Dhee 20 : డాన్సర్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షో ఢీ.. బుల్లితెర ప్రముఖ తెలుగు ఛానల్ ఈటీవీలో ఈ షో ప్రసారం అవుతుంది. ఈ షో ద్వారా ఇప్పటికే ఎంతోమంది డాన్సర్లుగా కెరియర్ను స్టార్ట్ చేశారు. కొంతమంది మళ్లీ మళ్లీ ఈ షో కి వస్తువు తమ టాలెంట్ నిరూపించుకుని కప్పు కొట్టాలని ట్రై చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ షో 20వ సీజన్ మొదలైంది. గతంలో లాగా కాకుండా ఈ సీజన్ కొత్తగా ఉందని ప్రస్తుతం ఎపిసోడ్ లని చూస్తే తెలుస్తుంది. ఈ షోలో కంటెస్టెంట్ గా పండు మాస్టర్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా డీలో కనిపిస్తున్న పండు మాస్టర్ ఇప్పటివరకు కూడా కప్పు కొట్టలేదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యలో కచ్చితంగా ఈ సీజన్లో కప్పు కొడతానని నమ్మకంగా చెప్పాడు. కానీ ఇంతలోనే డి యాజమాన్యం అతనికి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చిందని తెలుస్తుంది. అసలేం జరిగింది అన్నది ఒకసారి మ్యాటర్ లోకి వెళ్లి తెలుసుకుందాం..
ఢీ నుంచి మాస్టర్ అవుట్..
పండు మాస్టర్ ఒక డాన్సర్ గా మాత్రమే కాదు.. ఒక నటుడుగా ప్రేక్షకులను తన నటనతో కడుపుబ్బా నవ్విస్తుంటాడు. పండు మాస్టర్ కామెడీ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. ఆయన ఏషాలో కనిపిస్తే ఆ షో హైలెట్ అవుతుంది.. కప్ కొట్టే రేంజ్ లో ఆయన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఈమధ్య కాలం లో ఉంటున్నాయి. ముఖ్యంగా రీసెంట్ గానే ఆయన వేసిన ‘ఇటుక మీద ఇటుక’ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనమంతా చూసాము. యూట్యూబ్ లో ఆయన చేసిన ఒక పాట జనాలను బాగా ఆకట్టుకుంది. ఆ పాటతో ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. దాంతో పండు మాస్టర్ కి రియాల్టీ షోలో అవకాశం వచ్చిందని తెలుస్తుంది. మరి అశోక్ కోసం ఢీ నీ వదిలేస్తాడేమో చూడాలి..
Also Read : వినాయక చవితి స్పెషల్.. టీవీల్లోకి రాబోతున్న సూపర్ హిట్ చిత్రాలు..
బిగ్ బాస్ లోకి పండు..
మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో పండు మాస్టర్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు. ఇప్పటికే దీనిపై ఎన్నో వార్తలు బయటకు వచ్చాయి. బిగ్ బాస్ యాజమాన్యం అడిగారట. ఆయన రావడానికి ఇంకా ఒప్పుకోలేదు కానీ, అలా అని నో కూడా చెప్పలేదని తెలుస్తుంది. ఎందుకంటే ఈ సీజన్ మొదలైన నాలుగు వారాల తర్వాత వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా పండుని లోపలకు పంపాలని బిగ్ బాస్ టీం అనుకుంటున్నారట. ఆలోపు ఢీ షో కూడా పూర్తవుతుంది. సార్ ఎలాగైనా సరే కప్పు కొట్టాలని పండు కల మరి ఆ కల నెరవేరకుండా పోతుందా? లేదా పండు మాస్టర్ ఆ లోపు కప్పు కొడతాడు అన్నది సస్పెన్స్ గా మారింది. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయక తప్పదు..
.