E-Paper
Advertisement

CSK జ‌ట్టులో మ‌ళ్లీ ఫిక్సింగ్ క‌ల‌కలం..ఒక్క లీక్ రూ.70 ల‌క్ష‌లు ?

CSK జ‌ట్టులో మ‌ళ్లీ ఫిక్సింగ్ క‌ల‌కలం..ఒక్క లీక్ రూ.70 ల‌క్ష‌లు ?
Advertisement

Fixing On CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 సీజన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో 10 ఫ్రాంచైజీలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఎలాగైనా టైటిల్ నెగ్గాలనే కసితో ముందుకు వెళ్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గురించి సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి. మ్యాచ్ ప్రారంభాని కంటే ముందే… తుది జట్టులో ఏ ప్లేయర్లు ఆడుతున్నారనే విషయాన్ని CSK కు సంబంధించిన కొంతమంది వ్యక్తులు లీక్ చేస్తారని ఓ కథనం బయటకు వచ్చింది. 60 నుంచి 70 లక్షలు ఇస్తే, చెన్నై సూపర్ కింగ్స్ స్క్వాడ్ వివరాలను టాస్ పడే 30 నిమిషాల ముందు, ప్రత్యర్థి జట్టుకు చెబుతారని వార్తలు వస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో పనిచేసే సిబ్బంది.. లేదా ప్లేయర్లే ఈ విషయాన్ని లీక్ చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ న్యూస్ బయటకు వచ్చిన నేపథ్యంలో… మళ్లీ ఐపీఎల్ ఫిక్సింగ్ అంశం తెరపైకి వచ్చింది.

ఫిక్సింగ్ కలకలం.. చెన్నై సూపర్ కింగ్స్ పై రెండు సంవత్సరాల బ్యాన్

ఫిక్సింగ్ కలకలం రేపిన నేపథ్యంలో ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ పై రెండు సంవత్సరాల పాటు బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. 2013 సంవత్సరంలో జరిగిన ఐపీఎల్ సందర్భంగా తెరపైకి మ్యాచ్ ఫిక్సింగ్ వచ్చింది. అయితే ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అడ్డంగా ఇరుక్కుంది. ఈ అంశం ఆలస్యంగా బయటకు రావడంతో 2016 తో పాటు 2017 ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పై బ్యాన్ విధించారు. ఆ తర్వాత ఎప్పటిలాగే చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ కొనసాగింది.

Advertisement

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు

మళ్లీ తెరపైకి ఫిక్సింగ్ అంశం

ఇప్పటికే బ్యాన్ ఎదుర్కొన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టును మళ్లీ ఫిక్సింగ్ అంశం కుదిపేస్తోంది. మ్యాచ్ ప్రారంభం కాకముందే.. 11 మంది సభ్యుల స్క్వాడ్ ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్న కొంతమంది లీక్ చేస్తారట. ప్రత్యర్థికి సమాచారం అందిస్తారట. ఈ ఒక్క లీక్ ద్వారా 60 నుంచి 70 లక్షలు వసూలు చేస్తున్నారట. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో (CSK) ఉన్న ఒక సభ్యుడు ఈ పని చేస్తున్నట్లు తాజాగా న్యూస్ బయటకు వచ్చింది.

Advertisement

ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీనిపై క్రికెట్ అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును టార్గెట్ చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఏది జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకే అంటగడుతున్నారని.. వాళ్లు తప్పులు చేయకున్నా, అబాండాలు వేస్తున్నారని సీరియస్ అవుతున్నారు. అయితే మరికొంతమంది మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఫిక్సింగ్ అలవాటేనని.. రెండు సంవత్సరాల బ్యాన్ విధించిన కూడా సిగ్గు రాలేదని పోస్టులు పెడుతున్నారు.

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు !

Related News

ఐపీఎల్ వ‌ల్లే, ఆస్ట్రేలియా క్రికెట‌ర్ల పొగ‌రు దిగింది..రాబిన్ ఉతప్ప సంచ‌ల‌నం

మా పాకిస్తాన్ ప్లేయర్లు కోతుల కంటే దారుణం… వాటి కంటే ఎక్కువ అరటి పండ్లు మెక్కుతున్నారు !

బాబర్ ఆజంను విమర్శిస్తే, పళ్ళు రాలగొడతా… వసీం అక్రమ్ కు తన్వీర్ అహ్మద్ హెచ్చరిక

CSK కోచ్ గా జ‌హీర్ ఖాన్…ఆందోళ‌న‌లో ధోని ఫ్యాన్స్ ?

రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు

నా బౌలింగ్ దెబ్బకు ధోని మైండ్ బ్లాకై…క్లీన్ బౌల్డ్ అయ్యాడు

బీహార్‌లో పుట్టి పెరిగాడు..ఇప్పుడు జపాన్ తరఫున ఆడుతున్నారు, ఇంతకీ ఎవరీ అభిషేక్ ఆనంద్ ?

Big Stories

Advertisement
×