ఆ ధీరజ్ గాడు మన కుటుంబ పరువును తీసేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు అని ప్రేమని ఓదార్చినట్టే ఓదారుస్తూ రెచ్చగొట్టేస్తూ ఉంటుంది భద్ర.. ప్రేమ నువ్వు మాటిచ్చావు కదా.. మన ఇంటి పరువు పోతే వాడి జీవితంలో మొహం కూడా చూడను అని చెప్పావు కదా.. మళ్లీ ఎందుకు నువ్వు వాడి గురించి ఆలోచిస్తున్నావు అని భద్ర ఇన్ డైరెక్ట్ గానే రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. మొత్తానికి ప్రేమ నేను విసిగిపోయాను అత్త ఇకమీదట వాడి జోలికి వెళ్ళను వాడి గురించి కూడా ఆలోచించను అని మరోసారి మాటిస్తుంది.. ప్రేమ పూర్తిగా ధీరజ్ కి దూరంగా మారిపోయింది అని ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు.
రామరాజు ఇంట్లో ధీరజ్ ప్రేమలో పెళ్లి కోసమని అంత సిద్ధం చేస్తూ ఉంటారు.. ఎలాగైనా సరే వీళ్ళిద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్లి చేసి ఆ బద్రావతి నోరు ముగించాలి అని అనుకుంటారు. కానీ కామాక్షి తనకు తగ్గట్లుగానే అన్ని లిస్టు రాస్తూ ఉండగా వేదవతి సీరియస్ అవుతుంది. పెళ్లి చేయాలి అంటే ముందు పెళ్లికూతురు ఉండాలి కదా అది చెప్పవే మీ నాన్నకి అని వేదవతి అంటుంది. ప్రేమ ఉన్నా కూడా.. వాళ్లు ప్రేమ మనసుని ఎలా మార్చేసి ఉంటారో తెలియదు కదా.. కానీ ప్రేమ పెళ్లి జరగడానికి మీరిద్దరూ మాట్లాడి ఒప్పించాలి అని రామరాజు అంటాడు. నర్మద మాత్రం రామరాజు వేదవతిని కలిపి ఎందుకు ప్రయత్నం చేస్తుంది.. రామరాజు ప్రేమ ధీరధుల పెళ్లి జరిగితే మళ్లీ నీతో మాట్లాడతారు అని చెప్తాడు. మొత్తానికి రామరాజు మాటతో వేదవతి ఫుల్ ఖుషి అవుతుంది. అటు శ్రీవల్లి మాత్రం ఆగిపోయే పెళ్లికి హడావిడి ఎక్కువ అని వీళ్ళు ఇంత చేస్తున్నారు అసలు ఇక్కడ ఈ పెళ్లి ఏమి జరగదు అని అనుకుంటూ ఉంటుంది.
నర్మదా తన రెండు కుటుంబాలు విడిపోవడానికి కారణం శ్రీ వల్లి అని అనుకుంటుంది. అనుకొని మాత్రమే కాదు తన ఫ్రెండ్ ద్వారా శ్రీవల్లి చేసిన ఆగడాలను బయట పెట్టాలి అని అనుకుంటుంది దానికి సంబంధించిన ఆధారాలను తన ఫ్రెండ్ ద్వారా సంపాదించాలి అని నర్మద ఫిట్ అవుతుంది. అయితే నర్మదా తన ఫ్రెండ్ ను కలిసినప్పుడు దాదాపు ఇవన్నీ చేసింది. శ్రీవల్లినే కానీ భద్రకి ఎలా కాంటాక్ట్ అయింది మాత్రం అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. ధీరజ్ ఎలాగైనా సరే ప్రేమను ఒప్పించాలి అని అనుకుంటాడు. అయితే ప్రేమ బయట ఒంటరిగా కనిపించడంతో ధీరజ్ మాట్లాడాలి అని అనుకుంటాడు. అయితే దీని దగ్గరికి వచ్చిన ప్రేమ నీదే తప్పు అని మాట్లాడుతుంది ఇద్దరూ ఒకరికొకరు తప్పులు గురించి మాట్లాడుకుంటారు. తప్ప తమ పెళ్ళి గురించి ఆలోచించడం మానేస్తారు వీళ్ళిద్దరిని చూసిన విశ్వం అమూల్య వీళ్లిద్దరూ కలిసిపోతే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. మా అత్త వాళ్ళ పరువు తీసేలా నేనే పని చేయను అని ప్రేమ అనగానే.. ధీరజ్షాక్ అవుతాడు అక్కడితో ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Intinti Ramayanam Today Episode: బాబు కిడ్నాప్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. అవని ప్లాన్ సూపర్..