E-Paper
Advertisement

రూ.25 కోట్ల ఆస్ట్రేలియా ఆల్ రౌండ‌ర్ ను చెడుగుడు ఆడేసుకున్న‌ బంగ్లా బౌల‌ర్

రూ.25 కోట్ల ఆస్ట్రేలియా ఆల్ రౌండ‌ర్ ను చెడుగుడు ఆడేసుకున్న‌ బంగ్లా బౌల‌ర్
Advertisement

Taskin Ahmad Celebration after dismissing Cameron Green: ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ ( Australia vs Bangladesh) మధ్య టెస్టు సిరీస్ (Bangladesh tour of Australia, 2026) ఇవాళ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఇవాళ డార్విన్ మరారా క్రికెట్ మైదానం ( Marrara Cricket Ground, Darwin ) వేదికగా రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ ఉదయం 6 గంటల ప్రాంతంలో షురూ అయింది. ఇందులో టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా, మొదట బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. మొదటి రోజు 100 లోపే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా, 200 పూర్తి చేయకముందే 8 వికెట్లు నష్టపోయింది. మరో ఐదు లేదా ఆరు ఓవర్లలో ఆల్ అవుట్ అయ్యే ప్రమాదం పొంచి ఉంది. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్లు ఇరగదీస్తున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు.

కామెరాన్ గ్రీన్ వికెట్.. గ‌ల్లీ స్టెప్పులు వేసిన టాస్కిన్ అహ్మ‌ద్

ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మొదటి టెస్ట్ జరుగుతున్న నేపథ్యంలో టాస్కిన్‌ అహ్మద్‌ (Taskin Ahmed) అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు రెండు కీలక వికెట్లు పడగొట్టిన అహ్మద్, ఆస్ట్రేలియా బ్యాటర్లకు నరకం చూపిస్తున్నాడు. ఇక ముఖ్యంగా ఐపీఎల్ లో రూ. 25 కోట్లు పలికిన కామెరాన్ గ్రీన్ ( Cameron Green ) వికెట్ కూడా టాస్కిన్‌ అహ్మద్‌ పడగొట్టాడు. టాస్కిన్ అహ్మద్ బౌలింగ్ లో ముష్ఫికర్ రహీమ్ ( Mushfiqur Rahim )కు క్యాచ్ ఇచ్చి, 13 పరుగుల వద్ద కామెరాగ్రీన్ ఔట్ అయ్యాడు. గ్రీన్ వికెట్ తీసిన తర్వాత, అతడిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు టాస్కిన్ అహ్మద్. అతన్ని చూస్తూ ఎగతాళి చేశాడు. అసభ్యకరమైన సైగలు చేస్తూ సెలబ్రేషన్స్ కూడా చేశాడు. గ‌ల్లీలో వేసే స్టెప్పులు వేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై ఆస్ట్రేలియన్ క్రికెట్ ప్యాన్స్‌ సీరియస్ అవుతున్నారు.

Advertisement

Harbhajan singh On Ind Vs Ban: బంగ్లాదేశ్ ను కూడా పాకిస్తాన్ లాగానే ట్రీట్ చేయండి..వాళ్లు కూడా మ‌న‌కు శ‌త్రువులే

ఒరేయ్ టాస్కిన్‌ అహ్మద్…తేడా వ‌స్తే, ఆస్ట్రేలియాలోనే పాతేస్తారు రా

ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ జరుగుతున్న నేపథ్యంలో కామెరాన్‌ గ్రీన్ వికెట్ పడగొట్టాడు టాస్కిన్ అహ్మద్. ఈ సందర్భంగా ఓవరాక్షన్ చేస్తూ స్టెప్పులు కూడా వేశాడు. గ్రీన్ ను రెచ్చగొట్టేలా అసభ్యకరమైన సైగలు చేశాడు. ఈ తరుణంలో టాస్కిన్ అహ్మద్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు క్రికెట్ అభిమానులు. ఆస్ట్రేలియా గడ్డపై మీరు వేస్తేనే వికెట్లు వేగంగా పడుతున్నాయి.. ఇక కంగారులు బరిలోకి దిగితే, మీరు తట్టుకోవడం కష్టమేనని అంటున్నారు. ఆస్ట్రేలియా జట్టులో పాట్ కమ్మిన్స్, జోష్ హేజిల్ వుడ్, స్టార్క్, బోలాండ్ లాంటి భయంకరమైన బౌలర్లు ఉన్నారు.. వాళ్లు బౌలింగ్ కు దిగారంటే.. బంగ్లాదేశ్ బ్యాటర్లకు 150 డిగ్రీల జ్వరం రావడం గ్యారెంటీ అని హెచ్చరిస్తున్నారు. అన‌వ‌స‌రంగా కంగారుల‌ను గెల‌కొద్ద‌ని వార్నింగ్ ఇస్తున్నారు.

Advertisement

National Champions Cup 2026: వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం వేసిన PCB ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాఫ్‌..గ్రౌండ్ లోనే కుప్ప‌కూలుతోన్న పాక్ ప్లేయ‌ర్లు !

 

Related News

స్టీవ్ స్మిత్ అల్ట్రాఎడ్జ్ పై వివాదం..పెవిలియ‌న్ కు వెళ్లిన వాడిని మ‌ళ్లీ పిలిచిన అంపైర్లు

ఏషియ‌న్ గేమ్స్ లో దిక్కుమాలిన రూల్స్‌…టీమిండియాకు అన్యాయం, సేఫ్ జోన్ లో పాక్ ?

కంగారులు కాదు, వాళ్లు న‌ర‌రూప రాక్ష‌సులు…బంగ్లా బ్యాట‌ర్ల‌కు ఇక న‌ర‌క‌మే

బంగ్లాదేశ్ ను కూడా పాకిస్తాన్ లాగానే ట్రీట్ చేయండి..వాళ్లు కూడా మ‌న‌కు శ‌త్రువులే

వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం వేసిన PCB ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాఫ్‌..గ్రౌండ్ లోనే కుప్ప‌కూలుతోన్న పాక్ ప్లేయ‌ర్లు !

రాసి పెట్టుకోండి..ఐర్లాండ్ లాగానే టీమిండియాను ఆఫ్ఘ‌నిస్తాన్ చిత్తుగా ఓడిస్తుంది

సాధ్య‌మైనంత వ‌ర‌కు ఇంగ్లీష్ మీడియాకు దూరంగా ఉండు..బాబ‌ర్ కు అక్త‌ర్ హెచ్చ‌రిక‌

Big Stories

Advertisement
×