E-Paper
Advertisement

Ninnu kori Serial Today Episode September 22nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం చెప్పిన చంద్ర 

Ninnu kori Serial Today Episode September 22nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం చెప్పిన చంద్ర 
Advertisement

Ninnu kori serial today Episode: గుడిలో సామ్రాట్‌ మీద జరిగిన అటాక్‌ జరిగిన విషయం అందరూ ఇంటికి వెళ్లి ఆలోచిస్తుంటారు. ఆ రోజు హాస్పిటల్‌లో అటాక్‌ చేసిన వారే ఇవాళ కూడా చేశారేమోనని సామ్రాట్‌ చెప్పగానే.. మదన్‌ కోపంగా వాళ్లెవరో సామ్రాట్‌ గారిని ఫాలో అవుతున్నారు.. ఇంతకీ మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా..? అని అడిగితే దాక్షాయణి వాళ్ల అన్న మాత్రం ఏవేవో ప్రగల్బాలు పలుకుతూ మనసులో మాత్రం నేను పిరికివాణ్ని అన్న విషయం ఎవ్వరికీ తెలియకూడదు అనుకుంటాడు.

అప్పుడే జీవన్‌ పరుగెత్తుకుంటూ వచ్చి నీ మీదే చేయి వేశారంటే వాళ్లు నిన్ను చంపాలని చూస్తారు. వాళ్లకు ఇసలు చాన్స్‌ ఇవ్వకూడదు. ఇంత అఘాయిత్యానికి పాల్పడింది ఆ ల్యాండ్‌ మాఫియానే అయ్యుంటుంది వాళ్లను ఇప్పుడే వెళ్లి చంపేస్తాను అంటూ జీవన్‌ వెళ్లబోతుంటే దాక్షాయణి చెంప పగులగొడుతుంది. అందరూ షాక్‌ అవుతారు. మొక్కు తీర్చుకోవడానికి గుడికి వెళితే నా కొడుకును చంపాలని చూశారు. మంచి చేసినందుకే ప్రాణాలు తీయాలని చూశారు. ఇప్పుడు నువ్వు కత్తి తీసుకుని వెళితే ఇంకెంత మంది శత్రువులు పుట్టుకొస్తారో తెలుసా..? ఏం చేయాలో నాకు తెలుసు.. నువ్వు అతి తెలివితో ఏమైనా చేశావో బాగుండదు.. నోరు మూసుకుని రైస్‌ మిల్లు పనులు చూసుకో. ఇంతకుముందు లెక్కల్లో తేడా వచ్చింది. ఇంకోసారి తేడా వస్తే నేను ఊరుకోను అంటూ వార్నింగ్‌ ఇస్తుంది. జీవన్‌ వెళ్లిపోతాడు.

Advertisement

సామ్రాట్‌ కూడా జీవన్‌ను పరాయివాళ్ల ముందు కొట్టడం తప్పు కదా అంటే.. వాళ్ల నాన్న ఎవర్రా ఇక్కడ పరాయివాళ్లు చంద్రనా..? తను ప్రాణాలు అడ్డుపెట్టి నిన్ను రక్షిస్తుంది. ఇక మదన్‌ అంటావా..? మదన్‌ కూడా నీ కోసం ఎంత కష్టపడుతున్నాడో చూస్తున్నాం కదా..? అంటూ చెప్పగానే.. సామ్రాట్‌ చంద్రకు సారీ చెప్తాడు. శ్రీజ కూడా చంద్రను అప్రిసియేట్‌ చేస్తుంది. మీరు లేకపోయినా నేను మా బావను చూసుకోగలను అనుకున్నాను కానీ ఇవాళ మీరు చేసింది నేను చేయలేను నీ మేటు జన్మలో మర్చిపోలేను అని చెప్పగానే.. చంద్ర మాత్రం తాను కేర్‌ టేకర్‌ తన పని తాను చేశానని వెళ్లిపోతుంది.

బయటకు వెళ్లిన చంద్ర ఏడుస్తుంటే.. మదన్‌ వెళ్లి ఓదారుస్తుంటాడు. సామ్రాట్‌ తెలియక అలా అన్నారు మీరేం బాధపడకండి అంటే.. తెలియక అన్నా నా బావ నాకు దూరం పెట్టడం ఇష్టం లేదు అంటుంది. దీనికే ఇంత ఫీల్‌ అయితే ముందు ముందు ఇంకా చాలా ఎదుర్కోవాలి.. ఆ గిరిజ మిమ్మల్ని టార్గెట్‌ చేస్తుంది. శ్రీజని నీ మీదకు రెచ్చగొడుతుంది అనిపిస్తుంది అని చెప్పగానే.. అందుకే బావకు త్వరగా గతం గుర్తుకు రావాలని కోరుకుంటున్నాను.. ఆ ప్రయత్నం కూడా మనం చేయాలి అని మదన్‌కు చెప్తుంది చంద్ర.

Advertisement

గాయం అయిన చేతికి చంద్ర ఆయిట్‌మెంట్‌ పెడుతుంటే.. సామ్రాట్‌ వెళ్లి నా వల్లే కదా నీకు ఇదంతా జరిగింది ఇటువ్వు అంటూ ఆయిట్‌మెంట్‌ సామ్రాట్ పెడుతుంటే.. చంద్ర ఎమోషనల్‌ అవుతూ చూస్తుంది. అప్పుడే అటూగా వెళ్తున్న గిరిజ వాళ్లిద్దరినీ చాటు నుంచి అబ్జర్వ్‌ చేస్తుంది. తనను ఇంట్లో వాళ్ల కన్నా ఎక్కువ బాగా చూసుకుంటుంది చంద్రేనని సామ్రాట్‌ కూడా ఎమోషనల్‌ అవుతూ మాట్లాడుతుంటాడు.   చంద్ర ఏడుస్తూ.. నాప్రాణం పోయినా పర్వాలేదు కానీ మిమ్మల్ని కాపాడుకుంటాను అంటూ చంద్ర మాట్లాడుతుంటే.. ఒకవేళ తనకు గతం గుర్తుకు వస్తే తనను వదిలేసి వెళ్లిపోతావా చంద్ర అని సామ్రాట్‌ అడిగితే.. చంద్ర షాక్‌ అవుతుంది.

ఏం చెప్పాలో అర్థం కాక చూస్తుండిపోతుంది. ఏడుస్తూ.. తనకేం చెప్పాలో అర్థం కావడం లేదని నిజంగా గతం గుర్తుకు వస్తే నేను ఉండాలో వెళ్లాలో మీరే చెప్పాలి అంటుంది. ఇంతకు ముందు కూడా మన మధ్య ఇలా జరుగుతుంది అనే ఫీల్ కలుగుతుందని.. నిజంగా నువ్వు నన్ను హాస్పిటల్‌ లోనే చూశావా..? మనకు ఇంతకు ముందు పరిచయం లేదా అంటూ సామ్రాట్‌ అడగ్గానే.. చెప్తే మీరు నమ్ముతారా..? మనుక ముందే పరిచయం ఉంది. మనం గాఢంగా ప్రేమించుకున్నాం.. పెళ్లి కూడా చేసుకున్నాం.. అంటూ నమ్ముతారా..? అంటూ నవ్వుతుంది. ఏంటి నవ్వుతున్నావు అని సామ్రాట్‌ అడిగితే.. మరీ నమ్ముతారా..? అంటూ చెప్పగానే.. సామ్రాట్‌ నన్ను కంగారు పెట్టి ఎలా చూస్తున్నావు అంటాడు సామ్రాట్‌. అంతా విన్న కోపంగా వెళ్లిపోతుంది.

తన రూంలోకి వెళ్లిన గిరిజ శ్రీజకు లేనిపోని మాటలు చెప్తుంది. ఆ చంద్ర మీ బావకు వల వేసి ఎత్తుకెళ్లిపోతుంది. గతం గుర్తుకు వచ్చాక చంద్ర వెళ్లిపోతుందేమోనని బాధపడుతున్నాడు. నువ్వు వదిలేస్తే మీ బావ నీకు దక్కడు అని చెబితే అలా ఏం జరగదు బావ నా వాడు.. అత్తయ్య బావను నాకు మాత్రమే ఇచ్చి చేస్తుంది అంటుంది శ్రీజ.. ఇంతలో ఈరోజు నిన్ను కోరి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ ఎమోషనల్.. నర్మదకు దొరికిపోయిన వల్లి.. పాపం వల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి అడ్డంగా ఇరుక్కుంది..? అవనికి టెన్షన్.. చివరిలో ట్విస్ట్..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఆ రెండు సీరియల్స్ అవుట్..

యూట్యూబర్ నందన దంపతులకు మరో షాక్.. బిగుస్తున్న ఉచ్చు!

‘ఢీ’ షో వచ్చాకే మార్పు మొదలైందా.. ఉదయభాను షాకింగ్ ఫ్యాక్ట్స్ రివీల్!

10 కోట్లు ఇచ్చిన బిగ్ బాస్ వెళ్ళను..కట్ చేస్తే బిగ్ బాస్ సీజన్ 10 లో కంటెస్టెంట్!

బిగ్ బాస్ 10 లవ్ ట్రాక్స్..విన్నర్ ఎవరో చెప్పిన కృష్ణుడు!

Big Stories

Advertisement
×