E-Paper
Advertisement

కోర్టు చుట్టూ తిరుగుతున్న పల్లవి ప్రశాంత్.. రెండేళ్లయినా ఆగని తిప్పలు!

కోర్టు చుట్టూ తిరుగుతున్న పల్లవి ప్రశాంత్.. రెండేళ్లయినా ఆగని తిప్పలు!
Advertisement

Pallavi Prashanth: బిగ్ బాస్ టైటిల్ గెలిచినా ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను అంటూ బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి సామాన్యుడిగా హౌస్ లోకి అడుగుపెట్టి శివాజీ సహకారంతో ఏకంగా టైటిల్ గెలిచిన పల్లవి ప్రశాంత్ ఎందుకు ఈ మాటలు అంటున్నాడు? అసలు ఏం జరిగింది? అనే విషయాలు ఆయన మాటల్లోనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతున్న పల్లవి ప్రశాంత్..

బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు టైటిల్ విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సామాన్యుడిగా హౌస్ లోకి అడుగుపెట్టి అద్భుతమైన ప్రదర్శనతో టైటిల్ సొంతం చేసుకోవడంతో పాటు కారు, నెక్లెస్ ను కూడా బహుమతులుగా అందుకున్నారు. అయితే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. బిగ్ బాస్ టైటిల్ గెలిచినా సరే తనకు ప్రశాంతత లేదని చెప్పుకొచ్చారు. పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ..బిగ్ బాస్ టైటిల్ విజేతగా నిలిచిన తర్వాత ఎంతో సంతోషపడ్డాను. కానీ ఆ సంతోషం కొన్ని రోజుల్లోనే ఆవిరైపోయింది.

Advertisement

also read:ఓటీటీలోకి రానున్న కొరియన్ కనకరాజు.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

మొన్న కూడా కోర్టుకు వెళ్లొచ్చాను..

ముఖ్యంగా ఆరోజు జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఇప్పటికీ నేను కోర్టు చుట్టూ తిరుగుతున్నాను. రెండు రోజుల క్రితం కూడా కోర్టుకు వెళ్లి వచ్చాను. ఆ సంఘటన నన్ను ఇప్పటికీ వేధిస్తోంది. బిగ్ బాస్ ప్రైజ్ మనీ గిఫ్ట్స్ వెనక కూడా భారీ మోసం ఉందని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. రూ.35 లక్షలు ప్రైజ్ మనీ అని ప్రకటించారు. అయితే ఆ రూ
.35 లక్షల్లో 40% జిఎస్టి కట్ అయింది. ఇక కారు గిఫ్ట్ అని చెప్పారు . అక్కడికి వెళ్తే రూ 8.5 లక్షలు కట్టాలి. లేకపోతే ఈ కార్ ఇవ్వము అన్నారు .ఎందులో నుంచి ఇవ్వాలి.. నెక్లెస్ విషయానికి వస్తే టీం గిఫ్ట్ అన్నారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత 5 లక్షలు కట్టాలని చెప్పారు. గిఫ్ట్ ట్యాక్స్ ఇలానే ఉంటుందన్నారు.. ఏందన్నా ఇదంతా అని అడిగితే రూల్స్ అని చెప్పారు అంటూ పల్లవి ప్రశాంత్ ఆవేదన వ్యక్తం చేశారు.

పల్లవి ప్రశాంత్ చెబుతున్నది నిజమేనా?

Advertisement

పల్లవి ప్రశాంత్ పాల్గొన్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రైజ్ మనీ మొత్తం రూ.50 లక్షలు. కానీ ఇదే సీజన్లో ఫైనల్ వరకు వచ్చిన ప్రిన్స్ యావర్.. సూట్ కేస్ తీసుకొని స్వచ్ఛందంగా బయటకు వచ్చారు. అందులో రూ.15 లక్షలు ఉన్నాయి. ఈ మొత్తం పోగా ప్రశాంత్ కు మిగిలింది 35 లక్షలు మాత్రమే. ఇందులో 40 శాతం జీఎస్టీ కటింగ్ అంటే 14 లక్షలు పోతుంది. కారుకి 8.5 లక్షలు , నెక్లెస్ కి మరో 5 లక్షలు.. మిగిలింది 7.5 లక్షలు మాత్రమే అని ప్రశాంత్ చెబుతున్నాడు. అయితే ఇతను చెబుతున్నది నిజమా? అబద్దమా? అనేది అర్థం కావట్లేదు. కానీ బిగ్ బాస్ యాజమాన్యం వైపు నుంచి ఈ విషయంపై ఖచ్చితంగా క్లారిటీ రావాలని బిగ్ బాస్ ప్రియులు కామెంట్లు చేస్తున్నారు.

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆస్తుల చిట్టా బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

సుప్రీత ఇండస్ట్రీకి రావడం వెనుక అతని ప్రమేయం ఉందా? ఆయన కోరిక నెరవేర్చారా??

Big Stories

Advertisement
×