Singer Pravasthi: ప్రస్తుతం టాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది సింగర్ ప్రవస్తి ఆరాధ్య ఇష్యూ. బుల్లితెరపై ఎన్నో సింగింగ్ రియాలిటీ షోలు ప్రేక్షకులను మెప్పిస్తూ మంచి రేటింగ్‌తో దూసుకుపోతున్నాయి. అలాంటి షోలకు విపరీతమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది. కానీ అసలు ఈ రియాలిటీ షోలు ఎలా రన్ అవుతాయి, అందులో కంటెస్టెంట్స్ ఎదుర్కునే కష్టాలు ఏంటి అని ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. అవన్నీ ఒక్కసారిగా బట్టబయలు చేస్తూ ప్రవస్తి అనే సింగర్.. తన తోటి సింగర్స్‌పై, జడ్జిలపై, మ్యూజిక్ ఇండస్ట్రీలోని పలువురు లెజెండ్స్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. అంతే కాకుండా తను చెప్పిందంతే నిజమే అని ఎప్పటికప్పుడు నిరూపించడానికి ప్రయత్నిస్తోంది.
ఎలిమినేట్ అవ్వడం వల్లే
బుల్లితెరపై ప్రసారమయ్యే ‘పాడుతా తీయగా’ సింగింగ్ షోను ఇప్పటికీ చాలామంది ప్రేక్షకులు ఇష్టంగా చూస్తారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించిన ఈ షో.. ఇప్పటికే 24 సీజన్స్ పూర్తిచేసుకుంది. ఆయన లేకపోయినా ఆయన వారసుడు అయిన ఎస్పీ చరణ్ ఈ షోకుహోస్ట్‌గా వ్యవహరిస్తూ దీనిని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఇందులో మునుపటి సీజన్‌లో కూడా ఒకసారి కంటెస్టెంట్‌గా కనిపించి అలరించిన సింగర్ ప్రవస్తి.. తాజాగా ప్రారంభమయిన సీజన్‌లో మరోసారి కంటెస్టెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈసారి తను త్వరగానే ఎలిమినేట్ అయిపోయింది. ఎలిమినేట్ అయిన మరుసటి రోజు నుండి ఈ షోపై తీవ్ర ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది.
ఆధారాలతో సహా
షోలో తమకు నచ్చిన పాటలు పాడాలని, తమకు నచ్చిన కాస్ట్యూమ్స్ వేసుకోవాలని ప్రొడక్షన్ హౌస్ వాళ్లు బలవంతపెడతారని ప్రవస్తి ఆరోపణలు చేసింది. అయితే తను చేసిన ఆరోపణలపై జ్ఞాపిక ఎంటర్‌టైన్మెంట్స్ క్లారిటీ ఇచ్చేసింది. జోనర్‌కు తగిన పాటలు, ఆ పాటకు తగిన కాస్ట్యూమ్స్ సింగర్స్ సెలక్ట్ చేసుకునే అవకాశం ఉందని చెప్పింది. అయితే ఎంఎం కీరవాణి పాటలు పాడితేనే షోలో ఎక్కువ మార్కులు వేస్తారని మరొక స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది ప్రవస్తి. ఈ విషయాన్ని ఇతర జడ్జిలతో పాటు నిర్మాణ సంస్థ కూడా ఖండించింది. కానీ తను చెప్పింది నిజమే అని నిరూపించడం కోసం ఒక వాట్సాప్ చాట్‌ను లీక్ చేసింది ప్రవస్తి ఆరాధ్య (Pravasthi Aaradhya).
Also Read: ప్రవస్తికి గట్టిగా తగిలేట్టుగానే ఇచ్చిన సునీత.. ఫ్యూజులు అవుట్ అయినట్టే.?
వాట్సాప్ చాట్ బయటికి
ఆ వాట్సాప్ చాట్‌లో తను ఎవరితో చాట్ చేస్తుందన్న విషయాన్ని చూపించకుండా కేవలం మెసేజ్‌లను మాత్రం చూపించింది ప్రవస్తి. అసలు తనకు షోలో మెలోడీ పాటలు పాడే ఛాన్సే ఇవ్వలేదని చెప్పుకొచ్చింది. నిర్మాతలు ఎన్ని రూల్స్ పెట్టినా అవి ఒక కంటెస్టెంట్‌కు మాత్రం వర్తించవు అని, తను మాత్రం తనకు నచ్చిన పాటలు మాత్రమే పాడుతుందని ఆ కంటెస్టెంట్ పేరు రివీల్ చేయకుండా ఆరోపణలు చేసింది. ‘‘ఒక సాడ్ సాంగ్‌కు షిమ్మరింగ్ డ్రెస్ ఇచ్చి వేసుకోమన్నారు, బాడీ షేమింగ్ చేశారు. లాలూ దర్వాజ పాట కోసం కాస్ట్యూమ్‌ను అయిదుసార్లు మార్చకోమన్నారు’’ అంటూ జ్ఞాపిక ఎంటర్‌టైన్మెంట్స్ ప్రవీణ పెట్టిన వీడియోకు రిప్లై ఇచ్చింది ప్రవస్తి.