Podarillu Today Episode august 29th :శైలు కేశవ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా కన్నా అలాగే చక్రి అక్కడికి వెళ్తారు.. ఏమైంది ఎందుకు ? మీరిద్దరూ ఇలా సడన్గా వచ్చారు అని శైలు అడుగుతుంది. చక్రి వాళ్ళిద్దరి మధ్య ఎలాగైనా చిచ్చు పెట్టాలి అని అనుకుంటాడు. అయితే బస్ స్టాప్ లో ఒక అమ్మాయి నేను చూసి ప్రేమిస్తుంది. అంటరా ఆ నీ నెంబర్ ఇవ్వమని అడిగింది ఇవ్వమంటావా? అని శైలు ముందరే చక్రి అడగడంతో శైలు వాడికి గర్ల్ ఫ్రెండ్ అన్న సంగతి మీకు తెలియదా మీరు ఎందుకు అలా చెప్పారు అంటూ కోపంతో ఊగిపోతుంది.. ఇక వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలి అని అక్కడికి వెళుతుంది శైలు. ఆ తర్వాత శైలు వాళ్ళతో గొడవ పడగానే ప్రేమించింది కేశవాణి కాదు చక్రీని అని ఆ అమ్మాయి వాళ్ళు నిజం చెప్పేస్తారు.
మాధవ్ పెళ్లి సంబంధం చూడటానికి అని పెళ్లిళ్ల పేరయ్య ఇంటికి రావడంతో నారాయణ మళ్లీ ఎందుకు వచ్చావు.. ఎలాంటి సంబంధం తీసుకొచ్చావు నువ్వు తెచ్చావని ఇలానే ఉంటాయా అంటూ అతనితో అనడంతో నేను మాధవిని కలవాలి అని అతను లోపలికి వెళ్ళిపోతాడు.. వెనకాలే మహాలక్ష్మి రావడం చూసి నారాయణకు షాక్ తగులుతుంది. ఒక్కసారి ఇన్ని బీడీలు కలుస్తావా నేను వచ్చే టైంకి ఎప్పుడు ఇన్ని ఉండవు కదా మరి ఇవేలా వచ్చాయి అని అడుగుతుంది. ఇక లోపలికి వెళ్లిన బ్రోకర్ మాధవకు సంబంధం గురించి చెప్తాడు. ఆ అమ్మాయి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది మీరు మళ్లీ ఆలోచించుకొని చెప్పండి అని అతను చెప్పగానే.. నాకు పెళ్లి ఇష్టమే చేసుకుంటాను అని మాధవ్ చెప్తాడు..
శైలు కేశవ దగ్గరికి వెళ్లి నువ్వు ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది. నాది అంత బాడ్ టెస్ట్ కాదు నేను ప్రేమించేది మిమ్మల్ని కాదు మీ అన్నయ్య చక్రిని అని చెప్పగానే కేశవ ఒక్కసారిగా షాక్ అవుతాడు.. ఏంటి వాడు నీకు నచ్చాడా ఎప్పుడు ఎక్కడ కలిశారు అని కేశవ అడుగుతాడు.. అతని క్యాబ్ నే నేను చాలాసార్లు ఎక్కాను అలా అతను నాకు పరిచయమని ఆ అమ్మాయి చెప్పగానే.. అతని మాటలకి నేను ఫిదా అయిపోయాను అని అంటుంది. అతను మాట్లాడిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది.. అయితే అతనితో మాట్లాడటానికి నెంబర్ తీసుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాను అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు కానీ శైలు మాత్రం అతని గురించి మాట్లాడుతున్నావా అని కేశవ్ అని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక కేశవాణి ప్రేమిస్తున్న అమ్మాయి అనుకొని శైలు కొట్టడానికి వెళుతుంది కానీ కేశవ ని కాదు అని తెలుసుకున్న శైలు కదా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అతని తీసుకొని వెళ్ళిపోతుంది. తనని ప్రేమిస్తుంది అని ఆశపడ్డ కన్నాకి నిరాశ మిగిలింది.
మాధవ తన తమ్ముళ్లకు పెళ్లి కావాలి అంటే తన ముందు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు.. మామూలు సంబంధాలు అయితే రావట్లేదు అని ఎలాగైనా సరే ఏదో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని నా తమ్ముడు జీవితాన్ని నిలబెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.. ఈ క్రమంలో తన తమ్ముడి కోసం తన జీవితాన్ని త్యాగం చేసేందుకు సిద్ధపడతాడు మాధవ. కేశవ పెళ్లి కోసం తను రెండవ పెళ్లి అయిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఇక మీడియేటర్ ఆ అమ్మాయిని కలవాలి అని ఒక రెస్టారెంట్ కి రమ్మని చెప్తాడు. అక్కడికి వచ్చిన ఆ అమ్మాయి ప్రవర్తన చూసి మొదట మాధవ షాక్ అవుతాడు. జయంతి అని ఆమె పరిచయం చేసుకుంటుంది. తన ప్రవర్తన గురించి కాస్త అనుమాన పడ్డ కూడా ఆ తర్వాత తన భర్త రావడంతో ఆ అనుమానమే నిజమని మాధవ్ అనుకుంటాడు. ఏది ఏమైనా కూడా మాధవకు ఆ అమ్మాయికి సెట్ అయింది అని ఎపిసోడ్ ని చూస్తే అర్థమవుతుంది..
కన్నా బాధపడుతున్నాడు అని చూసిన చక్రి ఏమైంది వీడు అంతగా బాధపడిపోతున్నారు దేని గురించి బాధపడుతున్నాడు అని కేశవ్ అని ప్రశ్నలు వర్షం కురిపించి మరీ అడుగుతాడు.. అయితే నిజంగానే వీడు బాధపడుతున్నాడా అసలు ఏమైంది అని చక్రి అడగగానే కేశవ వాడిని ఆ అమ్మాయి ప్రేమించలేదట అని చెప్తాడు.. అవును ఉదయం తీసుకెళ్లినప్పుడు అదే చెప్పింది కదా.. మరి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది కదా.. మీ బస్సు చంపేస్తాను తీసుకెళ్లింది మరి ఏమి చేయలేదా అని కేశవా అడుగుతాడు. ఆ అమ్మాయి ప్రేమిస్తుంది నన్ను కాదు. నిన్ను.. అది ఏంట్రా నాకు పెళ్లయింది నువ్వు చెప్పలేదా? నాకు ఆల్రెడీ భార్య ఉంది అని నువ్వు చెప్పలేదా? అని చెక్రి మొదట బాధపడిపోతాడు.. కానీ ఆ తర్వాత మహాలక్ష్మిని చూసి నన్ను విక్కీ పేరు చెప్పి ఆడుకుంది కదా.. ఇప్పుడు నేను కూడా ఆడుకుంటాను అని మహాలక్ష్మిని పిలిచి మరి ఆడుకోవాలి అనుకుంటాడు. ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది అని చెప్పగానే మహాలక్ష్మి ఏమో నాకు తెలీదు అంటూ సీరియస్గా వెళ్ళిపోతుంది.
మాధవ రాత్రి వంట చేస్తూ ఉండగా ఫోన్ రావడంతో ఏంటి మాధవ ఫోన్ ఎత్తడానికి ఇంత టైం పట్టింది ఏమైంది అని మీడియేటర్ అడుగుతాడు.. వేరే పనిలో ఉండి చూసుకో లేదండి చెప్పండి ఆ అమ్మాయి ఏమంటుంది అని బాధ అడుగుతాడు. ఆ అమ్మాయికి నువ్వు బాగా నచ్చేసావంట ఓకే చెప్పింది మాధవ మంచి రోజు చూసుకుని ఒక రెండు రోజుల్లో వాళ్ళు చూడడానికి వస్తారట అని చెప్పగానే.. రెండు రోజులు అంటే మరీ కష్టం కదా అని మాధవ్ అంటాడు. సరేలెండి ఏదో ఒకటి చెప్పి నేను మేనేజ్ చేస్తాను మీరు రండి అని మాధవ్ అంటాడు.. ఉదయం లేవగానే చక్రి ఏమైంది రాత్రి ఎవరో ఫోన్ చేశారు రెండు రోజులైనా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. కానీ మహాలక్ష్మి మాత్రం వేరే వాళ్ళు ఫోన్ మాట్లాడుతుంటే అలా వినడం తప్పు కదా అని అడుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో గాయత్రి రావడంతో కన్నా ఒక ఆట ఆడుకుంటాడు. అటు చక్రి కూడా గాయత్రీ ని ఏడిపించడంతో తను చాలా ఫీల్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read : సీరియల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. కొత్త హీరోయిన్ ఎంట్రీ..