E-Paper
Advertisement

Podarillu Today Episode : శైలుకు రేపే పెళ్లి.. మహాను చూసి ఫిదా.. పెద్దోడికి జోడీ దొరికేసిందా..?

Podarillu Today Episode : శైలుకు రేపే పెళ్లి.. మహాను చూసి ఫిదా.. పెద్దోడికి జోడీ దొరికేసిందా..?
Advertisement

Podarillu Today Episode august 15th: మహాలక్ష్మి గదిలోకి వెళ్ళగానే తాయారు వెనకాలే గదిలోకి వస్తుంది. ఏంటి నువ్వు ఇక్కడ పడుకుంటున్నావు అని మహాలక్ష్మి అడుగుతుంది. గ్యాస్ స్టవ్ తీసుకున్నట్లుగానే ఈ గదిని కూడా మీరు తీసుకోవాలని అనుకుంటున్నారా అని అడుగుతుంది మహా.. నీకు చక్రికి పెళ్లయింది కదా.. మరి మీరిద్దరూ ఒకే గదిలో పడుకోకుండా ఇలా విడివిడిగా పడుకుంటున్నారు ఏంటి అని తాయారు అనుమానంగా అడుగుతుంది. ఆ ఇద్దరికీ పెళ్లయింది గొడవ కూడా అయింది అందుకే నేను తన దగ్గర పడుకోను అని మహాలక్ష్మి ఏదో ఒకటి చెప్పి తాయారుని అక్కడి నుంచి పంపిస్తుంది.. ఇక ఉదయం లేవగానే అందరూ గుడి కోసం రెడీ అయ్యి బయటకు వస్తారు.. కన్నా మాధవని ఆడుకుంటాడు అలాగే చక్రి రెడీ అవ్వడం చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా బాగున్నావ్ రా అని అంటారు.. మహాలక్ష్మి చీరలో రావడం చూసి చక్రీతో పాటు మిగిలిన వాళ్ళందరూ షాక్ అవుతారు..

మహాకు చక్రీ సర్ప్రైజ్..

చక్రి మహాను చూసి చాలా అందంగా ఉంది దేవతలాగా ఉంది అని పొగడ్తల వర్షం కురిపిస్తాడు. గుడికి వెళ్లాలంటే కచ్చితంగా మీ వదిన చీర కట్టుకుని వస్తుందని నేను అనుకున్నాను రా నా సిక్స్త్ సెన్స్ చెప్పింది అందుకే తను అలానే చీరలోనే వచ్చింది చూశారా అని చక్రి చాలా సంతోషంగా ఉంటాడు. నీకోసం నేను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చాను అని చక్రి అంటాడు. మహాలక్ష్మి కోసం మల్లెపూలను తీసుకొని వచ్చి చక్రి ఇస్తాడు. థాంక్స్ అండి నేనే మల్లెపూలు కావాలి అని అడుగుదాం అనుకున్నాను. కానీ ఇక్కడ ఎక్కడ దొరుకుతాయి అర్థం కాలేదు అందుకే మల్లెపూలు దొరకలేదని అనుకున్నాను. ఇక్కడ కూడా దొరకలేదండి వేరే ఇంట్లో మల్లె చెట్టు ఉంది. అక్కడ నేను పువ్వులను కోస్తాను అల్లి ఇస్తారా అని ఆవిడని అడిగితే ఆవిడ సరే అంది.ఆ పువ్వులన్ని నేను తెంపిస్తే ఆవిడ నాకు దండ కట్టించింది అని చక్రి అనగానే మీరు చాలా మంచి పని చేశారు అని మహాలక్ష్మి పొగిడేస్తుంది..

రెండు జంటలు భలే ఉన్నాయిగా..

Advertisement

మహాలక్ష్మి చాలా బాగుంది అని చక్రి మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే కన్నా అన్నయ్య వదిన పక్కకి జరుగు నేను మీ ఇద్దరికీ తెలియకుండా ఫోటో తీస్తాను అని అంటాడు. కానీ చక్రి మాత్రం భయపడిపోతూ ఉంటాడు. ఒకవేళ మీ వదినకు తీస్తే నన్ను చంపేస్తుంది రా అని అంటాడు. కానీ కన్నా మాత్రం నేను తెలియకుండా తీస్తాను అని అనడంతో సరే అని అంటాడు.. చక్రి మహాలక్ష్మికి ఫోటో తీసిన కన్నాను కేశవ ఆజంట కూడా చాలా బాగుంది వాళ్లకి కూడా ఒక ఫోటో తీరా అని అంటాడు. ఇక వాళ్లకి తెలియకుండా మనిషా మాధవ్ ఫోటోని కన్నా తీస్తాడు. రెండు జంటలు చాలా బాగున్నాయి అని ఇద్దరు సంతోషంగా అనుకుంటారు.

చక్రీతో మహా ప్రేమలో పడుతుందా..?

చక్రి ఈమధ్య ఎంతగా మంచి పనులు చేస్తున్నాడు అంటే మహాలక్ష్మి చక్రిపై ఒక్క మాట కూడా పడనివ్వట్లేదు. ఎవరైనా చక్రీని ఏమైనా అంటే అస్సలు ఊరుకోదు. ఏం చేయాలనుకున్నా కూడా చెక్రి చాలా మంచివాడు అని పొగిడేస్తూ ఉంటుంది. ఈమధ్య పరిస్థితులను చూస్తూ ఉంటే చక్రి మనసులో మహాలక్ష్మి ఉన్నట్లే.. తన మనసులో కూడా చక్రిని ఊహించుకుంటుందని అర్థమవుతుంది. ప్రేమ ఎప్పుడు ఎవరి మనసులో పడుతుందో తెలియదన్నట్లుగా మహాలక్ష్మి చక్రిని ఎవరైనా ఏమైనా అంటే అసలు ఊరుకోకుండా ఉంటుంది. ఇంట్లోని వాళ్ళందరూ కూడా మహాలక్ష్మి చక్రిని ప్రేమిస్తుందేమో అని అనుకుంటారు. ఈ జంటను చూస్తుంటే త్వరలోనే ప్రేమించుకుంటారేమో అని అర్థమవుతుంది. మొత్తానికి అతి త్వరలోనే చక్రి మహాలక్ష్మి ఒక్కటైపోతారు. ఇక వీళ్లిద్దరూ కలిసి పోతే ఆ తర్వాత సీరియల్ ఎలా ఉంటుంది అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.

తాయారు దెబ్బకు షాక్..

Advertisement

ఇక అందరూ రెడీ అయ్యి హాల్లో ఉండగా గాయత్రి వాళ్ళు కూడా రెడీ అయ్యి వస్తారు. అయితే ఇద్దరూ రెడీ అయ్యి రావడంతో మనం అందరం కలిసి గుడికి వెళ్దాము అని గాయత్రి అంటుంది. కానీ గాయత్రీ ఆ మాట అన్న తర్వాత తాయారు గాయత్రి పై సీరియస్ అవుతుంది. అయితే ఎందుకు నువ్వు ఇలా అంటున్నావు అందరం వెళ్లేది గుడికి కదా అని గాయత్రి ఎంత చెప్పాలని చూసినా కూడా తాయారు మాత్రం గాయత్రి కాపురంలో నిప్పులు పోస్తారేమో అని అనుమానంతో మన పూజలు వేరు మన మొక్కులు వేరు వాళ్ళ పూజలు.. వేరు వాళ్ళ మొక్కులు వేరు అని అంటుంది. ఇక మాధవ్ వాళ్లు మీరు వెళ్ళండి. మేము తర్వాత వస్తాము అని అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: రోహిణి మనసులో ఇంత కుట్ర.. కన్నీళ్లు తెప్పించే సీన్.. బాలు ప్లాన్ వర్కౌట్ అయ్యిందా..?

Related News

బిగ్ బాస్ 10.. ఈ వారం నామినేషన్ లోకి 9మంది.. మరి డేంజర్ జోన్ లో?

Gundeninda GudiGantalu Today episode: చింతామణికి దిమ్మతిరిగే షాక్.. మీనా ఫుల్ హ్యాపీ.. ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : చక్రీ మాటతో గోపిక షాక్.. బాధపడ్డ మాధవ్.. లక్కీ, విక్కీ లవ్ ట్రాక్..

మా బంధం ముగిసిపోయింది..రీతూ – పవన్ బ్రేకప్.. ఏమైందంటే..?

Illu Illaalu pillalu Srivalli : శ్రీవల్లి అవుట్.. చందుకు కొత్త జోడిగా ఎవరంటే..?

Illu Illalu Pillalu Today Episodes: భద్రకు ప్రేమ దిమ్మతిరిగే షాక్.. తండ్రిగా మారిన తిరుపతి.. వల్లికి కొత్త టెన్షన్..

Intinti Ramayanam Today Episode: మీనాక్షిని మోసం చేసిన పల్లవి.. పార్వతికి పల్లవి పై అనుమానం.. కమల్ కు షాక్..

Ninnu kori Serial Today Episode September 30th ‘నిన్ను కోరి’ సీరియల్‌: రైస్ మిల్లు లెక్కల్లో రెండు లకలు తేడా చూపించిన చంద్ర  

Big Stories

Advertisement
×