Bigg Boss 10 Telugu Sudheer Reddy: బిగ్ బాస్ సీజన్ 10 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న వారిలో ప్రముఖ యాంకర్ సుధీర్ రెడ్డి (Sudheer Reddy)ఒకరు. పాడ్ కాస్ట్ నిర్వహిస్తూ ఎంతో మంది ప్రముఖలను ఇంటర్వ్యూ చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న సుధీర్ రెడ్డి ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఇలా హౌస్ లో తనదైన శైలిలోనే టాస్కులు ఆడుతూ మంచి కంటెంట్ ఇస్తున్నారు. ఇకపోతే నేడు సుధీర్ రెడ్డి పుట్టినరోజు(Birthday) కావడంతో బయట ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సుధీర్ పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేస్తున్నారు.
సుధీర్ రెడ్డి సొంత ఊరు నంద్యాల అనే విషయం అందరికీ తెలిసిందే .ఈ నేపథ్యంలోనే ఆయన అభిమానులు నంద్యాలలో సుదీర్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని(Blood Donation camp) ఏర్పాటు చేశారు. సుధీర్ తన 32వ పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో స్నేహితులు, అభిమానులు ఈ గొప్ప పనికి శ్రీకారం చుట్టారు. సుధీర్ 32వ పుట్టినరోజు సందర్భంగా ఏకంగా 32 మందికి పైగా ఈ బ్లడ్ డొనేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ బ్లడ్ డొనేషన్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పుట్టినరోజు అంటే కేవలం సెలబ్రేషన్స్ మాత్రమే కాదని సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించాలని సుధీర్ స్నేహితులు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక తమ స్నేహితుడు కచ్చితంగా బిగ్ బాస్ కార్యక్రమంలో విజేతగా తిరిగి రావాలని కోరుకున్నారు. అలాగే ఇప్పటివరకు తనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా సుధీర్ స్నేహితుల కృతజ్ఞతలు తెలుపుతూ సుధీర్ కు పూర్తి మద్దతు తెలియజేయాలని కోరారు.సుధీర్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా ఈయన అభిమానులు కూడా తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
సుధీర్ పుట్టినరోజు సందర్భంగా ఈయన తల్లిదండ్రులు కూడా తమ కొడుకుకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతూ బిగ్ బాస్ లో విజేతగా తిరిగి రావాలని కోరుకున్నారు. హౌస్ లో తన అద్భుతమైన ఆట తీరును కనబరిస్తూ ఉన్నారు ఎలాంటి విషయాలలో జోక్యం చేసుకోకుండా తనకు కరెక్ట్ అనిపించిన విషయాన్ని ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉన్నారు అయితే గతవారం కంటెస్టెంట్ సృష్టితో సుధీర్ రెడ్డికి జరిగిన గొడవ కారణంగా సుధీర్ కు భారీ స్థాయిలో మద్దతు లభిస్తూ మరింత క్రేజ్ పెరిగిందని చెప్పాలి. మరి ఈ కార్యక్రమంలో సుధీర్ ఎన్ని వారాలపాటు హౌస్ లో కొనసాగుతారు విజేతగా బయటకు వస్తారా అనేది తెలియాల్సి ఉంది.
?stkn=MWhxcm5pd2Y1M3A0Nw==
Also Read: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి.. అడుక్కోవడానికి కాదు..మదర్ సెంటిమెంట్ తో ‘స్లమ్ డాగ్ ‘ గ్లింప్స్!